దొడ్డి దారిలో ప్రయత్నాలు ముమ్మరం చేసిన వైసీపీ... అప్రమత్తంగా లేకపోయారా.... అంధకారమే గతి.

ఏపీలో అధికార వైసీపీ దొడ్డిదారిలో మళ్లీ అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అధికారులను అదిరించి బెదిరించి ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లను చేర్చడం, ప్రతి

Published : 2024-01-22 16:58:00

ఏపీలో అధికార వైసీపీ దొడ్డిదారిలో మళ్లీ అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

అధికారులను అదిరించి బెదిరించి ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లను చేర్చడం, ప్రతిపక్ష పార్టీల ఓట్లను తీసివేయడం వంటి చర్యలకు దిగజారుతున్నారు.

ఒక్క చంద్రగిరి నియోజకవర్గంలోనే పక్క రాష్ట్రాలకు చెందిన లక్ష దొంగ ఓట్లను నమోదు చేయడం ఉదాహరణగా చెప్పవచ్చు.

రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఓటర్లను తొలగించే చర్యలు ముమ్మరం చేశారు.

ఉపాధి కొరకు హైదరాబాద్ బెంగుళూరు చెన్నై వంటి నగరాలకు వెళ్లిన వారి ఓట్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తొలగిస్తుంది.

సాఫ్ట్వేర్ మరియు పారిశ్రామిక రంగాలలో స్థిరపడ్డ ఎంతో మంది ఉద్యోగులు ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో విసిగిపోయి ఉండడంతో వారి ఓట్లు అధికార వైసిపికి పడవని తెలిసి వారిని ఓటర్ల జాబితా నుండి తొలగిస్తున్నారు.

రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేక పక్క రాష్ట్రం వెళ్లిన వారికి ప్రాథమిక హక్కు అయినా ఓటు కూడా లేని విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

ఎన్నికల విధి నిర్వహణ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పాటైన వాలంటీర్లు గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో నింపే ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పటికే వాలంటీర్ల ద్వారా వైసిపి అనుకూలురు,వ్యతిరేకుల జాబితాను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఇన్చార్జులు సేకరించారు.

ఈ జాబితా ప్రకారం గ్రామ, వార్డు సచివాలయాలలో పనిచేస్తున్న ఉద్యోగులను బిఎల్వోలుగా నియమించి వారి ద్వారా ఓట్లను తొలగించడం చేర్పించడం అంటే చర్యలకు వైసీపీ ప్రభుత్వం పాల్పడుతుంది.

ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే అధికార వైసీపీ ప్రభుత్వం పై ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

అధికారం చేపట్టిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని బహిరంగంగా ప్రకటించి ఉద్యోగులను ఈ ప్రభుత్వం మోసం చేసింది.

ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలల్లో రిటైర్ అయిన ఉద్యోగుల స్థానంలో కొత్త ఉద్యోగులను నియామకం చేయకపోవడంతో పని భారం పెరిగి ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

దీనికి తోడు ప్రతినెలా ఒకటవ తేదీన వచ్చే జీతం 20వ తేదీ వచ్చిన రాకపోవడంతో ఉద్యోగులు ప్రభుత్వ పనితీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ పరిస్థితులలో ప్రభుత్వ ఉద్యోగులచే ఎన్నికల నిర్వహణ బాధ్యత చేపడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తారన్న భయం
వైసీపీకు పట్టుకుంది.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

స్వాతంత్రం సిద్ధించిన నాటి నుండి ఎన్నికల నిర్వహణలో ప్రధాన భూమిక పోషించే ఉపాధ్యాయులను ఎన్నికల విధుల నుండి తప్పించడానికి ఈయన ప్రత్యేక జీవో తీసుకువచ్చారు.

నియోజకవర్గాలలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులను ప్రభుత్వం తన చెప్పు చేతల్లో పెట్టుకుని వాటర్లో జాబితా రూపకల్పనలో ఎన్నో అడ్డదారులు తొక్కుతున్నారు.

ఓటర్ల జాబితాలో జరుగుతున్న అవకతవకలపై ప్రతిపక్షాలు ఎన్ని ఆందోళనలు చేస్తున్న పట్టించుకోవడం లేదు

ఓటర్ల జాబితాలో అవకతవకలపై ప్రధాన ప్రతిపక్ష పార్టీల నాయకులు చంద్రబాబు లోకేష్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేశారంటే రాష్ట్రంలో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఓటర్ల జాబితాలో ద్వారా గట్టెక్కలనే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ప్రతి నియోజకవర్గంలోనూ ఎన్నికల సమయంలో మూక దాడులకు పాల్పడేలా అరాచక శక్తులను ప్రోత్సహిస్తున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలలో అరాచక శక్తులను అడ్డుపెట్టుకొని ఎన్నికలలో నామినేషన్ కూడా వేయకుండా ఏకగ్రీవం చేసుకొని ఈయన గొప్ప విజయం గా అభివర్ణించుకున్నారు.

సార్వత్రిక ఎన్నికలలో కూడా ఇదే పందాను అవలంబిస్తూ తటస్తులు, ఉన్నత, మధ్యతరగతి ప్రజలు, మహిళలు ఉన్న పోలింగ్ బూత్ల వద్ద ఎక్కువ శాతం ఓటింగ్ జరగకుండా అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

రాష్ట్రంలో జరిగే సార్వత్రిక ఎన్నికలు రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని రాష్ట్రమంతా విస్తరింప చేసే విధంగా ఈయన ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

సార్వత్రిక ఎన్నికలలో ఈయన మళ్ళీ అధికారంలోకి రాకుండా ఉండేలా ప్రజల అప్రమత్తంగా ఉండకపోతే రాష్ట్రం పరిస్థితి ఆగమ్య గోచరంగా మారుతుంది అనడంలో సందేహం లేదు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →