చండీగఢ్‌లో పెంపుడు కుక్కల నియంత్రణ కోసం మున్సిపల్ కార్పొరేషన్ కొత్త ఆదేశాలు విడుదల చేసింది. ముఖ్యంగా అమెరికన్ పిట్‌బుల్, అమెరికన్ బుల్డాగ్, బుల్ టెర్రియర్, కేన్ కోర్సో, డోగో అర్జెంటీనో, రోట్వీలర్ వంటి ఆరు ప్రమాదకర కుక్కల జాతులను కొత్తగా పెంచే యజమానులకు నిషేధం విధించారు.
మున్సిపల్ అధికారుల ప్రకారం ఇప్పటికే ఈ జాతుల కుక్కలు ఉన్నవారికి నిషేధం వర్తించదు. కానీ, 45 రోజుల్లోపు తమ కుక్కలను తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలని ఆదేశించారు. అలాగే వీటిని బయటకు తీసుకెళ్ళేటప్పుడు ముక్కుతాడు పెట్టడం, బలమైన బెల్ట్‌తో కంట్రోల్ చేయడం తప్పనిసరి.
పెంపుడు కుక్కలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో మల వదిలించకూడదు. ఒకవేళ బహిరంగ ప్రదేశాల్లో జరిగితే భారీ జరిమానాలు విధించునున్నామని తెలిపారు. సుఖ్నా సరస్సు, రోజ్ గార్డెన్ లాంటి పబ్లిక్ గార్డెన్లలో కుక్కలను అనుమతి లేదని తెలిపారు.
క్రమంగా, నివాస విస్తీర్ణం ఆధారంగా ఒక్క ఇంట్లో పెంచుకునే కుక్కల సంఖ్యను నిర్ణయించారు. 152 చదరపు గజాల వరకు ఒక కుక్క, 366 చదరపు గజాల వరకు రెండు, 610 చదరపు గజాల వరకు నాలుగు కుక్కలకు అనుమతి ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
కమ్యూనిటీ కుక్కలకు ఆహారం ఇవ్వడం కూడా మున్సిపల్ నియమాల ప్రకారం మాత్రమే బహిరంగ ప్రదేశాల్లో ఆహారం లేదా కుక్కలు భద్రతకు ముప్పు కలిగిస్తే నేరంగా పరిగణించబడతాయి.ఈ కొత్త నిబంధనల లక్ష్యం పబ్లిక్ భద్రతను కాపాడడం, పెంపుడు కుక్కల యజమానుల బాధ్యతను వహించే విధంగా త్వరలో ప్రభుత్వ ఆదేశాలు ఇవ్వనున్నారు.