ఏపీలో మద్యం షాపులకు ఎక్కడా లేని డిమాండ్ ఏర్పడింది. రాష్ట్రంలో కొత్త మద్యం విధానం అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం మద్యం షాపుల లైసెన్స్ ల కోసం టెండర్ దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ నెల 1న ప్రారంభించిన దరఖాస్తుల ప్రక్రియ నేటితో ముగియనుంది. అయితే ఆరంభంలో కాస్త మందకొడిగా సాగిన ఈ ప్రక్రియ చివరికి వచ్చే నాటికి భారీ డిమాండ్ తో ముగియబోతోంది. ఏపీ, ఇతర రాష్ట్రాలతో పాటు ఏకంగా విదేశాల నుంచే మద్యం షాపుల టెండర్లు వేస్తున్నారు. నిన్న సాయంత్ర వరకూ అన్ని జిల్లాల నుంచి 65629 మద్యం షాపుల కోసం టెండర్ దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో విదేశాల నుంచి వచ్చిన దరఖాస్తులు కూడా ఉన్నట్లు ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ చైతన్య మురళి ప్రకటించారు. యూరప్, అమెరికా నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఇందులో అమెరికా నుంచే 20 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు.
ఇంకా చదవండి: అమెరికా పర్యటనకు వెళ్లనున్న ఏపీ మంత్రి నారా లోకేశ్! ఎందుకో తెలుసా?
మద్యం షాపుల దరఖాస్తుల గడువు ఇవాళ్టితో ముగియనుండగా 14న వేలం నిర్వహిస్తారు. వాస్తవానికి రాష్ట్రంలో మద్యం షాపుల లైసెన్స్ ల కోసం ఈ నెల 10 వరకే దరఖాస్తుల గడువు ఇచ్చారు. 11న మద్యం షాపుల టెండర్ల వేలం నిర్వహించి 12 నుంచి కొత్త విధానం అమల్లోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు తగినట్లుగానే నాలుగు రోజుల క్రితం వరకూ పరిమిత సంఖ్యలో మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. పలు చోట్ల అధికార కూటమి నేతలే సిండికేట్ గా మారి దరఖాస్తులు దాఖలు చేస్తున్నట్లు వార్తలు రావడంతో ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దీంతో దరఖాస్తుల సంఖ్య పెరగడం ప్రారంభమైంది. అదే సమయంలో రెస్పాన్స్ చూసి ప్రభుత్వం కూడా అప్లికేషన్ల గడువు నేటి వరకూ పొడిగించింది. వేలం తేదీనీ 14కు మార్చింది.
ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వెంటనే ఏపీకి వెళ్లిపోండి - 11 మంది తెలంగాణ ఐఏఎస్, ఐపీఎస్ లకు కేంద్రం ఆదేశం! కారణం ఏమిటి!
ఏపీలో బయటపడ్డ మరో నగ్న వీడియో! ఈసారి ఆ పార్టీ నేత బుక్కైయ్యడు! అసలు ఏమి జరిగింది!
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై పరువు నష్టం దావా! అనుచిత వ్యాఖ్యలపై కోర్టు నోటీసులు!
రాష్ట్రాలకు పన్నుల వాటా విడుదల చేసిన కేంద్రం... ఏపీ, తెలంగాణకు ఎంతంటే! అత్యధికంగా యూపీకి!
ఏపీ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్! గోదావరి పుష్కరాలకు రూ.100 కోట్లు విడుదల!
చిలకలూరిపేటలో ఐసీఐసీఐ బ్యాంకు భారీ కుంభకోణం! సీఐడీ విచారణలో సంచలన రహస్యాలు!
వైసీపీ పతనానికి కర్త, కర్మ, క్రియ అన్నీ జగనే! కలలో కూడా రెడ్ బుక్కే వస్తుంది!
రెండు రోజుల్లో 2 అడుగుల ఎత్తు, 3 అడుగుల వెడల్పు పుట్ట గొడుగు! మన్యం అడవుల్లో వింత ప్రకృతి దృశ్యం!
ఏపీలో కొత్త మద్యం దుకాణాలకు వెల్లువెత్తిన దరఖాస్తులు! ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: