6 నెలలు శిక్షణ తీసుకొంటే చాలు.. జపాన్ దేశంలో జాబ్ చేసుకోవచ్చు. విదేశంలో జాబ్ అంటే మోసాలు ఉండొచ్చేమో అని భయం అక్కర్లేదు. ప్రభుత్వమే శిక్షణ ఇస్తుంది. ప్రభుత్వమే జాబ్ అవకాశం అందిస్తుంది. అందువల్ల మీరు జాబ్ కొడితే మాత్రం అదృష్టవంతులే. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా త్వరపడండి. మీకు కోసం.. మీ బంగారు భవిష్యత్తు తిరగరాసే జాబ్. అది కూడా జపాన్ దేశంలో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యభివృద్ధి సంస్థ, నావిస్ హెచ్.ఆర్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఏఎన్ఎం, జిఎన్ఎం, బిఎస్సి నర్సింగ్, చదివిన వారికి జపనీస్ భాష ఎన్5, ఎన్ ఎన్3 స్థాయిలలో నేర్పించి, వారికి జపాన్ దేశంలో నర్సులుగా ఉద్యోగ అవకాశం కల్పించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి యం.గుణశేఖర్ రెడ్డి తెలిపారు. అభ్యర్థులు జపాన్ దేశంలో పనిచేయడానికి ఆసక్తి కలిగి ఉండాలి అని పేర్కొన్నారు. ఇంకా వీరికి 32 సంవత్సరాలు లోపు వయసు ఉండాలి తెలిపారు.
ఇంకా చదవండి: హైదరాబాదులోని అమెరికా కౌన్సిలేట్లో ఉద్యోగ అవకాశాలు! వెంటనే అప్లై చేసుకోండి ఇలా! జీతం ఎంతంటే!
ఇలాంటి అభ్యర్థులే అర్హులని వివరించారు. శిక్షణ కాలం 6 నెలలు ఉంటుందని తెలిపారు. శిక్షణ నావిస్ హెచ్ఐర్ బెంగళూరులో జరుగుతుందని వివరించారు. శిక్షణ ఫీజు రూ.3,50,000 వేలు అని తెలిపారు. పాక్షిక శిక్షణ రుసుం రూ.50వేలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ రూ. 25,000 చెల్లిస్తుందని మిగిలిన 25,000 రూపాయిలు అభ్యర్థి చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మిగిలిన 3,00,000 రూపాయలు మూడు విడతలుగా అభ్యర్థి చెల్లించాల్సిందిగా తెలియజేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి జపాన్ దేశం నందు ఉద్యోగ అవకాశం కల్పించటానికి కావాల్సిన సదుపాయాలు ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, నావిస్ హెచ్ఎర్ పర్యవేక్షిస్తుందని తెలిపారు. ఉద్యోగం పొందిన అభ్యర్థి జీతం 1,10,000 నుండి 1.40,000 వరకు ఉంటుంది అని తెలియజేశారు. ఆసక్తి కలిగిన వారు https://shorturl.at/FB7ok నమోదు చేసుకోవాలన్నారు. వివరాలు కొరకు 9381109098, టోల్ ఫ్రీ నెంబర్ 99888 53335 నెంబర్ ను సంప్రదించాలన్నారు.
ఇంకా చదవండి: జగన్ ట్వీట్ కు బ్రహ్మాజీ కౌంటర్! ఆకలి కేకలు వేస్తున్న వారికి సాయం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మరోసారి భారీ వర్షం... వెంటనే ఖమ్మం బయల్దేరిన డిప్యూటీ సీఎం! 15 సెంటీమీటర్ల వర్షపాతం!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్! పదో తరగతి అర్హతతో 39 వేల జాబ్స్! ఉద్యోగాల జాతరకు తెరలేపిన కేంద్రం!
వైసీపీకి షాక్ మీద షాక్! ఏలూరులో కొనసాగుతున్న వైసీపీ నేతల రాజీనామాల పర్వం! కారణం?
మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో సంబరాలు చేసుకుంటున్నారుగా!
టాప్ లెస్‌గా హైదరాబాదీ అమ్మాయి.. కుర్రాళ్లకు క్రాక్! సోషల్ మీడియా షేక్!
భార్యకు షాకిచ్చిన దువ్వాడ.. వాణి పోరాటం వృథానేనా! సోషల్ మీడియాలో ట్రోల్!
ఇక వరదలకు చెక్.. బుడమేరుకు రిటైనింగ్ వాల్ ప్రణాళిక! మంత్రుల కీలక వ్యాఖ్యలు!
స్టార్ హీరోలను మించి! ఏపీ, తెలంగాణాలకు రియల్ హీరో సోనూసూద్ భారీ విరాళం!
హైదరాబాదులోని అమెరికా కౌన్సిలేట్లో ఉద్యోగ అవకాశాలు! వెంటనే అప్లై చేసుకోండి ఇలా! జీతం ఎంతంటే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: