తెలుగు ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తనకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై మరోసారి స్పందించారు. తాను కోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటానని, అప్పటి వరకు ఎలాంటి పుకార్లు, అబద్దాలు నమ్మవద్దని నాగార్జున తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. ఎన్ కన్వెన్షన్ మీద వస్తున్న వార్తల్లో నిజాల కంటే అబద్దాలే ఎక్కువ ఉన్నాయని అన్నారు. ఎన్ కన్వెన్షన్ పూర్తిగా పట్టా భూమిలోనే నిర్మించాము. చెరువులో ఒక్క సెంటు భూమి కూడా ఆక్రమించలేదు.
ఇంకా చదవండి: ఏపీ గుడ్ న్యూస్.. ఈ స్కీమ్ కి మీరు అర్హులా! అయితే ఇప్పుడే అప్లై చేయండి! మీ లైఫ్ సెటిల్ చేసుకోండి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆ భూమి డాక్యుమెంట్లు అన్నీ మా దగ్గర ఉన్నాయి. ఎలాంటి కబ్జా జరగలేదని కోర్టు కూడా తీర్పు ఇచ్చింది. కేసు ఇంకా కోర్టులో ఉండగానే మా నిర్మాణాన్ని అన్యాయంగా కూల్చివేశారు. ఇది సరైనది కాదు. ఇక మీడియాలో అనేక పుకార్లు, అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. దయచేసి నా శ్రేయోభిలాషులు, అభిమానులు వాటిని నమ్మకండి. నాకు కోర్టుల మీద చాలా నమ్మకం ఉంది. న్యాయం నావైపే ఉన్నపుడు, తీర్పు కూడా నాకు అనుకూలంగానే వస్తుందని నాగార్జున అన్నారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బంపర్ ఆఫర్! గెలిస్తే రూ.50 లక్షలు మీవే!
అతడు జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే! జగన్ పై హోంమంత్రి అనిత వ్యాఖ్యలు!
ఎయిర్ ఇండియాకు భారీ షాక్ ఇచ్చిన DGCA! ఏకంగా రూ.98 లక్షల జరిమానా!
ఎన్నికల వేళ ట్రంప్, కమలా హారిస్ అరెస్ట్! వైరల్ అవుతున్న వీడియో!
అనిల్ అంబానీ సహా 24 సంస్థలపై సెబీ చర్యలు! రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కుంభకోణం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: