Gut Health: జీర్ణ వ్యవస్థ పాడవ్వకూడదంటే జాగ్రత్త... పేగు ఆరోగ్యాన్ని దెబ్బతీసే 8 చెడు అలవాట్లు ఇవే!

Gut Health: మన శరీరంలో జీర్ణ వ్యవస్థ లేదా పేగుల ఆరోగ్యం (Gut Health) సరిగ్గా ఉంటేనే మొత్తం ఆరోగ్యం బాగుంటుంది. జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తేనే మనం తిన్న ఆహారం నుంచి పోషకాలు శరీరానికి అందుతాయి.

జీర్ణ వ్యవస్థ లేదా పేగుల ఆరోగ్యం
జీర్ణ వ్యవస్థ లేదా పేగుల ఆరోగ్యం

మంచి జీర్ణక్రియ కోసం పాటించాల్సిన నియమాలు...

కడుపు ఉబ్బరం, మలబద్ధకానికి కారణాలు ఇవే...

ఆరోగ్యకరమైన జీవితానికి జీర్ణ వ్యవస్థే మూలం...

Gut Health: మన శరీరంలో జీర్ణ వ్యవస్థ లేదా పేగుల ఆరోగ్యం (Gut Health) సరిగ్గా ఉంటేనే మొత్తం ఆరోగ్యం బాగుంటుంది. జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తేనే మనం తిన్న ఆహారం నుంచి పోషకాలు శరీరానికి అందుతాయి. అయితే, మన దైనందిన జీవితంలో తెలియకుండా చేసే కొన్ని చిన్న చిన్న చెడు అలవాట్లు పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను దెబ్బతీసి, తీవ్రమైన జీర్ణక్రియ సమస్యలకు కారణమవుతున్నాయి. మెరుగైన జీర్ణక్రియ కోసం వెంటనే మానుకోవాల్సిన ఎనిమిది అలవాట్లను ఆరోగ్య నిపుణులు వెల్లడించారు.

ఆహారం సరిగ్గా నమల్లకుండా మింగడం & అతిగా తినడం: ఆహారాన్ని హడావుడిగా, నమల్లకుండా మింగడం వల్ల జీర్ణ వ్యవస్థపై అదనపు భారం పడుతుంది. నోట్లోనే ఆహారం సరిగ్గా నమలడం వల్ల జీర్ణరసాలు సరిగ్గా ఊరతాయి. అలాగే, కడుపు నిండిన తర్వాత కూడా అతిగా తినడం వల్ల కడుపు ఉబ్బరం, యాసిడ్ రిఫ్లక్స్ (గ్యాస్ పైకి రావడం) వంటి సమస్యలు వస్తాయి.

తగినంత నీరు తాగకపోవడం & ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం: శరీరానికి సరిపడా నీరు అందకపోతే జీర్ణక్రియ నెమ్మదించి మలబద్ధకం సమస్య తలెత్తుతుంది. అలాగే, జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలు మరియు అధిక చక్కెర ఉన్న పదార్థాలు తినడం వల్ల పేగుల్లో ఉండే ఉపయోగకరమైన బ్యాక్టీరియా నశించి, చెడు బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది జీర్ణ వ్యవస్థ సమతుల్యతను దెబ్బతీస్తుంది.

పీచు పదార్థాల లోపం & ఆలస్యంగా భోజనం చేయడం: పీచు పదార్థాలు (ఫైబర్) ఉన్న పండ్లు, కూరగాయలు తినకపోవడం వల్ల పేగుల కదలికలు మందగిస్తాయి. దీనికితోడు రాత్రివేళల్లో ఆలస్యంగా భోజనం చేయడం మరియు తిన్న వెంటనే పడుకోవడం వల్ల తిన్న ఆహారం సరిగ్గా అరగక నెమ్మదిగా కడుపులో మంట, గ్యాస్ సమస్యలకు దారితీస్తుంది.

తీవ్రమైన ఒత్తిడి & నిద్రలేమి: మానసిక ఒత్తిడికి, పేగుల ఆరోగ్యానికి ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. అధిక ఒత్తిడి వల్ల కడుపులో యాసిడ్ ఉత్పాదన మారి జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. అలాగే రాత్రివేళ సరిపడా నిద్ర లేకపోవడం కూడా పేగుల్లోని మంచి మైక్రోబయోమ్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.

శారీరక శ్రమ లేకపోవడం & పెయిన్ కిల్లర్స్ వాడకం: రోజంతా ఒకే చోట కూర్చోవడం, వ్యాయామం చేయకపోవడం వల్ల పేగుల కదలికలు తగ్గుతాయి. అలాగే చిన్న చిన్న నొప్పులకు కూడా నిపుణుల సలహా లేకుండా పెయిన్ కిల్లర్ మందులు అధికంగా వాడటం వల్ల పేగుల లోపలి పొరలు దెబ్బతింటాయి. ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ కోసం ఈ అలవాట్లను మానుకుని సమతుల్య ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Tags

Be the first to react

Latest