అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ టారిఫ్‌ల ప్రభావం భారత ఎగుమతులపై పడింది. ట్రంప్ ప్రభుత్వం భారతపై 50 శాతం వరకు సుంకాలు విధించడంతో, అమెరికాలోని ప్రముఖ రిటైల్ సంస్థలు భారత నుండి వస్తువులు పంపించవద్దని తమ సరఫరాదారులకు సూచించాయి.
అమెజాన్, వాల్మార్ట్, టార్గెట్, గ్యాప్ వంటి కంపెనీలు ఇప్పటికే తమ భారత ఎగుమతిదారులకు ఈ మేరకు మెయిల్స్, లెటర్స్ పంపినట్లు సమాచారం. కొత్త ఆదేశాలు వచ్చేవరకు అన్ని ఎగుమతులను తాత్కాలికంగా నిలిపేయాలని ఆ సూచనల్లో పేర్కొన్నారు.
ఈ పరిణామం వల్ల భారత్ నుంచి అమెరికాకు వెళ్లే వస్తువుల రవాణా తాత్కాలికంగా ఆగిపోయే అవకాశం ఉంది. వ్యాపార రంగం మాత్రం ఈ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది.