Mumbai To Dubai: ఫ్లైట్ కాదండోయ్... ఇప్పుడు ట్రైన్ లోనే 2 గంటల్లో ముంబయి టు దుబాయ్... ఎలాగనుకుంటున్నారా!

2025-12-27 18:40:00
Bank Holidays: ఏపీ, తెలంగాణలో బ్యాంక్ సెలవుల పూర్తి జాబితా ఇదే!

ముంబయి నుంచి దుబాయ్‌కు కేవలం రెండు గంటల్లో ప్రయాణించే అవకాశం త్వరలోనే వాస్తవంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సుమారు 1,900 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ మార్గాన్ని విమానంలోనే ఎక్కువ సమయం పడుతోంది. అయితే, హై స్పీడ్ అండర్‌వాటర్ ట్రైన్ ద్వారా ఈ దూరాన్ని కేవలం 120 నిమిషాల్లో పూర్తి చేయాలన్న ప్రతిపాదన ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ప్రాజెక్ట్ అమలైతే రవాణా రంగంలో విప్లవాత్మక మార్పు రానుంది.

District Redivision: జిల్లాల పునర్విభజనపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. తుది నోటిఫికేషన్ కు ముహూర్తం ఫిక్స్!!

భారత్ – యూఏఈ దేశాలను కలుపుతూ అరేబియా సముద్రం అడుగున ఈ ప్రత్యేక రైలు మార్గాన్ని నిర్మించాలని భావిస్తున్నారు. ఈ హై స్పీడ్ ట్రైన్‌కు “డీప్ బ్లూ ఎక్స్‌ప్రెస్” అనే పేరు ప్రచారంలో ఉంది. గంటకు 600 నుంచి 1000 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు ప్రయాణిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇది చాలా విమానాల కంటే కూడా వేగంగా ఉండడం విశేషం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రజల్లో ఉత్కంఠను పెంచుతున్నాయి.

Prakash Raj: మేమంతా నీతోనే అనసూయకు ప్రకాశ్ రాజ్ ట్వీట్.. డ్రెస్ కాదు.. టాలెంట్‌దే అసలైన అడ్రస్.. SKN!

ఈ రైలు ప్రయాణం కేవలం వేగానికే కాదు, అనుభూతికీ ప్రత్యేకంగా ఉండనుంది. సముద్ర మట్టానికి సుమారు 200 మీటర్ల లోతులో టన్నెల్ నిర్మించి, అందులో విశాలమైన గాజు కిటికీలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ప్రయాణికులు సముద్రంలో ఈదే చేపలు, తిమింగలాలు, సొరచేపలను ప్రత్యక్షంగా చూస్తూ ప్రయాణించగలుగుతారు. ప్రపంచంలోనే అతిపొడవైన ఆక్వేరియంలో సూపర్ ఫాస్ట్ ట్రైన్‌లో ప్రయాణించిన అనుభూతి కలగనుంది.

PSB Merger Plan: చిన్న బ్యాంకులకు కౌంట్‌డౌన్..? భారీ బ్యాంకులతో కలిపే యోచన!

ఈ అండర్‌వాటర్ ట్రైన్ ప్రాజెక్ట్ వల్ల రెండు ప్రధాన ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఒకటి – ప్రయాణ సమయం భారీగా తగ్గడం. రెండోది – భారత్ నుంచి దుబాయ్‌కు చమురు, మంచినీటి సరఫరాను మరింత సులభతరం చేయడం. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి 50 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు అవుతుందని, దాదాపు 50 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారని అంచనా వేస్తున్నారు.

Viral video : ఢిల్లీ కంటే బెంగళూరే రాజధానిగా బెటర్.. వైరల్ అవుతున్న వీడియో!!

ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి స్థాయి ప్రణాళికలు ఖరారు కాకపోయినా, భారత్ – యూఏఈ దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ అమలైతే ముంబయి ప్రపంచ స్థాయి రవాణా కేంద్రంగా మారే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే ఇరు దేశాల మధ్య ప్రయాణ ఖర్చులు సుమారు 60 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రవాణా రంగంలో ఇది చారిత్రక ముందడుగుగా నిలిచే అవకాశం ఉంది.

International Relations: ఉక్రెయిన్ యుద్ధంపై కీలక మలుపు? ట్రంప్‌తో భేటీకి జెలెన్స్కీ సిద్ధం!!
Hot Soup: చికెన్, మటన్ పాయ కాదండోయ్..! చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి!
Land Issues: రైతుల భూ సమస్యలకు ఫుల్ స్టాప్…! రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ క్లినిక్‌లు!
India China : చైనాతో సై అంటున్న భారత్.. సరిహద్దుల్లో మౌలిక వసతులకు టర్బో స్పీడ్!
Women Rights: మహిళల దుస్తులపై తీర్పులా..? నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్!

Spotlight

Read More →