LIVE
Fuel Rates: వాహనదారులకు గుడ్ న్యూస్... త్వరలోనే తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!  •  Prajavedhika: మాజీ మంత్రి బంధువుపై గ్రీవెన్స్‌లో భూ కబ్జా ఫిర్యాదు.... వెబ్‌ల్యాండ్ సాంకేతిక లోపాలతో దొంగ పాస్ పుస్తకాలు.... బాధితులకు మంత్రి నారాయణ భరోసా!  •  APNRT: ప్రవాసాంధ్రులకు సువర్ణావకాశం... విదేశాల్లో కనకదుర్గమ్మ ప్రత్యేక గృహ పూజల సదుపాయం!  •  ఆయుష్మాన్ భారత్ కార్డ్‌తో రూ. 5 లక్షల ఉచిత వైద్యం! పూర్తి వివరాలు...  •  AP Students: విద్యార్థులకు అలర్ట్... ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కీలక ప్రకటన!  •  Chandrababu: జూన్ 10, 11 తేదీల్లో దేశ రాజధానిలోనే బస.. 11వ తేదీ రాత్రికి..  •  తెరపైకి కొత్త డిమాండ్... మాకు ఎస్సీ హోదా కల్పించండి!!  •  AP Government: సామాన్యుడికి ఊరట.. ఏపీలో త్వరలోనే 1,000 మినీ మార్టుల ఏర్పాటు! ఎక్కడక్కడంటే...  •  New Airport: ఏపీలో కొత్తగా ఎయిర్‌పోర్ట్... రూ.648 కోట్లతో నాలుగు జిల్లాలకు పండగే.. 2029నాటికి పూర్తి!  •  Gas Price Hike India: బిగ్ షాక్.. గ్యాస్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్.. సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను సగానికి పైగా తగ్గించిన కేంద్రం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
National

Weather Update: జూన్‌లో తక్కువ వర్షాలు.. ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో పెరగనున్న వడగాడ్పుల తీవ్రత!

Weather Update: ఈ ఏడాది దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తన తాజా నివేదికలో వెల్లడించింది.

AndhraPravasi News Desk 2 min read
Weather Update: జూన్‌లో తక్కువ వర్షాలు.. ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో పెరగనున్న వడగాడ్పుల తీవ్రత!
  • Environment: దీర్ఘకాల సగటులో 90 శాతం వర్షపాతమే నమోదయ్యే సూచనలు..
     
  • దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదుకు అవకాశం..

Weather Updateఈ:  ఏడాది దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తన తాజా నివేదికలో వెల్లడించింది. 2026 రుతుపవనాలకు సంబంధించి విడుదల చేసిన దీర్ఘకాలిక అంచనాల ప్రకారం, జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో వర్షపాతం దీర్ఘకాల సగటు (ఎల్‌పీఏ)లో కేవలం 90 శాతానికి పరిమితం కావొచ్చని తెలిపింది. ఈ అంచనాల్లో 4 శాతం అటూఇటూగా మార్పులు ఉండొచ్చని పేర్కొంది. దీంతో ఈసారి వర్షపాతం 'సాధారణం కంటే తక్కువ' కేటగిరీలోకి వస్తుందని, ఇది వ్యవసాయ రంగం, జలవనరులు, దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఈ అంచనాలకు ప్రధాన కారణంగా పసిఫిక్ మహాసముద్రంలో బలపడుతున్న ఎల్ నినో పరిస్థితులను ఐఎండీ పేర్కొంది. ఎల్ నినో సాధారణంగా రుతుపవన వ్యవస్థను బలహీనపరుస్తుంది. మరోవైపు, రుతుపవనాలకు మేలు చేసే ఇండియన్ ఓషన్ డైపోల్ (ఐఓడీ) ప్రస్తుతం తటస్థంగా ఉందని, రుతుపవన కాలంలో కూడా అలాగే కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఈ పరిస్థితులునేపథ్యంలో, ఈ సీజన్‌లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యేందుకు 84 శాతం అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. ఇటీవలి సంవత్సరాలలో ఇది అత్యంత బలహీనమైన రుతుపవన సీజన్లలో ఒకటిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది.

ప్రాంతాల వారీగా చూస్తే.. దేశంలోని అధిక వర్షాధార వ్యవసాయ ప్రాంతాలు ఉండే 'మాన్‌సూన్ కోర్ జోన్'లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉంటుందని అంచనా వేశారు. ఈశాన్య భారతంలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండగా, వాయువ్య, మధ్య, దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో లోటు వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ తెలిపింది. అయితే, వాయువ్య, ఈశాన్య, తూర్పు భారతంలోని కొన్ని ప్రాంతాలతో పాటు దక్షిణ ద్వీపకల్పంలోని తూర్పు భాగాలలో అక్కడక్కడా సాధారణం నుంచి అధిక వర్షపాతం కురవవచ్చని పేర్కొంది.

ఇక, జూన్ నెలకు సంబంధించి దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ హెచ్చరించింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, బీహార్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, గుజరాత్ వంటి పలు రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ వడగాడ్పులు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నీటి యాజమాన్య పద్ధతులు, కరవును తట్టుకునే విత్తనాల ఎంపిక వంటి ప్రత్యామ్నాయ ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని సలహా ఇచ్చింది. జులై నెలకు సంబంధించిన పూర్తిస్థాయి అంచనాలను జూన్ చివరి వారంలో విడుదల చేయనున్నట్లు ఐఎండీ వెల్లడించింది.

వాతావరణ శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం, పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఏర్పడే ఎల్ నినో ప్రభావం భారత ఉపఖండంపై తీవ్రంగా మారనుంది. వర్షాలు సకాలంలో పడకపోతే ఖరీఫ్ సీజన్ పంటల సాగు గణనీయంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వరి, పత్తి, పప్పుధాన్యాల వంటి ప్రధాన పంటల దిగుబడి తగ్గి, మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటుతున్న తరుణంలో, వాతావరణ శాఖ ఇచ్చిన ఈ హెచ్చరికలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు కరవు నివారణ చర్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తాగునీటి సరఫరాకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ వనరులను సిద్ధం చేసుకోవడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకాలను మరింత బలోపేతం చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఏర్పడే నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు వీలుగా పట్టణ, గ్రామీణ ప్రజలు కూడా ఇప్పటి నుంచే నీటిని పొదుపుగా వాడుకోవాలని వాతావరణ నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Be the first to react

More Coverage

Pawan Kalyan: ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేడుకల్లో పవన్ కళ్యాణ్.. 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీకి శ్రీకారం!

Pawan Kalyan: ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేడుకల్లో పవన్ కళ్యాణ్.. 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీకి శ్రీకారం!

Pawan Kalyan: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు…

Environment: పర్యావరణ పరిరక్షణలో భారత్‌ ముందంజ.. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రుల సందేశం!

Environment: పర్యావరణ పరిరక్షణలో భారత్‌ ముందంజ.. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రుల సందేశం!

Environment: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ స…

Chandrababu: రేపు విశాఖలో చంద్రబాబు పర్యటన.. సీఫుడ్ ఎగుమతుల జాతీయ వర్క్‌షాప్‌లో పాల్గొననున్న సీఎం!

Chandrababu: రేపు విశాఖలో చంద్రబాబు పర్యటన.. సీఫుడ్ ఎగుమతుల జాతీయ వర్క్‌షాప్‌లో పాల్గొననున్న సీఎం!

Chandrababu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ప్రపంచ పర్యా…