ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మరో శుభవార్త వినిపించనున్నట్లు తెలిసింది. ఏపీకి మరో వందేభారత్ రైలును కేటాయించనున్నట్లు సమాచారం. ఏపీ మీదుగా ఇప్పటికే ఐదు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. విశాఖపట్నం- సికింద్రాబాద్ మధ్య రెండు, సికింద్రాబాద్- తిరుపతి, విజయవాడ- చెన్నై, కాచిగూడ- బెంగళూరు మార్గంలో ఇప్పటికే వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. తాజాగా విశాఖపట్నానికి మూడో వందేభారత్ రైలును నడిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విశాఖపట్నం నుంచి ఒడిశాలోని దుర్గ్‌కు వందేభారత్ ట్రైన్ నడిపే యోచనలో రైల్వే అధికారులు ఉన్నట్లు సమాచారం. అయితే వాల్తేరు డివిజన్ నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
ఇంకా చదవండి: అదిరే గుడ్ న్యూస్! విశాఖపట్నం, విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసులు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మరోవైపు దుర్గ్- విశాఖపట్నం వందేభారత్ రైలు ఉదయం ఆరు గంటలకు దుర్గ్‌లో బయల్దేరనుంది. మధ్యాహ్నం 1.55 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఇక తిరిగి మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాలకు విశాఖపట్నం నుంచి బయల్దేరి రాత్రి పది గంటల 50 నిమిషాలకు దుర్గ్ చేరుకోనున్నట్లు తెలిసింది. మరోవైపు ఏపీ నుంచి బెంగళూరుకు సైతం వందేభారత్ రైళ్లు నడపాలనే ప్రతిపాదనలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో వందేభారత్ రైళ్లకు మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలోనే విజయవాడ నుంచి బెంగళూరుకు సైతం వందేభారత్ రైళ్లను నడపాలని రైల్వేశాఖకు ప్రతిపాదనలు వెళ్లాయి. ఈ ప్రతిపాదనను పరిశీలిస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా చెప్పారు. దీంతో ఈ మార్గంలో కూడా వందేభారత్ రైలు నడుపుతారనే వార్తలు వస్తున్నాయి.
ఇంకా చదవండి: ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి కాలరాత్రి సరిగ్గా నేటికీ సంవత్సరం! అన్యాయంగా అక్రమంగా దుష్టుడు చేసిన రాక్షస క్రీడ!
కాచిగూడ నుంచి బెంగళూరుకు ఓ వందేభారత్ రైలు ప్రస్తుతం నడుస్తోంది. అయితే ఇది అనంతపురం, ధర్మవరం మీదుగా నడుస్తోంది. రాజధాని ప్రాంతం నుంచి నేరుగా బెంగళూరుకు వందేభారత్ రైలు లేదు. దీంతో ఈ మార్గంలోనూ వందేభారత్ రైలు నడపాలనే డిమాండ్లు వస్తున్నాయి. దీనిపై కేంద్రం కూడా సానుకూలత వ్యక్తం చేసింది. అయితే అటు విజయవాడ నుంచి ముంబైకు కూడా వందేభారత్ రైలు నడపాలని డిమాండ్లు వచ్చాయి. అయితే ఈ ప్రతిపాదనలను కేంద్ర రైల్వేశాఖ అంగీకరించలేదు. విజయవాడ నుంచి మంబయి మధ్య వందేభారత్ రైలు పగటిపూట నడపటం అసాధ్యమని ఇటీవల అశ్వినీ వైష్ణవ్ తేల్చేశారు. ఈ నేపథ్యంలో అన్నీ అనుకున్నట్లు జరిగితే విశాఖ - దుర్గ్‌తో పాటు.. విజయవాడ- బెంగళూరు మధ్యన కూడా వందేభారత్ రైలు నడవనుంది.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
చంద్రబాబును అరెస్ట్ చేసి నేటికి ఏడాది! ఆరోజు ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్నారు! మంత్రి ఫైర్!
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం! ఆ వ్యాపారవేత్తకు బెయిల్!
ఎమ్మెల్యే తృటిలో తప్పిన పెను ప్రమాదం! ఆలపాడు - కొల్లేటికోట రహదారి పూర్తిగా!
జగన్ ట్వీట్ కు బ్రహ్మాజీ కౌంటర్! ఆకలి కేకలు వేస్తున్న వారికి సాయం!
మరోసారి భారీ వర్షం... వెంటనే ఖమ్మం బయల్దేరిన డిప్యూటీ సీఎం! 15 సెంటీమీటర్ల వర్షపాతం!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్! పదో తరగతి అర్హతతో 39 వేల జాబ్స్! ఉద్యోగాల జాతరకు తెరలేపిన కేంద్రం!
వైసీపీకి షాక్ మీద షాక్! ఏలూరులో కొనసాగుతున్న వైసీపీ నేతల రాజీనామాల పర్వం! కారణం?
మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో సంబరాలు చేసుకుంటున్నారుగా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: