LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
National

Swatch Andhra: శ్రీకాకుళం జిల్లాలో స్వచ్ఛాంధ్ర దిశగా అడుగులు.. రాజాంలో వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రం పరిశీలించిన ఛైర్మన్ పట్టాభి!

Swatch Andhra: రాష్ట్రాన్ని శుభ్రంగా, ఆరోగ్యకరంగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛాంధ్ర కార్యక్రమం వేగంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు.

AndhraPravasi News Desk 1 min read
Swatch Andhra: శ్రీకాకుళం జిల్లాలో స్వచ్ఛాంధ్ర దిశగా అడుగులు.. రాజాంలో వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రం పరిశీలించిన ఛైర్మన్ పట్టాభి!

శ్రీకాకుళం జిల్లాలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్ పర్యటన..

రాజాంలో డంపింగ్ యార్డ్ పరిశీలించిన ఛైర్మన్ పట్టాభి..

శ్రీకాకుళం: రాష్ట్రాన్ని శుభ్రంగా, ఆరోగ్యకరంగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛాంధ్ర కార్యక్రమం వేగంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. రాజాం పట్టణంలోని డంపింగ్ యార్డ్‌ను పరిశీలించి, అక్కడి పరిస్థితులను సమీక్షించారు.

ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ, రాష్ట్రాన్ని పూర్తిగా డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్‌గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. చెత్తను కేవలం పారేయడం కాకుండా, శాస్త్రీయ పద్ధతుల్లో ప్రాసెస్ చేసి పర్యావరణానికి హాని లేకుండా నిర్వహించే విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.530 కోట్ల వ్యయంతో 107 ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా రాజాంలో ఒక ఎకరం స్థలంలో ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ నిర్మాణం చేపట్టామని వివరించారు. ఈ కేంద్రాన్ని రూ.1.62 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నట్లు తెలిపారు.

ప్రతి రోజూ ఉత్పత్తి అయ్యే చెత్తను అదే రోజున ప్రాసెస్ చేసే విధంగా ఆధునిక సదుపాయాలను కల్పిస్తున్నామని పట్టాభి పేర్కొన్నారు. దీంతో చెత్త పేరుకుపోవడం తగ్గి, పట్టణాలు మరింత పరిశుభ్రంగా మారుతాయని అన్నారు. ఈ పర్యటనలో స్థానిక అధికారులు, సిబ్బంది పాల్గొని ప్రాజెక్టు పురోగతిపై వివరాలు అందించారు. ప్రజల సహకారం ఉంటే స్వచ్ఛాంధ్ర లక్ష్యం త్వరలోనే సాధ్యమవుతుందని ఛైర్మన్ పట్టాభి ఆశాభావం వ్యక్తం చేశారు.

Be the first to react

More Coverage

Ram Mohan Naidu: ఏర్ ఇండియా AI-171 ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు!

Ram Mohan Naidu: ఏర్ ఇండియా AI-171 ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు!

Ram Mohan Naidu: ఏర్ ఇండియా విమానం AI-171 ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని కేంద్ర పౌర విమానయాన శ…

Strait of Hormuz: ఇటీవల దాడుల్లో ముగ్గురు భారతీయుల మృతి.. తాజా దాడి పుకార్లతో ఒమన్ తీరంలో ఒక్కసారిగా ఉత్కంఠ!

Strait of Hormuz: ఇటీవల దాడుల్లో ముగ్గురు భారతీయుల మృతి.. తాజా దాడి పుకార్లతో ఒమన్ తీరంలో ఒక్కసారిగా ఉత్కంఠ!

Strait of Hormuz: ఒమన్‌ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న మరో వాణిజ్య నౌకపై దాడి జరిగిందన్న వా…

Supreme Court: మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో దక్కని ఊరట! రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై పిటిషన్ కొట్టివేత!

Supreme Court: మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో దక్కని ఊరట! రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై పిటిషన్ కొట్టివేత!

Supreme Court: మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన నామినే…