సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. కీలక తేదీలలో ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ అయిన ఒజెంపిక్ ఇంజెక్షన్ భారత్‌లో విడుదల! టైప్ 2 డయాబెటిస్ - బరువు తగ్గడానికి కూడా.. Car Sales: ధర తగ్గిన తర్వాత ఈ కార్లకు ఫుల్ డిమాండ్... పోటీపడి మరీ కొనేస్తున్నారు! టాప్ 5 బెస్ట్ సెల్లింగ్ SUVల వివరాలు! H1B Visa ఫీజు పెంపు వ్యవహారంలో అనూహ్య పరిణామం.. కోర్టుకెక్కిన 20 రాష్ట్రాలు - ఆందోళనలో కార్పొరేట్లు! Modi-Putin: మోదీ పుతిన్ సెల్ఫీ.. అమెరికా రాజకీయాల్లో కలకలం.. ట్రంప్‌కు దేశంలోనే వ్యతిరేకత! విద్య ఎంత ముఖ్యమో విలువలు కూడా అంతే ముఖ్యం.. నేను ఈ స్థాయికి వచ్చానంటే! అమరావతి రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ కీలక సమావేశం.. 921 ప్లాట్లపై చర్చ - 15 రోజుల్లో.. Political News: సీఎం చంద్రబాబుకు భారీ ఊరట.. ఫైబర్‌నెట్ కేసు కొట్టివేసిన కోర్టు.. నిజమే గెలిచింది! Kavithas comments: సీఎం అవుతా.. అన్నింటిపై విచారణ జరిపిస్తా.. కవిత సంచలన వ్యాఖ్యలు! Tourism: విశాఖ టూరిజానికి బిగ్ బూస్ట్…! తొమ్మిది రోజుల బీచ్ ఫెస్టివల్ తేదీలు ఖరారు..! సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. కీలక తేదీలలో ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ అయిన ఒజెంపిక్ ఇంజెక్షన్ భారత్‌లో విడుదల! టైప్ 2 డయాబెటిస్ - బరువు తగ్గడానికి కూడా.. Car Sales: ధర తగ్గిన తర్వాత ఈ కార్లకు ఫుల్ డిమాండ్... పోటీపడి మరీ కొనేస్తున్నారు! టాప్ 5 బెస్ట్ సెల్లింగ్ SUVల వివరాలు! H1B Visa ఫీజు పెంపు వ్యవహారంలో అనూహ్య పరిణామం.. కోర్టుకెక్కిన 20 రాష్ట్రాలు - ఆందోళనలో కార్పొరేట్లు! Modi-Putin: మోదీ పుతిన్ సెల్ఫీ.. అమెరికా రాజకీయాల్లో కలకలం.. ట్రంప్‌కు దేశంలోనే వ్యతిరేకత! విద్య ఎంత ముఖ్యమో విలువలు కూడా అంతే ముఖ్యం.. నేను ఈ స్థాయికి వచ్చానంటే! అమరావతి రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ కీలక సమావేశం.. 921 ప్లాట్లపై చర్చ - 15 రోజుల్లో.. Political News: సీఎం చంద్రబాబుకు భారీ ఊరట.. ఫైబర్‌నెట్ కేసు కొట్టివేసిన కోర్టు.. నిజమే గెలిచింది! Kavithas comments: సీఎం అవుతా.. అన్నింటిపై విచారణ జరిపిస్తా.. కవిత సంచలన వ్యాఖ్యలు! Tourism: విశాఖ టూరిజానికి బిగ్ బూస్ట్…! తొమ్మిది రోజుల బీచ్ ఫెస్టివల్ తేదీలు ఖరారు..!

AP Electricity: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కరెంట్ ఛార్జీలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..!

2025-12-11 13:40:00
Football News: హైదరాబాద్‌కి మెస్సీ... ఫోటో అవకాశం రూ.10 లక్షలు కేవలం 100 మందికే పరిమితం!!!

ఏపీ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి తీపికబురు అందించారు. విద్యుత్ ఛార్జీల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. బుధవారం సచివాలయంలో మంత్రులు, విభాగాల కార్యదర్శులు, హెచ్‌వోడీలతో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో సీఎం పలు శాఖల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల్లో పనితీరు మందగించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు చేరుకునే సేవల్లో లోపాలు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రానున్న నెలల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలు, అమలు చేయాల్సిన ప్రాజెక్టులపై వేగంగా పనిచేయాలని స్పష్టం చేశారు.

YSRCP: బోరుగడ్డ అనిల్‌పై వైసీపీ పార్టీ స్పష్టీకరణ…! మా వ్యక్తే కాదు అంటూ క్లారిటీ

విద్యుత్ శాఖపై జరిగిన ప్రత్యేక సమీక్షలో సీఎం చంద్రబాబు విద్యుత్ ఛార్జీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది విద్యుత్ ఛార్జీలు పెంచే ఆలోచనే లేదని స్పష్టం చేస్తూ ప్రజలకు నేరుగా నమ్మకం కల్పించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పదేపదే ఛార్జీలను పెంచి భారీ భారం మోపిందని, మొత్తం రూ.32 వేల కోట్ల భారాన్ని ప్రజలపై వేసిందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా విద్యుత్ శాఖ రూ.1 కోటి పది లక్షల అప్పులో కూరుకుందన్న విషయాన్ని బయటపెట్టారు. ప్రజల ధనం దుర్వినియోగం అయ్యేలా గత ప్రభుత్వం పీపీఎలను (Power Purchase Agreements) రద్దు చేసిందని సీఎం విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక ఒత్తిడి లేకుండా ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలనే నిబద్దతతో ముందుకు సాగుతుందని చెప్పారు.

Pakistan: అఫ్గాన్‌పై పాక్ వైమానిక దాడులు యుద్ధచర్యలే.. భారత్ ఘాటైన స్పందన!

ఛార్జీలు పెంచకుండా, విద్యుత్‌ను మరింత సమర్థవంతంగా ఇవ్వడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూనిట్ విద్యుత్ కొనుగోలు ధర రూ.5.19 నుండి రూ.4.92 కి తగ్గిందని వెల్లడించారు. దీనివల్ల ప్రభుత్వంపై ఉండే భారం తగ్గడమే కాకుండా, ప్రజలకు దీర్ఘకాల ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ శాఖ కూడా నిజాయితీగా పని చేయాల్సిన అవసరం ఉందని, ప్రజలకు నేరుగా ఉపయోపడే విధంగా వ్యవహరించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. శాఖల నుంచి నిధుల కోసం ఎడతెరపిలేకుండా ప్రతిపాదనలు వస్తున్నాయని, ఇప్పటికే విడుదలైన నిధులను సమర్థంగా వినియోగించుకోవాలని తెలియజేశారు.

Vande Bharat: నర్సాపురం–చెన్నై వందే భారత్‌కు గ్రీన్ సిగ్నల్…! రైల్వే కొత్త షెడ్యూల్ రిలీజ్!

ఏపీ అభివృద్ధి దిశలో ప్రభుత్వం గట్టిగా అడుగులు వేస్తోందని సీఎం చెప్పారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో ‘సూపర్ సిక్స్’ పథకాలు సూపర్ హిట్‌గా నిలుస్తున్నాయని తెలిపారు. ఇప్పటివరకు రూ.50 వేల కోట్లకు పైగా పెన్షన్లను పంపిణీ చేసి ప్రజల జీవనోపాధిని బలపరిచామని వివరించారు. ప్రతి శాఖ తన పనితీరును మెరుగుపర్చుకోవడానికి జనవరి 15 వరకు గడువు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సుతో రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు ఆకర్షితమైనట్లు చెప్పారు. దీంతో యువతకు ఉపాధి అవకాశాలు మరింత వీలవుతాయని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కొత్త దిశలో పటిష్టంగా ముందుకు సాగుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు.

Indigo: అకస్మాత్తుగా రద్దైన విమాన సర్వీసులు…! వీడియోలో స్పందించిన ఇండిగో చైర్మన్…!
AI Jobs: భారత్ కు టెక్ దిగ్గజాల క్యూ! ఏఐ ఉద్యోగాల జాతర!
Cherry Craze: చెర్రీ క్రేజ్ పీక్స్‌లో.. జపనీస్ ఫ్యాన్స్‌తో రామ్ చరణ్ సెల్ఫీ టైం!
Dry Fruits Tips: డ్రైఫ్రూట్స్ ఎలా తింటే నిజమైన ఆరోగ్య ప్రయోజనం! నిపుణుల సూచనలు..
USA Visa: ట్రంప్ గోల్డ్ కార్డ్ & ప్లాటినం కార్డ్... ఫీజులు, అర్హత, దరఖాస్తు సంబంధించి పూర్తి వివరాలు!!
Notification : ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖలో 182 పోస్టులకు నోటిఫికేషన్.. రాష్ట్రవ్యాప్తంగా CWC, JJBలో!

Spotlight

Read More →