ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మే నెలాఖరుకల్లా ఏపీ రోడ్లకు కొత్త రూపు! ఆ ప్రాంతాలకు మహర్దశ - మంత్రి కీలక ప్రకటన.! ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు పక్కా! నీటిలో పడినా, దుమ్ము తగిలినా చెక్కుచెదరదు - తక్కువ ధరలో బెస్ట్ ఫోన్! Guntur Saras Mela: గుంటూరు సరస్ మేళా.. షాపింగ్ వినోదం సంస్కృతి సమ్మేళనం...భారీగా తరలివచ్చిన జనం! Buttons concept: వింతగా మొదలై.. ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన 365 బటన్స్ కాన్సెప్ట్! UPSC: మోసాలకు ఫుల్ స్టాప్.. UPSCలో హైటెక్ సెక్యూరిటీ ఎంట్రీ! Weather Report: తీరం దాటిన వాయుగుండం.. ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచన! Job News: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..నెల జీతం రూ.55,932 వరకు..!! House: ఇందిరమ్మ ఇళ్ల నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక ప్రకటన! డబ్బులు ఆటోమేటిక్‌గా..! Mobiles : రూ.20 వేల లోపు బెస్ట్ మొబైల్స్ కావాలా.. లిస్ట్ ఇదే! Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం... వలసలకు బ్రేక్! ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగాల వరం! ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మే నెలాఖరుకల్లా ఏపీ రోడ్లకు కొత్త రూపు! ఆ ప్రాంతాలకు మహర్దశ - మంత్రి కీలక ప్రకటన.! ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు పక్కా! నీటిలో పడినా, దుమ్ము తగిలినా చెక్కుచెదరదు - తక్కువ ధరలో బెస్ట్ ఫోన్! Guntur Saras Mela: గుంటూరు సరస్ మేళా.. షాపింగ్ వినోదం సంస్కృతి సమ్మేళనం...భారీగా తరలివచ్చిన జనం! Buttons concept: వింతగా మొదలై.. ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన 365 బటన్స్ కాన్సెప్ట్! UPSC: మోసాలకు ఫుల్ స్టాప్.. UPSCలో హైటెక్ సెక్యూరిటీ ఎంట్రీ! Weather Report: తీరం దాటిన వాయుగుండం.. ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచన! Job News: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..నెల జీతం రూ.55,932 వరకు..!! House: ఇందిరమ్మ ఇళ్ల నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక ప్రకటన! డబ్బులు ఆటోమేటిక్‌గా..! Mobiles : రూ.20 వేల లోపు బెస్ట్ మొబైల్స్ కావాలా.. లిస్ట్ ఇదే! Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం... వలసలకు బ్రేక్! ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగాల వరం!

Indian Politics: ఆ రాష్ట్రంలో కమలం ప్రభుత్వమే లక్ష్యం… ‘మిషన్ 2026’కు అమిత్ షా శ్రీకారం..!!

2026-01-11 16:08:00
Trump: ఇరాన్ అశాంతిపై ట్రంప్ బ్రీఫింగ్.. 47 ఏళ్ల నొప్పి పేలింది.. వీధుల్లో అగ్నిపోరాటం!

కేరళ రాజకీయాల్లో పెద్ద మార్పుకు బీజేపీ సిద్ధమవుతోందని కేంద్ర హోం మంత్రి  అమిత్ షా (Amit Shah) స్పష్టం చేశారు. కేరళలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తమ అంతిమ లక్ష్యమని ఆయన ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో అమిత్ షా పాల్గొని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం రూపొందించిన ‘మిషన్ 2026’ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కేరళ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి.

Student To Leader: “స్టూడెంట్ టు లీడర్” విజన్‌.... మంత్రిని నేరుగా కలసి తన ఐడియా వినిపించిన తెనాలి విద్యార్థిని!

ఇప్పటి వరకు సాధించిన విజయాలను గమ్యంగా కాకుండా, ముందున్న పెద్ద లక్ష్యానికి తొలి మెట్టుగా చూడాలని బీజేపీ కార్యకర్తలకు అమిత్ షా (Amit Shah Kerala Visit) సూచించారు. కమలం గుర్తుతో కేరళలో అధికారాన్ని సాధించడమే పార్టీ యొక్క స్పష్టమైన లక్ష్యమని చెప్పారు. కేరళ అభివృద్ధి కోసం కొత్త రాజకీయ దిశ అవసరమని, అది బీజేపీ నేతృత్వంలోనే సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయాన్ని వెల్లబుచ్చారు. దేశ వ్యతిరేక శక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడటం, శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయాలు మరియు నమ్మకాలను రక్షించటం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు.

అలాస్కా మంచులో అదృశ్యమైన ఆంధ్ర యువకుడు!

కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్, సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ రెండూ కేరళ అభివృద్ధిని అడ్డుకున్నాయని అమిత్ షా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు కూటములు పరస్పరం లాభపడే రాజకీయాలు చేస్తున్నాయని, ప్రజల ఆకాంక్షలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీల ప్రభావం తగ్గుతోందని, అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా క్రమంగా బలహీనపడుతోందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంతోనే అభివృద్ధి చెందిన కేరళ సాధ్యమవుతుందని చెప్పారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని మోదీ ముందుకు తీసుకెళ్తున్నారని, ఆ కలలో కేరళ కూడా భాగస్వామిగా ఉండాలని అన్నారు.

Credit Card: క్రెడిట్ కార్డ్‌తో ఇంటి అద్దె చెల్లిస్తున్నారా? మీ HRA ప్రమాదంలో పడే ఛాన్స్‌ ఉంది!

బీజేపీకి కేరళలో ప్రజల మద్దతు క్రమంగా పెరుగుతోందని అమిత్ షా వివరించారు. 2014లో 11 శాతం ఓట్లు వచ్చిన పార్టీకి, 2019లో 16 శాతం, 2024లో 20 శాతం ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఈ శాతం మరింత పెరిగి 30 నుంచి 40 శాతం వరకు చేరుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 2026 ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి తప్పకుండా వస్తారని ధీమా వ్యక్తం చేశారు. గ్రామపంచాయితీలు, మున్సిపాలిటీల్లో పార్టీ సాధించిన విజయాలు ఈ మార్పుకు సంకేతమని చెప్పారు.

Delhi: రిపబ్లిక్ డేకు ఢిల్లీ సిద్ధం..! వైమానిక విన్యాసాల కోసం 1275 కిలోల చికెన్ ఆర్డర్..!

బీజేపీ కార్యకర్తల త్యాగాల వల్లే ఈ స్థాయికి పార్టీ చేరిందని అమిత్ షా అన్నారు. జైళ్లకు వెళ్లిన కార్యకర్తలు, వారి కుటుంబాల కష్టాలను గుర్తు చేస్తూ, ఈ విజయాలను వారికే అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తే బీజేపీ బలమని ఆయన వ్యాఖ్యానించారు.

Somnath temple: భక్తులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ప్రధాని.. సోమనాథ్ దర్శనంతో!

ఇక శబరిమల అంశంపై కూడా అమిత్ షా తీవ్రంగా స్పందించారు. శబరిమల ఆలయంలో (Sabarimala  Theft Case)జరిగిన బంగారం చోరీ ఘటనపై తటస్థ దర్యాప్తు సంస్థతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) పై విమర్శలు గుప్పించారు. ఆలయ ఆస్తులను కాపాడలేని ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని ఎలా రక్షిస్తుందని ప్రశ్నించారు. శబరిమల అంశం కేవలం కేరళ ప్రజలదే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న భక్తులందరి సమస్యగా పేర్కొన్నారు. ఈ కేసులో న్యాయం జరిగే వరకు బీజేపీ (NDA Government) పోరాటం కొనసాగిస్తుందని, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఇంటింటి ప్రచారాలు చేపడతామని స్పష్టం చేశారు.

Education News: విద్యార్థులకూ ఇంటర్న్‌షిప్ తప్పనిసరి.. 2026–27 నుంచి కొత్త విధానం అమలు!!

మొత్తంగా అమిత్ షా పర్యటన కేరళ రాజకీయాల్లో కొత్త వేడి పెంచింది. మిషన్ 2026తో బీజేపీ (Mission 2026 BJP) తన వ్యూహాలను మరింత దూకుడుగా అమలు చేయనున్నట్లు స్పష్టమవుతోంది. వచ్చే ఎన్నికలు కేరళలో రాజకీయ సమీకరణలను పూర్తిగా మార్చే అవకాశం ఉందన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.

Sammakka Saralamma: భక్తిశ్రద్ధలతో మార్మోగిన సమ్మక్క సారలమ్మ క్షేత్రం.. డ్రోన్లతో నిఘా.. అప్రమత్తంగా పోలీస్ బందోబస్తు!
Cockfighting AP: సంక్రాంతి వేళ కోడిపందాలపై హైకోర్టు కీలక ఆదేశాలు..!!
UPSC: యూపీఎస్సీ పరీక్షల్లో సంచలన మార్పు..! ఇక అది తప్పనిసరి!
Vijayawada Highway: సంక్రాంతి రద్దీ.. HYD విజయవాడ హైవేపై 70 వేల వాహనాలు!
Technology News: వాట్సాప్‌లో మరో అదిరిపోయే అప్‌డేట్.. కవర్ ఫోటో కూడా సెట్ చేసుకోవచ్చు!!

Spotlight

Read More →