వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని కడప జైలులో బెదిరింపులకు గురి చేసిన ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రాజమండ్రి కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ రాహల్‌ను విచారణ అధికారిగా ప్రభుత్వం నియమించింది. దస్తగిరి ఫిర్యాదుతో ఇప్పటికే వివేకా హత్య కేసులో నిందితుడైన దేవిరెడ్డి శివశంకరరెడ్డి కుమారుడు డాక్టర్ దేవిరెడ్డి చైతన్యరెడ్డితో పాటు కడప సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఐఎన్ఎస్ ప్రకాశ్, జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు, ఎర్రగుంట్ల సీఐ ఈశ్వరయ్యలపై కేసు నమోదు కాగా, అక్రమ నిర్బంధం, నేరపూరిత బెదిరింపు, ఉద్దేశపూర్వక దాడి, హాని కలిగించడం, తప్పుడు సాక్ష్యం ఇవ్వాలని బెదిరించడం తదితర అభియోగాలు నమోదు చేయడం జరిగింది.
ఇది కూడా చదవండి: ఉగాది నుంచి ఏపీలో పీ4 విధానం అమలు! ఈ సలహాలు, సూచనలు ఆధారంగానే..
2023 అక్టోబర్, నవంబర్ నెలల్లోనే తనను బెదిరించారని అప్పట్లో దస్తగిరి, ఆయన భార్య పలు మార్లు ఫిర్యాదు చేసినా, మీడియా ముఖంగా చెప్పినా వైసీపీ అధికారంలో ఉండటంతో కేసు నమోదు కాలేదు. అనాటి ఘటనపై రెండు రోజుల క్రితం దస్తగిరి ఫిర్యాదు చేశాడు. దీంతో పులివెందుల పట్టణ పోలీసు స్టేషన్‌లో ఈ నెల 5న కేసు నమోదైంది. ఈ క్రమంలో ప్రభుత్వం రాజమండ్రి కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ రాహల్‌ను ఘటనపై విచారణ జరిపి నివేదిక అందజేయాలని ఆదేశించింది. శుక్రవారం ఉదయం కడప సెంట్రల్ జైలులో విచారణాధికారి రాహుల్ దస్తగిరిని ప్రశ్నించనున్నారు. అనంతరం ఈ కేసులో నిందితులుగా ఉన్న డాక్టర్ చైతన్యరెడ్డి, ప్రకాశ్‌లను విచారణకు పిలవనున్నారు. శుక్రవారం, శనివారం కడప జైలులో ఆయన విచారణ కొనసాగించనున్నారు.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం! ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నాకు భయం తెలియదు.. ఎలాంటి ప్రలోభాలకూ లొంగను! జగన్ వ్యాఖ్యలకు సాయిరెడ్డి ఘాటు కౌంటర్!
ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్! డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరి రూ. 1 లక్షా 60 వేలు..
కొనసాగుతున్న కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలకు ఆమోద ముద్ర! వారికి విద్యుత్ సహా పలు విభాగాల్లో..
USA: సంకెళ్లతో భారత వలసదారులు.. దారివెంట మృతదేహాలు.. వెలుగులోకి భారత వలసదారుల దీనగాథలు!
విలన్ గా మారుతున్న బ్రహ్మానందం.. థియేటర్ అంతా షేక్ అవుద్ది అంటూ.. వ్యాఖ్యలు వైరల్!
జగన్ దొంగ రాజకీయం.. ఆ డబ్బును లెక్కపెట్టడానికి.. వింటే దిమ్మ తిరిగిపోయే మ్యాటర్ ఇది!
ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు! ఎక్కడో తెలుసా?
జగన్ 2.0 కాదు, పాయింట్ 5 మాత్రమే! మాజీ మంత్రి తీవ్ర విమర్శలు! ఇలాంటి పరిస్థితుల్లో..
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో లోకేశ్ భేటీ! ఈ పథకం కింద రూ. 5,684 కోట్లు మంజూరు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: