TTD Chairman: వైసీపీ సోషల్ మీడియా వింగ్‌కు షాక్..! కోర్టు ఆర్డర్‌తో నోరు మూయించిన బి.ఆర్. నాయుడు! AP Assembly: మంత్రి ఆనంపైకి దూసుకెళ్లిన వైసీపీ ఎమ్మెల్సీ.. మండలిలో రణరంగం! Nirukonda Reservoir: రూ. 400 కోట్లతో నీరుకొండ రిజర్వాయర్ ప్రాజెక్ట్!! శరవేగంగా సాగుతున్న పనులు... Nara Lokesh: అసెంబ్లీలో నారా లోకేష్ భావోద్వేగ ప్రసంగం! ఫ్యాక్షన్ రాజకీయాలకు చరమగీతం! Central Government: ఉపాధి హామీలో కొత్త హాజరు పద్ధతి! కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిబంధన ఇదే..! Land Issues: భూ సమస్యలకు చెక్... మంత్రి కీలక ప్రకటన! జిల్లాకు ఒక ప్రత్యేక అధికారి.... Praja Vedika: నేడు (04/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Medical Colleges: మెడికల్ కాలేజీలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు... గత ప్రభుత్వంపై విమర్శలు! Chandrababu: మహిళా దినోత్సవం వేళ ఏపీలో పథకాల జాతర.. చంద్రబాబు కీలక నిర్ణయాలు! Lokesh: లోకేష్ డిన్నర్ మీట్.. ఉండవల్లి నివాసంలో సందడి చేసిన నెల్లూరు, తిరుపతి నేతలు! TTD Chairman: వైసీపీ సోషల్ మీడియా వింగ్‌కు షాక్..! కోర్టు ఆర్డర్‌తో నోరు మూయించిన బి.ఆర్. నాయుడు! AP Assembly: మంత్రి ఆనంపైకి దూసుకెళ్లిన వైసీపీ ఎమ్మెల్సీ.. మండలిలో రణరంగం! Nirukonda Reservoir: రూ. 400 కోట్లతో నీరుకొండ రిజర్వాయర్ ప్రాజెక్ట్!! శరవేగంగా సాగుతున్న పనులు... Nara Lokesh: అసెంబ్లీలో నారా లోకేష్ భావోద్వేగ ప్రసంగం! ఫ్యాక్షన్ రాజకీయాలకు చరమగీతం! Central Government: ఉపాధి హామీలో కొత్త హాజరు పద్ధతి! కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిబంధన ఇదే..! Land Issues: భూ సమస్యలకు చెక్... మంత్రి కీలక ప్రకటన! జిల్లాకు ఒక ప్రత్యేక అధికారి.... Praja Vedika: నేడు (04/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Medical Colleges: మెడికల్ కాలేజీలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు... గత ప్రభుత్వంపై విమర్శలు! Chandrababu: మహిళా దినోత్సవం వేళ ఏపీలో పథకాల జాతర.. చంద్రబాబు కీలక నిర్ణయాలు! Lokesh: లోకేష్ డిన్నర్ మీట్.. ఉండవల్లి నివాసంలో సందడి చేసిన నెల్లూరు, తిరుపతి నేతలు!

Women Rights: మహిళల దుస్తులపై తీర్పులా..? నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్!

హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై వివిధ వర్గాల నుంచి విమర్శలు

Published : 2025-12-27 13:22:00
Flipkart Discount: 50MP కెమెరా, 3D కర్వడ్‌ డిస్‌ప్లే, 5500mAh బ్యాటరీ సహా.! ఈ ఫోన్‌పై రూ.2000 డిస్కౌంట్‌.!


హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై వివిధ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో జనసేన పార్టీ ఎమ్మెల్సీ, సినీ నటుడు నాగబాబు స్పందించారు. మహిళల దుస్తులపై మాట్లాడటం, వారి వ్యక్తిగత ఎంపికలపై తీర్పులు చెప్పడం సరైంది కాదని ఆయన స్పష్టంగా ఖండించారు. తాను ఈ అంశంపై రాజకీయ నాయకుడిగా కాకుండా, ఒక సాధారణ పౌరుడిగా మాట్లాడుతున్నానని పేర్కొంటూ, మహిళల స్వేచ్ఛ, హక్కులపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

Chinese manga: పతంగి ఆటలో మృత్యుదారం.. మాంజా తయారీ వెనుక భయంకర నిజాలు!

మహిళలు ఏ దుస్తులు ధరించాలనేది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయమని నాగబాబు అన్నారు. ఆ విషయంలో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. మహిళలపై జరుగుతున్న నేరాలు, హింసలకు వారి వస్త్రధారణ కారణమని చెప్పడం పూర్తిగా తప్పు ఆలోచన అని వ్యాఖ్యానించారు. అసలు సమస్య పురుషుల ఆలోచనా విధానం, క్రూరమైన మనస్తత్వమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక పరిశోధనలు కూడా మహిళల దుస్తులకు, వారిపై జరిగే నేరాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా నిరూపించాయని నాగబాబు గుర్తుచేశారు. మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత వ్యక్తిగతంగా మహిళలపై కాదు, సమాజం, ప్రభుత్వాలపైనే ఉందని ఆయన అన్నారు.

సొంతింటి కల నిజం కాబోతోంది - మధ్యతరగతికి మోదీ సర్కార్ భారీ ఊరట! స్వామి-2 నిధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్.. లక్ష మందికి ఇళ్లు!

ఈ సందర్భంగా నాగబాబు మహిళలకు ఒక విజ్ఞప్తి కూడా చేశారు. “మీకు నచ్చినట్లు జీవించండి, మీకు నచ్చిన దుస్తులు ధరించండి. మీ ఎంపికలపై ఎవరి అనుమతీ అవసరం లేదు. అయితే, ప్రస్తుత సమాజ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, మీ భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండటం కూడా అవసరం. స్వీయ రక్షణ పద్ధతులు నేర్చుకోవడం, జాగ్రత్తలు పాటించడం మంచిదే” అని సూచించారు. ఇది మహిళల స్వేచ్ఛను కట్టడి చేయడం కోసం కాదు, వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని చెప్పిన మాటలేనని ఆయన స్పష్టం చేశారు.

Public Transport: ఉచిత బస్సు ప్రయాణంలో కొత్త అధ్యాయం..! మహిళలకు మల్టీ-యూజ్ కార్డు!

ఇటీవల నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి, నటి అనసూయ భరద్వాజ్ సహా పలువురు ప్రముఖులు బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి మరో కోణాన్ని జోడించాయి. మహిళల హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛ, మోరల్ పోలీసింగ్ వంటి అంశాలపై మరోసారి సమాజంలో విస్తృత చర్చ మొదలైంది. ఈ ఘటన మహిళలపై ఉండాల్సిన గౌరవం, సమానత్వం గురించి ఆలోచించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
 

హానర్ విన్ సిరీస్ లాంచ్.. తక్కువ ధరలో 10,000mAh భారీ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో ప్రకంపనలు!
గ్యాస్ వినియోగదారులకు అదిరిపోయే వార్త! ప్రతి సిలిండర్‌పై రూ. 300 సబ్సిడీ.. కేంద్రం బిగ్ అప్‌డేట్!
Shivaji: మహిళలను అవమానిస్తే కఠిన చర్యలు... TG మహిళా కమిషన్! డ్రెస్ కారణంగా నేరాలు కావు.. నాగబాబు!
డ్వాక్రా మహిళలకు సంక్రాంతి కానుక.. రూ. 10 లక్షలతో - మంత్రి కీలక ప్రకటన.!
రైతులకు శుభవార్త.. ఎకరానికి రూ. 12,000 - యాసంగి రైతుభరోసా పంపిణీపై కీలక అప్‌డేట్!
Madras High Court: 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం అవసరం… కేంద్రానికి మద్రాస్ హైకోర్టు కీలక సూచన!!

Spotlight

Read More →