మన భారతీయ వంటకాల్లో బెండకాయకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. చిన్నప్పుడు పెద్దవాళ్లు బెండకాయ తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది అని చెప్పేవారు. ఈ మాటల్లో నిజం ఉందో లేదో అని ఇప్పుడు ఆధునిక శాస్త్రవేత్తలు కూడా పరిశోధనలు చేస్తున్నారు.
పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా బెండకాయను నిస్సందేహంగా తినవచ్చు. కొందరు పిల్లలు బెండకాయను ఇష్టపడకపోవచ్చు, కానీ దాని ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. బెండకాయ వల్ల పిల్లల నుండి పెద్దల వరకు ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
బెండకాయలో ఫైబర్, ఫోలేట్, కాల్షియం, మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. ముఖ్యంగా, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో ఇది చాలా సహాయపడుతుంది. బెండకాయలో ఉండే విటమిన్ సి, విటమిన్ కె వంటి పోషకాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
మధుమేహం ఉన్నవారు ఉదయాన్నే పరగడుపున బెండకాయ రసం తాగడం ద్వారా వారి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది. బెండకాయ మెదడులోని వాపును తగ్గించి, హైపోథాలమస్ ఇన్సులిన్ సున్నితత్వాన్ని పునరుద్ధరిస్తుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. హైపోథాలమస్ అనేది మెదడులో శక్తిని నియంత్రించే కేంద్రం.ముఖ్యంగా చిన్నప్పుడు అధిక పోషకాహారం తీసుకున్నవారిలో ఇది బాగా ఉపయోగపడుతుంది.
బెండకాయ కూర, బెండకాయ రసం లేదా ఉడికించిన బెండకాయలను తీసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, కంటి చూపు, మరియు జీర్ణక్రియ మెరుగుపడతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే...