భారత క్రికెట్ అభిమానులకు గర్వకారణమైన ఘనత మరోసారి విరాట్ కోహ్లి పేరుతో చేరింది. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో అద్భుత శతకం సాధించి కోహ్లి కొత్త రికార్డుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు వన్డే ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ సచిన్ టెండూల్కర్. ఆయన ఖాతాలో 49 సెంచరీలు ఉన్నా, కోహ్లి ఆ రికార్డును అధిగమించి 52 వన్డే సెంచరీలతో చరిత్ర సృష్టించారు. దీంతో ఒకే ఫార్మాట్లో ప్రపంచ క్రికెట్లో అత్యధిక సెంచరీలతో ముందంజలో నిలిచారు.
సచిన్ తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లలో విరాట్ కోహ్లి స్థానం ఎప్పటికప్పుడు బలపడుతోంది. ప్రస్తుతం మూడు ఫార్మాట్లు కలిపి కోహ్లి 83 అంతర్జాతీయ శతకాలు నమోదు చేశారు. సచిన్ వద్ద మొత్తం 100 అంతర్జాతీయ సెంచరీలు ఉన్న సంగతి తెలిసిందే. ఇంకా కోహ్లి కెరీర్‌కు చాలా ఏళ్లు ఉండటంతో, సచిన్ 100 సెంచరీల రికార్డు కూడా చేరువలోనే ఉందని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు.
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టుకు కోహ్లి ప్రధాన స్థంభంలా నిలిచారు. ఆరంభం నుంచే అద్భుతమైన షాట్లతో ముందుకు సాగి, రన్చేస్లో ఒత్తిడిని చక్కగా ఎదురుకున్నారు. 102 బంతుల్లో స్టైలిష్ సెంచరీ పూర్తి చేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. కోహ్లీ క్రీజులో ఉంటూ ప్రత్యర్థి బౌలర్లను పరేషాన్ చేశారు. గ్రౌండ్లో ఆయనకు వచ్చిన ప్రతి బౌండరీ, ప్రతి రన్ ప్రేక్షకుల్లో కొత్త ఊపిరి నింపింది.
భారత ఇన్నింగ్స్ ఆరంభంలో రోహిత్ శర్మ దూకుడుగా ఆడి 43 బంతుల్లో 57 పరుగులు చేసి జట్టుకు మంచి శుభారంభం ఇచ్చారు. అయితే ఓ అద్భుతమైన షాట్ ప్రయత్నంలో క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు. యువ బ్యాటర్ జైస్వాల్ 18 పరుగులు, గైక్వాడ్ 8 పరుగులు చేసి త్వరగా పెవిలియన్ చేరారు. వాషింగ్టన్ సుందర్ కూడా 13 పరుగులు చేసి ఔటయ్యారు. అప్పటికి భారత్ స్కోర్ 38 ఓవర్లలో 233/4గా ఉంది. కోహ్లి క్రీజులో నిలిచినంతకాలం భారత్ భారీ స్కోర్ వైపే ప్రయాణించనుందనే ఆశలు అభిమానుల్లో ఉన్నాయి.
మ్యాచ్ ముగిసే నాటికి 50 ఓవర్లలో ఎంత స్కోర్ చేరుకుంటుందో పెద్ద ఆసక్తి నెలకొంది. అభిమానులు సోషల్ మీడియాలో ఇప్పటికే భారీ అంచనాలు చేస్తున్నారు. చివరి 12 ఓవర్లలో రన్‌రేట్ పెరుగుతుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.