దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్న వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు కీలక (Supreme Court) వ్యాఖ్యలు చేసింది. ఇకపై వీధి కుక్కల దాడుల వల్ల ఎవరైనా గాయపడితే లేదా ప్రాణాలు (Dog Bite Compensation) కోల్పోతే, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించి పరిహారం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టంగా చెప్పింది. ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని హెచ్చరిస్తూ, ఇప్పటివరకు కుక్కల నియంత్రణలో విఫలమైన రాష్ట్రాల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
గత కొన్ని సంవత్సరాలుగా దేశంలోని అనేక నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో వీధి కుక్కల సంఖ్య గణనీయంగా పెరిగిందని న్యాయస్థానం గుర్తుచేసింది. దీనివల్ల చిన్నపిల్లలు, వృద్ధులు, పాదచారులు ఎక్కువగా ప్రమాదాలకు (Dog Bite ) గురవుతున్నారని పేర్కొంది. కుక్క కాటు ఒక్కసారితో ముగిసే సమస్య కాదని, బాధితుల జీవితంపై దీర్ఘకాల ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించింది. శారీరక గాయాలతో పాటు మానసిక భయం కూడా వారిని వెంటాడుతుందని తెలిపింది.
ఈ సందర్భంగా వీధి కుక్కలకు ఆహారం పెడుతున్న కొంతమంది వ్యవహారశైలిపైనా సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. జంతువులపై ప్రేమ తప్పుకాదని, కానీ ఆ ప్రేమ ప్రజల భద్రతకు ముప్పుగా మారకూడదని స్పష్టం చేసింది. వీధుల్లో స్వేచ్ఛగా తిరిగే కుక్కలకు తిండిపెట్టి అక్కడే వదిలేయడం వల్ల సమస్య మరింత పెరుగుతోందని పేర్కొంది. నిజంగా ప్రేమ ఉంటే వాటిని ఇంటికి తీసుకెళ్లి పెంచుకోవాలని, లేదా ప్రభుత్వ షెల్టర్లకు సహకరించాలని సూచించింది.
ఇదే సమయంలో కుక్కల నియంత్రణకు సంబంధించిన నిబంధనలను రాష్ట్రాలు ఎందుకు సరిగా అమలు చేయలేకపోయాయన్న ప్రశ్నను న్యాయస్థానం లేవనెత్తింది. జంతు జనన నియంత్రణ, స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ వంటి అంశాలపై చట్టాలు ఉన్నప్పటికీ, అవి కాగితాలకే పరిమితమవుతున్నాయని వ్యాఖ్యానించింది. గత ఐదేళ్లుగా ఈ నియమాలను అమలు చేయడంలో రాష్ట్రాలు విఫలమైనందునే పరిస్థితి ఈ స్థాయికి చేరిందని అభిప్రాయపడింది.
కొన్ని ప్రాంతాల్లో అధికారులు కుక్కలను పట్టుకోవడానికి వెళ్లినప్పుడు జంతు ప్రేమికులు (Animal Birth Control Rules) అడ్డుపడుతున్న ఘటనలను కూడా కోర్టు ప్రస్తావించింది. ఇలా చేయడం వల్ల సమస్య పరిష్కారానికి ఆటంకం కలుగుతోందని పేర్కొంది. ప్రజల భద్రత, ఆరోగ్యం కోర్టుకు అత్యంత ప్రాధాన్యమని, భావోద్వేగాలతో కాకుండా వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది.
అయితే ప్రతి వీధి కుక్కను (Stray Dog Menace) ఎక్కడికక్కడ నుంచి తరలించాలని తాము ఎప్పుడూ చెప్పలేదని కోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా స్కూళ్లు, ఆసుపత్రులు, పార్కులు, రైల్వే స్టేషన్లు వంటి ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రదేశాల్లో కుక్కలు ఉండకూడదని మాత్రమే ఆదేశించినట్లు తెలిపింది. అక్కడ కుక్కలు ప్రవేశించకుండా కంచెలు ఏర్పాటు చేయడం, క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించడం రాష్ట్రాల (Government Responsibility) బాధ్యత అని పేర్కొంది.
వీధి కుక్కల దాడుల (Stray Dogs Case India) కారణంగా రేబిస్ వంటి ప్రాణాంతక వ్యాధులతో మరణాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ పరిస్థితిని నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రజల ప్రాణాలు, భద్రత కంటే ఏ అంశం గొప్పది కాదని స్పష్టంగా చెప్పింది. ఈ హెచ్చరికలతో అయినా రాష్ట్రాలు మేల్కొని, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాయా లేదా అన్నది వేచి చూడాల్సిందే