Ferty9: ఫెర్టీ9 విజయవాడ'కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు!

సంతానోత్పత్తి వైద్య రంగంలో మన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 'ఫెర్టీ9 విజయవాడ' కేంద్రం అంతర్జాతీయ స్థాయిలో అరుదైన మైలురాయిని అందుకుంది. ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సంస్థ గ్లోబల్ వేదికలపై సాధించిన విజయాలను అధికారికంగా వెల్లడించింది.

Ferty 9
Ferty 9

సంతానోత్పత్తి వైద్య రంగంలో మన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 'ఫెర్టీ9 విజయవాడ' కేంద్రం అంతర్జాతీయ స్థాయిలో అరుదైన మైలురాయిని అందుకుంది. ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సంస్థ గ్లోబల్ వేదికలపై సాధించిన విజయాలను అధికారికంగా వెల్లడించింది. ఐరోపాలో ఇటీవల జరిగిన ప్రతిష్టాత్మక 'ESHRE 2026' సదస్సులో నాలుగు పరిశోధనా పత్రాలతో పాటు ఒక కీలక ఓరల్ ప్రజెంటేషన్‌ను ఈ బృందం ఇచ్చింది.

దీనికితోడు జపాన్‌లోని టోక్యోలో జరిగిన ప్రపంచ సమావేశంలో మరో నాలుగు పత్రాలను, ఆసియా పసిఫిక్ రీజియన్‌లో ఎంతో ప్రాధాన్యం ఉన్న 'యాస్పైర్' సదస్సులో ఏకంగా 11 పరిశోధనా పత్రాలను సమర్పించి అంతర్జాతీయ వైద్యుల దృష్టిని ఆకర్షించింది.

గత ఐదేళ్ల కాలంలో రోగులకు అందించిన ఐయూఐ (IUI) చికిత్సల ఆధారంగా ఈ సమగ్ర పరిశోధనలు సాగాయి. మారిన నేటి జీవన శైలిలో మహిళల వివాహ వయస్సు బాగా పెరగడం, ఉద్యోగాల్లో తీవ్రమైన ఒత్తిడి, నైట్ షిఫ్ట్ సంస్కృతి, తగినంత శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలు సంతానోత్పత్తిపై ఎంత తీవ్ర ప్రభావం చూపుతున్నాయో ఈ అధ్యయనాలు వెల్లడించాయి.

మరోవైపు పురుషుల్లోనూ వీర్యకణాల నాణ్యత పడిపోవడం, డీఎన్‌ఏ ఫ్రాగ్మెంటేషన్ పెరగడం వంటి సమస్యలు క్రమంగా ఎక్కువవుతున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు వేగంగా పడిపోతోందని, ఇది తెలంగాణలో 1.8 ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో 1.7కు చేరిందని తెలిపారు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సంస్థకు చెందిన పలువురు నిపుణులు దంపతులకు పలు కీలక సూచనలు చేశారు. సంతాన లేమి సమస్య ఎదురైనప్పుడు అనవసరంగా సమయం వృథా చేయకుండా ఆరంభంలోనే నిపుణులను సంప్రదిస్తే సానుకూల ఫలితాలు వస్తాయని క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి స్పష్టం చేశారు. అలాగే మొత్తం వంధ్యత్వ సమస్యల్లో దాదాపు సగం వరకు పురుషుల కారణాలే ఉంటున్నాయని, మహిళల్లో పీసీఓఎస్ ప్రధాన అవరోధంగా మారిందని వరంగల్ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ అనూషా రెడ్డి వివరించారు. కెరీర్, ఇతర ప్రాధాన్యతల వల్ల భవిష్యత్తు కోసం తమ అండాలను భద్రపరుచుకునే 'ఎగ్ ఫ్రీజింగ్' వైపు మహిళలు ఇప్పుడు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని తెలిపారు.

Ferty 9

ప్రస్తుతం 30 ఏళ్లు,  35 ఏళ్లు దాటిన తర్వాత చికిత్స కోసం వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని విజయవాడ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ సుమ వర్ష తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక సాంకేతికత, అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో విజయవాడ కేంద్రంగా ప్రతీ దంపతికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. పెరుగుతున్న సమస్యలకు అనుగుణంగా బాధితులకు మానసికంగా, శారీరకంగా పూర్తి భరోసా కల్పిస్తూ ఆశించిన ఫలితాలను అందించడమే లక్ష్యంగా తాము ముందుకెళ్తున్నామని ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.

Ferty 9

కాగా నిన్న జరిగిన ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం సందర్భంగా ఫెర్టీ9 తమ 11 కేంద్రాల్లోనూ 'నీడిల్-ఫ్రీ ఐవీఎఫ్' విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల రోజూ ఇంజెక్షన్లు తీసుకోవడం వల్ల కలిగే నొప్పులు, భయాందోళనల నుంచి బాధితులకు ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఐవీఎఫ్ విజయశాతాన్ని మరింత పెంచడానికి, ఇంప్లాంటేషన్ వైఫల్యాలను నివారించడానికి కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత పరిశోధనలను కూడా సంస్థ వేగవంతం చేసింది. రాబోయే రోజుల్లో గర్భస్రావాల నివారణకు ప్రత్యేకంగా 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'ను ఏర్పాటు చేసి, తెలుగు రాష్ట్రాల్లోని దంపతులకు మరిన్ని ఆధునిక సేవలు అందించేందుకు ఫెర్టీ9 సమాయత్తమవుతోంది.

Ferty 9

Tags

Be the first to react

Latest