Pooja Hegde: సల్మాన్ ఖాన్ బంగారం.. కొందరు హీరోలు కుట్రలు పన్నుతారు.. పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు!
Pooja Hegde: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌పై అందాల భామ పూజా హెగ్డే ప్రశంసలు కురిపించింది. సల్మాన్ చాలా మంచివాడని, అతనికి కుట్రలు, కుతంత్రాలు తెలియవని ప్రశంసించింది. కొంతమంది హీరోలు మాత్రం కుట్రలు పన్నుతుంటారని సంచలన వ్యాఖ్యలు చేసింది చేసింది.
- కొందరు హీరోలు కుట్రలు పన్నుతుంటారని విమర్శ..
- మనసులో ఏది ఉంటే అది బయటకు చెబుతారని ప్రశంస..
Pooja Hegde: టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లలో తన గ్లామర్, యాక్టింగ్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. బాలీవుడ్ భాయ్జాన్ సల్మాన్ ఖాన్ను (Salman Khan) ఆకాశానికెత్తేసిన ఈ బ్యూటీ, అదే సమయంలో చిత్ర పరిశ్రమలోని కొందరు హీరోలపై చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పూజా హెగ్డే తన సినీ ప్రయాణం, సహ నటులతో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.
సల్మాన్ ఖాన్ చాలా గొప్ప వ్యక్తి.. కానీ కొందరు హీరోలు మాత్రం!
గతంలో సల్మాన్ ఖాన్తో కలిసి ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమాలో నటించిన పూజా హెగ్డే, ఆయన వ్యక్తిత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తింది. నిజాయితీ గల వ్యక్తి: "సల్మాన్ ఖాన్ మనసు చాలా మంచిది. ఆయనకు ఎలాంటి కుట్రలు, కుతంత్రాలు తెలియవు. మనసులో ఏది ఉంటే అది మొహం మీదే మాట్లాడేస్తారు. నేటి ప్రపంచంలో అలా ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం చాలా కష్టం. ఆయనొక అద్భుతమైన వ్యక్తి" అని కొనియాడింది.
ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్: ఇదే సమయంలో చిత్ర పరిశ్రమలో కొందరు హీరోల ప్రవర్తనపై పూజ సంచలన వ్యాఖ్యలు చేసింది. "ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు మాత్రం ఎప్పుడూ లోపల ఒకటి పెట్టుకుని బయటకు మరొకటి మాట్లాడుతుంటారు. వెనుక ఉండి కుట్రలు పన్నుతుంటారు" అంటూ ఇండస్ట్రీ గుట్టు విప్పి షాక్ ఇచ్చింది. అయితే ఆమె ఏ హీరోని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసిందనేది మాత్రం సస్పెన్స్గా ఉంచింది.
హృతిక్ నుంచి డాన్స్.. ప్రభాస్ అంటే ఫుడ్!
తన కెరీర్లో పనిచేసిన ఇతర స్టార్ హీరోల గురించి కూడా పూజా హెగ్డే పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. హృతిక్ రోషన్ (Hrithik Roshan): బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ సరసన 'మొహెంజదారో' సినిమాతో పూజ హిందీ ఇండస్ట్రీకి పరిచయమైంది. డాన్స్ చేసేటప్పుడు కేవలం స్టెప్పులు వేయడం కాకుండా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ను ఎలా ఎంజాయ్ చేయాలో తాను హృతిక్ చూసే నేర్చుకున్నానని వెల్లడించింది. అలాగే తనకు 'అరబిక్ కుతు', 'మోనికా' పాటలంటే ప్రాణమని చెప్పింది.
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas): 'రాధే శ్యామ్' చిత్రంలో ప్రభాస్ సరసన నటించిన పూజకు ఆయన అనగానే ముందుగా గుర్తొచ్చేది 'ఫుడ్' (ఆహారం) మాత్రమేనట. సెట్స్లో ప్రభాస్ పంపించే రకరకాల రుచికరమైన వంటకాలు ఎప్పటికీ మర్చిపోలేనని నవ్వుతూ చెప్పుకొచ్చింది.
సౌత్ టు నార్త్.. పూజా హెగ్డే కెరీర్ గ్రాఫ్..
ఒకప్పుడు టాలీవుడ్లో వరుస స్టార్ హీరోల సినిమాలతో గోల్డెన్ లెగ్గా దూసుకుపోయిన పూజా హెగ్డేకు, గత కొంతకాలంగా తెలుగులో అవకాశాలు తగ్గాయి. దీంతో ఆమె ప్రస్తుతం తన ఫోకస్ మొత్తాన్ని బాలీవుడ్, కోలీవుడ్ వైపు మళ్లించింది. తమిళ స్టార్ హీరో, ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న విజయ్ (Thalapathy Vijay) చివరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) లో పూజా హెగ్డేనే కథానాయికగా నటించడం విశేషం.
సల్మాన్ ఖాన్ నిజాయితీని మెచ్చుకుంటూనే, తోటి హీరోల కుట్రలపై పూజ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెటిజన్లలో తీవ్ర చర్చకు దారితీశాయి.
Tags
Be the first to react