Kanaka Durga Temple: ఇంద్రకీలాద్రిపై ‘డిజిటల్’ శకం.. ఇక టిక్కెట్ల కోసం క్యూలు లేవు, దర్శనం సులభం!

2026-01-13 16:54:00
Middle East News: ఇరాన్‌పై ట్రంప్ హెచ్చరిక.. పరిస్థితి చేజారితే సైనిక చర్య తప్పదు..!!

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ (Kanaka Durga Temple) ఆలయానికి వచ్చే భక్తులకు ఇకపై క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడే అవసరం ఉండదు. దర్శనం, ప్రత్యేక పూజలు, ప్రసాదం టికెట్ల కోసం చిల్లర డబ్బుల కోసం తిరగాల్సిన పరిస్థితికి కూడా ముగింపు రానుంది. ఆలయ అధికారులు ‘సెల్ఫ్ సర్వీస్ కియోస్క్’లను ఏర్పాటు చేసి టికెట్ విధానాన్ని పూర్తిగా డిజిటల్ చేయబోతున్నారు. తిరుమల తరహాలో భక్తులే స్వయంగా టికెట్లు తీసుకునే ఈ సౌకర్యం త్వరలో అమల్లోకి రానుంది.

AP Govt: ఏపీ కీలక బదిలీలు..! 11 జిల్లాల్లో జాయింట్ కలెక్టర్ పోస్టులకు కొత్త నియామకాలు!

దేవాదాయ శాఖ, కరూర్ వైశ్యా బ్యాంకు సహకారంతో తొలి దశలో నాలుగు ఆధునిక కియోస్క్ యంత్రాలను ఏర్పాటు చేస్తోంది. ఈ యంత్రాల ద్వారా భక్తులు స్క్రీన్‌పై దర్శనం, పూజలు, ప్రసాదం వంటి సేవలను ఎంపిక చేసుకుని, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ లేదా డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపు చేయవచ్చు. చెల్లింపు పూర్తయిన వెంటనే టికెట్ యంత్రం నుంచి ప్రింట్ అవుతుంది. ఈ యంత్రాలను ఘాట్ రోడ్డు, కనకదుర్గ నగర్, లిఫ్ట్ దగ్గర ఏర్పాటు చేయనున్నారు. సంక్రాంతి తర్వాత ఇవి పనిచేయడం ప్రారంభిస్తాయి.

US Visa: ట్రంప్ ప్రభుత్వం సంచలన నిర్ణయం..! రికార్డు స్థాయిలో వీసాల రద్దు!

ఈ డిజిటల్ విధానం వల్ల టిక్కెట్ల అమ్మకాల్లో పారదర్శకత పెరుగుతుంది. మధ్యవర్తులు, సిబ్బంది చేతివాటం వంటి సమస్యలకు అడ్డుకట్ట పడుతుంది. భవిష్యత్తులో ఎక్కువగా అన్ని చెల్లింపులు డిజిటల్ రూపంలోనే చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెడుతోంది. భక్తులకు ఈ కొత్త విధానం అర్థమయ్యేలా కియోస్క్‌ల దగ్గర వాలంటీర్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. దీంతో అమ్మవారి దర్శనం మరింత సులభంగా, వేగంగా జరుగనుంది.

Sankranti Festival 2026: సంక్రాంతి గాలిపటాల వెనుక ఉన్న రహస్యం ఇదే..!!

కనకదుర్గమ్మ ఆలయంలో దర్శనం కోసం ఎంత సమయం పడుతుంది?
సాధారణ రోజుల్లో 10–20 నిమిషాలు, ఎక్కువ భక్తులు ఉన్నప్పుడు 1–2 గంటలు పడుతుంది. పండుగ రోజుల్లో 2–3 గంటలకంటే ఎక్కువ కూడా పట్టవచ్చు. త్వరిత దర్శన టికెట్ తీసుకుంటే వేగంగా దర్శనం జరుగుతుంది. వీకెండ్ల కంటే వారంలో సమయం తక్కువగా ఉంటుంది.

Turmeric Milk: పాలలో చిటికెడు పసుపు కలిపి తాగితే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం!

దర్శనం కోసం టికెట్ అవసరమా?
సాధారణ దర్శనం కోసం ఉచితం, కానీ వేగవంతమైన “క్విక్ దర్శన్” కోసం ప్రత్యేక టికెట్ తీసుకోవచ్చు. ఈ టికెట్‌తో క్యూ లైన్ తక్కువగా ఉండి వేగంగా దర్శనం పొందవచ్చు. ప్రత్యేకంగా కియోస్క్‌ల దగ్గర వాలంటీర్స్ భక్తులను సహాయం చేస్తారు. టికెట్ తీసుకోవడం, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం వంటి ప్రక్రియలో అవగాహన కల్పిస్తారు.

Sankranthi Special Raid: సంక్రాంతి స్పెషల్ రైడ్... గాల్లో తేలుతూ కోనసీమ అందాలు చూసేద్దామా!
Home Buying Tips: సొంతింటి కల నెరవేరాలంటే ఏది బెటర్? అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌నా లేదా ఇండిపెండెంట్ హౌస్‌నా..??
Personal Loan Scheme: SBI కస్టమర్లకు శుభవార్త..రూ.35 లక్షల వరకు పర్సనల్ లోన్ ..!!
Protein Rich Foods: చేప తలకాయను పారేస్తున్నారా? అదే మీ ఆరోగ్యానికి గోల్డెన్ ఫుడ్ అని తెలిస్తే షాక్‌ అవుతారు!
Germany Visa: భారతీయులకు గుడ్ న్యూస్! జర్మనీ కొత్త రూల్... ఇక నుండి ఆ విధానం రద్దు!
Tata Sierra Hexa: 7-సీటర్ SUVగా పాత లెజెండ్ రీ-ఎంట్రీ... సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సరికొత్త డిజైన్!
H1B వీసాదారులకు బిగ్ షాక్! మార్చి 1 నుండి ఛార్జీలు పెంపు!

Spotlight

Read More →