Train track : ప్రయాణికుల భద్రతే లక్ష్యం.. ఇంజిన్ ముందు మెటల్ ప్లేట్… ట్రాక్ క్లీన్ చేస్తూ! Goa Beach: గోవా పోలీసుల కఠిన నిర్ణయం... ప్రైవసీ భంగం చేస్తే జైలు తప్పదు! ఆ జిల్లాలో పెద్దపులి కలకలం.. పశువుల మందలపై దాడులు.. భయంలో గ్రామస్థులు! Fake milk: యూరియా డిటర్జెంట్‌తో నకిలీ పాలు.. 300 లీటర్లతో 1,800 లీటర్లు! Lucky draw: జాక్పాట్ అదృష్టం.. ఉడుపి యువకుడికి రూ.49 కోట్ల బిగ్ టికెట్ విజయం! Indian teacher: ఇండియన్ టీచర్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపు... రూ.9 కోట్ల గ్లోబల్ టీచర్ ప్రైజ్! 9వ అంతస్తు నుండి దూకి ముగ్గురు సోదరీమణుల ఆత్మహత్య.. తండ్రికి రాసిన లేఖలో కూతుళ్ల ఆవేదన.. ఐదు రోజులుగా కంటిమీద కునుకు లేని గ్రామాలు.. పులిని బంధించేందుకు మెగా ఆపరేషన్.! Attitude Star Chandrahas: ప్రమోషన్ల కోసం దిగజారారు..యాటిట్యూడ్ స్టార్‌ చంద్రహాస్ బూతు పాటపై కేసు నమోదు.! Battery tricycles: దివ్యాంగులకు శుభవార్త... ఫ్రీగా 5G ఫోన్లు, బ్యాటరీ ట్రై సైకిళ్లు! Train track : ప్రయాణికుల భద్రతే లక్ష్యం.. ఇంజిన్ ముందు మెటల్ ప్లేట్… ట్రాక్ క్లీన్ చేస్తూ! Goa Beach: గోవా పోలీసుల కఠిన నిర్ణయం... ప్రైవసీ భంగం చేస్తే జైలు తప్పదు! ఆ జిల్లాలో పెద్దపులి కలకలం.. పశువుల మందలపై దాడులు.. భయంలో గ్రామస్థులు! Fake milk: యూరియా డిటర్జెంట్‌తో నకిలీ పాలు.. 300 లీటర్లతో 1,800 లీటర్లు! Lucky draw: జాక్పాట్ అదృష్టం.. ఉడుపి యువకుడికి రూ.49 కోట్ల బిగ్ టికెట్ విజయం! Indian teacher: ఇండియన్ టీచర్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపు... రూ.9 కోట్ల గ్లోబల్ టీచర్ ప్రైజ్! 9వ అంతస్తు నుండి దూకి ముగ్గురు సోదరీమణుల ఆత్మహత్య.. తండ్రికి రాసిన లేఖలో కూతుళ్ల ఆవేదన.. ఐదు రోజులుగా కంటిమీద కునుకు లేని గ్రామాలు.. పులిని బంధించేందుకు మెగా ఆపరేషన్.! Attitude Star Chandrahas: ప్రమోషన్ల కోసం దిగజారారు..యాటిట్యూడ్ స్టార్‌ చంద్రహాస్ బూతు పాటపై కేసు నమోదు.! Battery tricycles: దివ్యాంగులకు శుభవార్త... ఫ్రీగా 5G ఫోన్లు, బ్యాటరీ ట్రై సైకిళ్లు!

Attitude Star Chandrahas: ప్రమోషన్ల కోసం దిగజారారు..యాటిట్యూడ్ స్టార్‌ చంద్రహాస్ బూతు పాటపై కేసు నమోదు.!

యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌పై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బూతు పాట వివాదంలో జర్నలిస్టును బెదిరించడంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.

Published : 2026-02-05 10:32:00

బుల్లితెర ప్రముఖ నటుడు ప్రభాకర్ కుమారుడిగా వెండితెరకు పరిచయమైన చంద్రహాస్, తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన హీరోగా నటించిన బరాబర్ ప్రేమిస్తా సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో తలెత్తిన ఘర్షణ ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. ఒక అసభ్యకరమైన పాట పాడుతూ, దాన్ని ప్రశ్నించిన జర్నలిస్టును సోషల్ మీడియా వేదికగా బెదిరించడంతో మాదాపూర్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

వివాదానికి బీజం పడిందిలా..

రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన ‘బరాబర్ ప్రేమిస్తా’ చిత్ర ప్రమోషన్ ఈవెంట్‌లో చంద్రహాస్ వేదికపై ఒక పాటను పాడారు. అయితే ఆ పాటలోని సాహిత్యం అత్యంత అసభ్యకరంగా, సమాజంలో మహిళలు మరియు కుటుంబ సభ్యుల ముందు పాడలేని విధంగా ఉందని విమర్శలు వచ్చాయి. దీనిపై అశోక్ కుమార్ అనే జర్నలిస్ట్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఇలాంటి బూతు పదాలతో కూడిన పాటలను పబ్లిక్ ఈవెంట్లలో పాడటం సరైంది కాదని హితవు పలికారు.

బెదిరింపులకు దిగిన హీరో..

జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలకు చంద్రహాస్ సానుకూలంగా స్పందించాల్సింది పోయి, మరింత దూకుడుగా వ్యవహరించారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేస్తూ.. జర్నలిస్టుకు 24 గంటల సమయం ఇస్తున్నానని, తనకి క్షమాపణ చెప్పకపోతే సంగతి చూస్తానంటూ బహిరంగంగా బెదిరింపులకు పాల్పడ్డారు. నేను వాడింది కేవలం రెండు బూతు పదాలే.. కానీ నన్ను కావాలని ట్రోల్ చేస్తున్నారు అంటూ తన యాటిట్యూడ్‌ను మరోసారి ప్రదర్శించారు.

పోలీసుల రంగప్రవేశం

చంద్రహాస్ తనను బెదిరించడమే కాకుండా, అంతుచూస్తాననడంపై జర్నలిస్ట్ అశోక్ కుమార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణహాని ఉందని భావించిన బాధితుడు మాదాపూర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. జర్నలిస్టు ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, చంద్రహాస్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. ఈ సంఘటనపై నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. సినిమా హిట్టవ్వాలనే ఆరాటంలో సమాజ విలువలను పక్కన పెట్టడం సమంజసం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. సెలబ్రిటీలుగా సమాజంపై ప్రభావం చూపే వ్యక్తులు, బహిరంగ వేదికలపై వాడే భాష విషయంలో సంయమనం పాటించాలని  సూచిస్తున్నారు. చంద్రహాస్ మొదటి సినిమా ‘రామ్ నగర్ బన్నీ’ సమయం నుంచే తన ప్రవర్తనతో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఏకంగా కేసు నమోదు కావడంతో ఆయన కెరీర్‌పై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Spotlight

Read More →