సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణికురాలిపై ఓ యువకుడు లైంగిక దాడికి యత్నించాడు. ఈ క్రమంలో మహిళ రైలు నుంచి కిందపడడంతో గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో మిర్యాలగూడ స్టేషన్‌కు చేరుకుంటున్న సమయంలో రైలు వేగం తగ్గింది. అదే సమయంలో ఎస్-2 బోగీలో ఉన్న ఓ మహిళ వాష్ రూము నుంచి తన సీటు వద్దకు వెళ్తుండగా మద్యం మత్తులో డోర్ వద్ద ఉన్న యువకుడు ఆమె నడుము పట్టుకుని కిందికి లాగాడు. దీంతో ఆమె కిందపడిపోయింది.
ఇంకా చదవండి: ఉద్యోగాలు పేరుతో మోసాలు పట్ల తస్మాత్ జాగ్రత్త! కార్యక్రమం ద్వారా 44 ఫిర్యాదులు!
రైలు కొద్దిదూరం వెళ్లిన తర్వాత యువకుడు కూడా కిందపడ్డాడు. కిందపడిన మహిళ నడుచుకుంటూ సమీపంలోని తండా వద్దకు వెళ్లి విషయం చెప్పింది. వారు రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో వారొచ్చి అంబులెన్స్‌లో బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. అలాగే, రైల్వే పట్టాలపై పడి ఉన్న నిందితుడిని కూడా గుర్తించి ఆసుపత్రికి తరలించారు. అతడిని ఒడిశాకు చెందిన బిశ్వాస్‌గా గుర్తించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన బాధితురాలు ఓ ప్రైవేట్ టీచర్‌గా పనిచేస్తున్నట్టు తెలిసింది. ఆమె ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇంకా చదవండి: రోజాలో ఏంటీ సడన్ ఛేంజ్! అడుగులు ఎటు! సోషల్ మీడియాలో భారీ ఎత్తున కామెంట్లు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీపై ఆగ్రహంగా బంగాళాఖాతం? భారీ నుంచి అతి భారీ వర్షాలు! వాతావరణ కేంద్రం అలర్ట్!
ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా ఛార్జీల పెంపు! ఉన్నత విద్య కోసం వెళ్ళే విద్యార్థులకు భారీ షాక్!
ఆ రోజు భూమికి అతి దగ్గరగా రానున్న ఆస్టరాయిడ్! నాసా ఏం చెప్తుంది అంటే!
మంత్రులతో కలిసి రేపు విజయవాడకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి! ఎందుకో తెలుసా?
మీకు ఇది తెలిస్తే ఆశ్చర్యపోతారు! 30 ఏళ్లుగా ఒక్క చీర కూడా కొనని సుధామూర్తి!
అమెరికాలో కాల్పుల మోత! ఇంటి యజమాని సహా నలుగురి మృతి! కాల్చింది ఎవరో కాదు సొంత కొడుకే! కారణం?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: