LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
National

Weather: ఏపీలో ఎండల తీవ్రత.. పలు ప్రాంతాల్లో వడగాలులు.. మరోవైపు పిడుగులతో వర్షాలు!

Weather: ఆంధ్రప్రదేశ్‌లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఎండలు తీవ్రంగా ఉండగా, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించారు.

AndhraPravasi News Desk 2 min read
Weather: ఏపీలో ఎండల తీవ్రత.. పలు ప్రాంతాల్లో వడగాలులు.. మరోవైపు పిడుగులతో వర్షాలు!

కొన్ని ప్రాంతాల్లో ఎండతీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..

రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు..

అమరావతి, మే 3: ఆంధ్రప్రదేశ్‌లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఎండలు తీవ్రంగా ఉండగా, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించారు.

ఆదివారం రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లా గూడూరులో 46.2°C, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 46.1°C నమోదయ్యాయి. మార్కాపురం జిల్లా కంభంలో 45.7°C, తిరుపతి జిల్లా బోనుపల్లెలో 45.6°C, పల్నాడు జిల్లా నడిగడ్డలో 44.2°C, బాపట్ల జిల్లా కారంచేడులో 44°C, కర్నూలు జిల్లా తోవిలో 43.9°C, చిత్తూరు జిల్లా తవణంపల్లెలో 43.8°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనంతపురం తెరన్నపల్లి, కడప వీరబల్లెలో 43.4°C, నంద్యాల బనగానపల్లె, ఎన్టీఆర్ జిల్లా చిలకల్లులో 43.1°C నమోదయ్యాయి.

మొత్తం 28 జిల్లాల్లో 16 జిల్లాలకు చెందిన 286 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదై ఎండ తీవ్ర ప్రభావం కనిపించినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా కడప, నెల్లూరు జిల్లాల్లో 33 మండలాలు చొప్పున, తిరుపతి 31, ప్రకాశం 28, పల్నాడు 25, మార్కాపురం 21, నంద్యాల 20, చిత్తూరు 20, కర్నూలు 18, బాపట్ల 16 మండలాల్లో ఎండలు అధికంగా నమోదయ్యాయి.

సోమవారం (మే 4) రాష్ట్రంలోని 27 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి, వంగర; పార్వతీపురం మన్యం జిల్లాలో పలుమండలాలు; పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లోని పలు మండలాల్లో వడగాలులు తీవ్రంగా ఉంటాయని తెలిపారు. ప్రజలు ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇదిలా ఉండగా, దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉందని అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో సోమవారం అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.

రైతులు వ్యవసాయ పనుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉరుములు, పిడుగులు ఉన్న సమయంలో పొలాల్లో పని చేసే వారు, కూలీలు, పశుకాపరులు చెట్ల కింద నిలబడకూడదని హెచ్చరించారు.

మరోవైపు ఆదివారం సాయంత్రం వరకు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో 72.7 మిమీ, కాట్రేనికోనలో 57.7 మిమీ, కాకినాడ జిల్లా పెద్దాపురంలో 50.2 మిమీ, పిఠాపురంలో 45.5 మిమీ, కాకినాడ రూరల్‌లో 43 మిమీ, అచ్చుతాపురంలో 42 మిమీ, కాకినాడ అర్బన్‌లో 41 మిమీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో ఎండలు, వడగాలులు ఒకవైపు, పిడుగులతో వర్షాలు మరోవైపు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Be the first to react

More Coverage

Ram Mohan Naidu: ఏర్ ఇండియా AI-171 ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు!

Ram Mohan Naidu: ఏర్ ఇండియా AI-171 ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు!

Ram Mohan Naidu: ఏర్ ఇండియా విమానం AI-171 ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని కేంద్ర పౌర విమానయాన శ…

Strait of Hormuz: ఇటీవల దాడుల్లో ముగ్గురు భారతీయుల మృతి.. తాజా దాడి పుకార్లతో ఒమన్ తీరంలో ఒక్కసారిగా ఉత్కంఠ!

Strait of Hormuz: ఇటీవల దాడుల్లో ముగ్గురు భారతీయుల మృతి.. తాజా దాడి పుకార్లతో ఒమన్ తీరంలో ఒక్కసారిగా ఉత్కంఠ!

Strait of Hormuz: ఒమన్‌ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న మరో వాణిజ్య నౌకపై దాడి జరిగిందన్న వా…

Supreme Court: మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో దక్కని ఊరట! రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై పిటిషన్ కొట్టివేత!

Supreme Court: మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో దక్కని ఊరట! రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై పిటిషన్ కొట్టివేత!

Supreme Court: మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన నామినే…