కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజనని తెచ్చింది. ఈ పథకం ప్రకారం ఇళ్లపై రాయితీతో సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవచ్చు. తద్వారా నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ లభిస్తుంది. నెలవారీ విద్యుత్ మిగిలితే, దాన్ని డిస్కంలకు అమ్ముకోవచ్చు కూడా. ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌లో అమలు చెయ్యడానికి ప్రభుత్వం గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసింది. ప్రజలపై కరెంటు ఛార్జీల భారాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. పీఎం సూర్య ఘర్ యోజన కింద ప్రతి ఇల్లూ సోలార్ విద్యుత్ వాడుకునేలా ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అంటే.. ఉదాహరణకు ఒకచోట 5 ఇళ్లు ఉంటే.. వాటిలో 3 ఇళ్లకు సోలార్ ప్యానెల్స్ పెట్టించుకుంటే.. ఆ ప్యానెళ్లు పెట్టించుకోని మిగతా 2 ఇళ్లకు కూడా సోలార్ పవర్ వచ్చేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. తద్వారా.. 5 ఇళ్లకు కూడా సోలర్ పవర్ అందుతుంది. అదే సమయంలో.. ప్యానెళ్లు పెట్టించుకోలేకపోయిన వారికి కూడా అతి తక్కువ ఖర్చుకే కరెంటు లభిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికిపైగా డ్వాక్రా మహిళలు ఉన్నారు కాబట్టి.. వారి ద్వారా ఈ పథకాన్ని విస్తరింపజెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇంకా చదవండి: గుడ్ న్యూస్.. చంద్రబాబు పలు పథకాల అమలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు! అకౌంట్లోకి రూ.15,000లు..
ఏపీ కూటమి ప్రభుత్వం ముందుగా లక్ష మంది డ్వాక్రా మహిళల ఇళ్లపై సోలార్ రూఫ్‌టాప్ అమర్చాలని నిర్ణయించింది. ఇప్పుడు ఈ పనిని గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (SERP)కి అప్పగించింది. సెర్ప్ అధికారులు డ్వాక్రా మహిళల్ని కలిసి.. వారికి ఈ పథకం గురించి పూర్తి వివరాలు చెబుతారు. ఆ తర్వాత ఎవరెవరికి ఆసక్తి ఉందో వారితో రిజిస్ట్రేషన్ చేయిస్తారు. ఐతే.. ఏపీలో ఆల్రెడీ 80,000 మంది ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు పెట్టించుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు. ఆల్రెడీ కొన్ని ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు పెట్టారు కూడా. వాటిని పెట్టించుకున్నవారిలో డ్వాక్రా మహిళలూ ఉన్నారు. ఈ పథకం ఇళ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇందులో 3 రకాల సామర్థ్యాలతో సోలార్ ప్యానెళ్లు ఇళ్ల పైకప్పులపై రాయితీతో ఏర్పాటు చేసుకోవచ్చు.
1 కిలోవాట్ కరెంటు కావాలనుకుంటే.. రూ.70 వేలు అవుతుంది. కేంద్రం ద్వారా ఏపీ ప్రభుత్వం రూ.30,000 రాయితీ ఇస్తుంది.
3 కిలోవాట్ల కరెంటు కావాలనుకుంటే.. రూ.1.40 లక్షలు అవుతుంది. దీనికి ఏపీ ప్రభుత్వం రూ.60,000 రాయితీ ఇస్తుంది.
ఇంకా చదవండి: ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం! భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు.. ఆ 29 గ్రామాల్లో మాత్రం పెరగవు..
3 కిలోవాట్ల కరెంటు కావాలనుకుంటే.. రూ.1.95 లక్షలు అవుతుంది. దీనికి కూటమి ప్రభుత్వం రూ.78,000 రాయితీ ఇస్తుంది. 1 కిలోవాట్ సోలార్ ప్యానెల్ పెట్టించుకుంటే.. రోజూ 4 యూనిట్ల దాకా కరెంటు ఉత్పత్తి అవుతుంది. అదే 2 కిలోవాట్ సోలార్ ప్యానెల్ పెట్టించుకుంటే.. రోజూ 8 యూనిట్ల దాకా కరెంటు ఉత్పత్తి అవుతుంది. అదే 3 కిలోవాట్ సోలార్ ప్యానెల్ పెట్టించుకుంటే.. రోజూ 12 యూనిట్ల దాకా కరెంటు ఉత్పత్తి అవుతుంది. దీన్ని బట్టీ నెలవారీ ఎంత ఉత్పత్తి అవుతుందో, ఎంత కరెంటు అవసరం ఉందో అంచనా వేసుకోవచ్చు. ఐతే.. రోజూ ఎండ ఒకేలా ఉండదు కాబట్టి.. నెలకు 100 యూనిట్లు కావాలి అనుకునేవారికి 1 కిలోవాట్ సరిపోయేలా ఉన్నా.. 2 కిలోవాట్ పెట్టించుకోవడం మేలు. తద్వారా ఎప్పుడైనా ఎండ తక్కువ ఉన్నా ఇబ్బంది ఉండదు. ఎలా ఏర్పాటు చేసుకోవాలి? డ్వాక్రా మహిళలు సెర్ప్ అధికారులను కలవాలి. తమకు సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చెయ్యించాలని కోరాలి. వారు పూర్తి వివరాలు చెప్పి.. ముందుగా.. 10 శాతం మనీ కట్టించుకుంటారు. మిగతా ఎంత చెల్లించాలో అంత బ్యాంకు ద్వారా 7 శాతం వడ్డీపై రుణం ఇప్పిస్తారు. రుణంతో పనిలేకుండా డైరెక్టుగా మనీ చెల్లించవచ్చు. ఒకవేళ లబ్ధిదారులు 10 శాతం మనీ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే, ఆ డబ్బును బ్యాంకు, స్త్రీనిధి, లేదా పొదుపు గ్రూపుల నుంచి ఇస్తారు. ఇక కేంద్రం ద్వారా రాష్ట్రం ఇచ్చే రాయితీ.. లబ్దిదారు అయిన మహిళ అకౌంట్‌లో జమ అవుతుంది. జమ అయిన తర్వాత బ్యాంకులో.. చెల్లించి.. రుణం కొంత తీర్చేసుకోవచ్చు. ఆ తర్వాత నెలవారీ చిన్న మొత్తాల రూపంలో అప్పు తీర్చేసుకోవచ్చు.
ఇంకా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి కూటమి ప్రభుత్వం కీలక చర్యలు! ఇవాళ రెపట్లో జాబితా విడుదల!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక కారణాలు వెల్లడించిన కేతిరెడ్డి! ఆ సమయంలో కొన్ని తప్పులు..!
తీవ్ర ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ.. రెండు కార్లు, నాలుగు ద్విచక్ర వాహనాలు!
డ్వాక్రా మహిళల కోసం సర్కార్ భారీ ప్రణాళిక! లక్షల కుటుంబాలకు సోలార్ రూఫ్ టాప్ సౌకర్యం!
దిమ్మతిరిగే ఆఫర్.. రూ.15 వేల స్మార్ట్‌ఫోన్ ఎంత తక్కువకి వస్తుందో.. లక్కీ ఛాన్స్ గురు..
షాక్ షాక్ షాక్... జగన్ గూబగుయ్యుమనిపించిన నంబర్ టు, నంబర్ త్రీ! రాజకీయాల నుంచి అవుట్!
శుభవార్త చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం! ఫిబ్రవరి 1న కొత్త పథకం ప్రారంభం!
కేంద్ర ప్రభుత్వం 139 మందికి పద్మ పురస్కారాలు.. ఆ వివరాలు మీకోసం!
మూడో మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా! 62 వేల గ్రూపుల సలహాలు, సూచనలు..
విజయసాయిరెడ్డి రాజీనామాపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! పార్టీ పరిస్థితి కూడా..
ఈ విషయంలో భారతీయుల గుండెల్లో గుబులు! అమెరికా వద్దంటే.. ఈ దేశాలు రారమ్మంటున్నాయ్.. ఆ వివరాలు..
రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త! వారి అకౌంట్లలోకి రూ.53 వేలు జమ!
ఎమ్మెల్యే పై టమాటాలు, గుడ్లు విసిరిన జనం.. దీంతో గ్రామసభలో ఉద్రిక్తత!
ఢిల్లీ నుంచి విజయవాడ బయల్దేరిన చంద్రబాబు! 2025-26 కేంద్ర బడ్జెట్లో ఏపీకి..
ప్రభుత్వ పాఠశాలలో నా బర్త్ డే వేడుకలు.. లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు! బాధ్యులపై వెంటనే చర్యలు..
మంత్రికి తప్పిన ప్రమాదం.. కాన్వాయ్ లో ఒకదానికొకటి ఢీ కొన్న ఎనిమిది వాహనాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: