సమంత వ్యక్తిగత జీవితంపై గత కొన్నేళ్లుగా ఎన్నో రకాల వార్తలు వచ్చిన విషయం అందరికీ తెలిసినదే అయితే నిన్న కోయంబత్తూరులో దర్శకుడు రాజ్ నిడిమోరుతో జరిగిన ఆకస్మిక వివాహం మాత్రం అందరికీ నిజమైన సర్‌ప్రైజ్‌గా మారింది. ఈశా ఫౌండేషన్ లింగ భైరవి ఆలయంలో సోమవారం ఉదయం జరిగిన ఈ పెళ్లి ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాకుండా ప్రజల్లో నూ చర్చనీయాంశంగా నిలిచింది. అయితే వారిద్దరి వివాహంలో అనుసరించిన పద్ధతి భూత శుద్ధి సంప్రదాయం వివాహం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అసలు ఈ వివాహం ఏమిటి ఏమిటి? ఎందుకు ప్రత్యేకం? అన్న దానిపై ఆసక్తి పెరిగింది.
సమంత రాజ్ వివాహం గురించి ఆసక్తికర అంశం ఏమిటంటే ఇది సాధారణ హిందూ వివాహం లేదా క్రైస్తవ సంప్రదాయం లేదా రిజిస్ట్రేషన్ పెళ్లి కాదు. యోగ సంప్రదాయంలోని పూర్వకాల ఆచారాలతో నిర్మితమైన ఒక పవిత్ర పద్ధతి అదే భూత శుద్ధి వివాహం. భూత శుద్ధి అంటే అనేక మంది భ్రమపడుతున్నట్లుగా దెయ్యాల పూజలు, తాంత్రిక చర్యలు కాదు. 'పంచ భూతాల శుద్ధి' అనే అర్థంతో, శరీరం, మనస్సు, భావోద్వేగాలు, జీవశక్తి అన్నీ సమతుల్యం అయ్యి, వివాహం అనే బంధం ఆధ్యాత్మిక స్థాయిలో కలిసేలా రూపొందించబడిన ప్రక్రియ. సాధారణంగా యోగులు, ధ్యానసాధకులు, ఆధ్యాత్మిక మార్గంలో నడిచేవారు ఈ పద్ధతిని అనుసరిస్తారు.
ఈశా ఫౌండేషన్ వివరాల ప్రకారం భూత శుద్ధి వివాహం భార్యభర్తల మధ్య సంబంధాన్ని కేవలం భావోద్వేగం, శారీరకం అనే స్థాయిలో మాత్రమే కాకుండా, జీవ శక్తి స్థాయిలో కలిపే ఆధ్యాత్మిక ప్రక్రియ. ఈ ప్రక్రియలో పంచభూతాలకు సంబంధించిన శుద్ధి రీతులు, ప్రత్యేక మంత్రోచ్ఛారణలు, శక్తి సంతులనం చేసే యజ్ఞాలు ఉంటాయి. దాంపత్యంలో కలహాలు తగ్గి పరస్పర అవగాహన పెరిగి, కుటుంబంలోని శాంతి, శ్రేయస్సుకు ఈ వివాహ పద్ధతి తోడ్పడుతుందని అక్కడి గురువులు తెలుపుతున్నారు. సమంత గత కొన్నేళ్లుగా హిందూ సంప్రదాయాలు, యోగా, ధ్యానం వంటి పద్ధతులు పాటిస్తుండటంతో ఆమె ఈ రీతిని బహుశా ఈ రీతిని ఎంచుకున్నారని అభిమానులు భావిస్తున్నారు.
ఇటీవల బాలీవుడ్ టీవీ నటులు జియా మనేక్, వరుణ్ జైన్ కూడా ఇదే భూత శుద్ధి పద్ధతిలో వివాహం చేసుకోవడంతో ఈ విధానం స్లోగా ప్రాచుర్యం పొందుతోంది. ఇప్పుడు సమంత రాజ్ పెళ్లి వల్ల మరింతగా దృష్టిలోకి వచ్చింది. సోషల్ మీడియా కామెంట్స్ చూస్తే, ఇది ఏమిటో మొదట అర్థం కాలేదు, కానీ ఇది పవిత్ర సంప్రదాయం అని తెలిసి సంతోషం” అని చాలా మంది స్పందిస్తున్నారు. కొందరు అయితే "సామ్ ఎప్పుడూ ప్రత్యేకమే.. పెళ్లిని కూడా విభిన్న పద్ధతిలో చేసింది" అంటూ ప్రశంసిస్తున్నారు.
సమంత ప్రస్తుతం రాజ్–డీకే దర్శకత్వంలో రూపొందుతున్న ‘రక్త బ్రహ్మాండ’ వెబ్‌సిరీస్ షూటింగ్‌లో బిజీగా ఉంది. ఆదిత్య రాయ్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ బాగా హైప్ క్రియేట్ చేసుకుంటోంది. అలాగే హాలీవుడ్ ప్రాజెక్ట్‌తో పాటు 'మా ఇంటి బంగారం' సినిమా కూడా సమంత చేతిలో ఉన్నాయి. వ్యక్తిగత జీవితంలో కొత్తగా అడుగుపెట్టిన సామ్, ప్రొఫెషనల్‌గా కూడా అదే ఉత్సాహంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నారు అభిమానులు.