LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
National

Swatch Andhra: గ్రామాల పరిశుభ్రతకు ప్రజల భాగస్వామ్యం అవసరం.. మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి!

Swatch Andhra: ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండలో నిర్వహించిన “స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర” కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పాల్గొన్నారు.

AndhraPravasi News Desk 2 min read
Swatch Andhra: గ్రామాల పరిశుభ్రతకు ప్రజల భాగస్వామ్యం అవసరం.. మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి!

మన ఇల్లు, మన వీధి, మన గ్రామం నినాదంతో ప్రతి ఒక్కరూ పరిశుభ్రత చర్యలు పాటించాలి..

గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత..

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండలో నిర్వహించిన “స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర” కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పాల్గొన్నారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి స్పష్టం చేశారు.

కార్యక్రమంలో భాగంగా మంత్రి స్వయంగా డస్ట్‌బిన్ పట్టుకుని చెత్తను సేకరించి పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం ప్రజలతో కలిసి పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు. “మన ఇల్లు – మన వీధి – మన గ్రామం” అనే నినాదంతో ప్రతి ఒక్కరూ పరిశుభ్రత చర్యల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

మంత్రి మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. మన ఇల్లు శుభ్రంగా ఉండటమే కాకుండా మన వీధి, గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రం కూడా పరిశుభ్రంగా ఉండేలా అందరూ కృషి చేయాలని సూచించారు.

రాష్ట్రం ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి “తల్లికి వందనం”, “స్త్రీ శక్తి”, “దివ్యాంగశక్తి”, “దీపం”, “అన్నదాత సుఖీభవ” వంటి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు.

మహిళల సాధికారతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి పేర్కొన్నారు. సెర్ప్, మెప్మా, డీఆర్‌డీఏ సంస్థల సహకారంతో మహిళలకు సబ్సిడీ రుణాలు అందించి స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ చర్యలతో మహిళలు ఆర్థికంగా బలపడుతున్నారని చెప్పారు.

కూటమి ప్రభుత్వ పాలనలో గ్రామాల్లో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని మంత్రి అన్నారు. గ్రామాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు.

ప్రస్తుత యుద్ధ పరిస్థితుల ప్రభావం దృష్ట్యా ప్రజలంతా పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారని మంత్రి గుర్తుచేశారు. అదే కారణంతో సీఎం చంద్రబాబు మహానాడు కార్యక్రమాన్ని కూడా రద్దు చేశారని చెప్పారు. భవిష్యత్తులో ఎదురయ్యే ఆర్థిక సమస్యలను ముందుగానే ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పొదుపు చర్యలు చేపట్టిందని తెలిపారు. ప్రజలంతా కూడా అవసరమైన చోట ఖర్చులను తగ్గించి పొదుపు అలవాటు చేసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమం అనంతరం మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సింగరాయకొండలోని వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, శ్రీ వీరాంజనేయస్వామి ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Be the first to react

More Coverage

Ram Mohan Naidu: ఏర్ ఇండియా AI-171 ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు!

Ram Mohan Naidu: ఏర్ ఇండియా AI-171 ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు!

Ram Mohan Naidu: ఏర్ ఇండియా విమానం AI-171 ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని కేంద్ర పౌర విమానయాన శ…

Strait of Hormuz: ఇటీవల దాడుల్లో ముగ్గురు భారతీయుల మృతి.. తాజా దాడి పుకార్లతో ఒమన్ తీరంలో ఒక్కసారిగా ఉత్కంఠ!

Strait of Hormuz: ఇటీవల దాడుల్లో ముగ్గురు భారతీయుల మృతి.. తాజా దాడి పుకార్లతో ఒమన్ తీరంలో ఒక్కసారిగా ఉత్కంఠ!

Strait of Hormuz: ఒమన్‌ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న మరో వాణిజ్య నౌకపై దాడి జరిగిందన్న వా…

Supreme Court: మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో దక్కని ఊరట! రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై పిటిషన్ కొట్టివేత!

Supreme Court: మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో దక్కని ఊరట! రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై పిటిషన్ కొట్టివేత!

Supreme Court: మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన నామినే…