LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Gulf

Iran & India: పశ్చిమాసియాలో ఉద్రిక్తత - మరోసారి ఇరాన్ దూకుడు.. భారతీయులున్న ట్యాంకర్‌పై కాల్పులు!

Iran & India: పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఒమన్‌లోని షినాస్ ఓడరేవు సమీపంలో భారతీయ నావికులున్న ఒక రసాయన ట్యాంకర్‌పై ఇరాన్ కోస్ట్ గార్డ్ కాల్పులు జరిపినట్లు భారత ఓడరేవులు, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. టోగో దేశ జెండాతో ప్రయాణిస్తున్న 'ఎంటీ సైరన్'…

AndhraPravasi News Desk 2 min read
Iran & India: పశ్చిమాసియాలో ఉద్రిక్తత - మరోసారి ఇరాన్ దూకుడు.. భారతీయులున్న ట్యాంకర్‌పై కాల్పులు!
  • ఇటీవల భారత నౌకలను కూడా లక్ష్యంగా చేసుకుంటున్న ఇరాన్..
     
  • Gulf: ఒమన్ తీరంలో రసాయన ట్యాంకర్‌పై ఇరాన్ కోస్ట్ గార్డ్ కాల్పులు..

Iran & India: పశ్చిమాసియా జలాల్లో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఒమన్‌లోని షినాస్ ఓడరేవు సమీపంలో ప్రయాణిస్తున్న 'ఎంటీ సైరన్' అనే రసాయన ట్యాంకర్‌పై ఇరాన్ కోస్ట్ గార్డ్ దళాలు కాల్పులు జరపడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. టోగో దేశ జెండాతో ఉన్న ఈ నౌకలో భారతీయ నావికులు ఉండటం గమనార్హం. సోమవారం జరిగిన అంతర్-మంత్రిత్వ శాఖల సమావేశంలో భారత షిప్పింగ్ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ మందీప్ సింగ్ రణధావా ఈ దాడులను ధ్రువీకరించారు. ఏప్రిల్ 25న జరిగిన ఈ ఘటనలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బలవంతంగా నౌకలోకి ప్రవేశించారని, అయితే ఇరాన్ కోస్ట్ గార్డ్ మాత్రం తాము హెచ్చరికగా మాత్రమే కాల్పులు జరిపామని పేర్కొనడం ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులకు అద్దం పడుతోంది.

ఈ ఆందోళనకర పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. విదేశాంగ శాఖ మరియు భారత రాయబార కార్యాలయాలతో కలిసి నౌకల భద్రతపై నిరంతరం సమీక్షలు నిర్వహిస్తోంది. డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూమ్ ఇప్పటికే వేలాది ఇమెయిల్స్ మరియు ఫోన్ కాల్స్ ద్వారా భారత నౌకలతో సంప్రదింపులు జరుపుతూ, సముద్ర మార్గాల్లో ప్రయాణించే సిబ్బందికి తగిన సూచనలు ఇస్తోంది. ప్రస్తుతం 2,770 భారత నౌకల కదలికలను ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. ఇప్పటికైతే భారత నావికులు సురక్షితంగా ఉన్నారని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని రణధావా స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఈ ఘర్షణ వాతావరణం అంతర్జాతీయ వాణిజ్య రవాణాపై పెను ప్రభావం చూపేలా కనిపిస్తోంది.

ఇరాన్ దళాలు భారత నౌకలను లక్ష్యంగా చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గత కొద్ది రోజులుగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) వరుస దాడులకు పాల్పడుతుండటం భారత్‌కు పెద్ద సవాల్‌గా మారింది. ఏప్రిల్ 18న హర్మూజ్ జలసంధి వద్ద, అలాగే ఏప్రిల్ 22న ముంద్రా పోర్టుకు వస్తున్న నౌకలపై జరిగిన దాడులపై భారత్ ఇప్పటికే ఇరాన్‌కు తన తీవ్ర నిరసనను వ్యక్తం చేసింది. అయితే, తమ ప్రాంతీయ జలాల్లోకి అనుమతి లేకుండా ప్రవేశించడమే ఈ చర్యలకు కారణమని ఇరాన్ సమర్థించుకుంటోంది.

Be the first to react

More Coverage

Israel & India: పశ్చిమాసియాలో శాంతికి ‘భారత్’ ఒక్కటే మార్గం.. ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ కీలక వ్యాఖ్యలు!

Israel & India: పశ్చిమాసియాలో శాంతికి ‘భారత్’ ఒక్కటే మార్గం.. ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ కీలక వ్యాఖ్యలు!

Israel & India: భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతలను…

Gulf Updates: రూ.84 లక్షల ‘దియా’ చెల్లిస్తేనే సౌదీ జైలు నుంచి విడుదల.. రియాద్ జైలులో నిజామాబాద్ ప్రవాసి..

Gulf Updates: రూ.84 లక్షల ‘దియా’ చెల్లిస్తేనే సౌదీ జైలు నుంచి విడుదల.. రియాద్ జైలులో నిజామాబాద్ ప్రవాసి..

Gulf Updates: సౌదీ అరేబియాలోని రియాద్ జైలులో ఉన్న నిజామాబాద్ జిల్లా సాలూర మండలం కుమ్మన్‌పల్లి గ్రామా…