⚡ BREAKING

Chiranjeevi: తన నమ్మకాల కోసం రాజీపడని నేత ముద్రగడ.. చిరంజీవి సంతాప సందేశంలో కీలక వ్యాఖ్యలు!

Chiranjeevi: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముద్రగడ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ వార్త తెలియగానే చిరంజీవి సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా భావోద్వేగభరిత పోస్ట్ ద్వారా తన ప్రగాఢ సంతాపం తెలిపారు.

తన నమ్మకాల కోసం రాజీపడని నేత ముద్రగడ..
తన నమ్మకాల కోసం రాజీపడని నేత ముద్రగడ..
  • మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతిపై చిరంజీవి దిగ్భ్రాంతి..

  • ముద్రగడది రాజీపడని వ్యక్తిత్వం అని కొనియాడిన మెగాస్టార్..

Chiranjeevi: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మరణవార్త తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఎట్టకేలకు కన్నుమూశారు. ముద్రగడ మృతి పట్ల రాజకీయ, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సామాజిక మాధ్యమం 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చశారు. ఒక భావోద్వేగభరితమైన పోస్ట్ ద్వారా ముద్రగడ పద్మనాభం కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం తెలిపారు.

ప్రజా జీవితంలో ముద్రగడ చూపిన చొరవను కొనియాడుతూ చిరంజీవి పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.

రాజీపడని వ్యక్తిత్వం ఆయనది: చిరంజీవి..
మెగాస్టార్ చిరంజీవి తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్లో ముద్రగడతో ఉన్న అనుబంధాన్ని, ఆయన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు. "మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు సామాజికవర్గ హక్కుల కోసం పోరాడిన ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు ఇక లేరనే వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇది ఎంతో బాధాకరమైన సమయం. ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ఆయన చూపిన నిబద్ధత, తన ఆశయాలు మరియు నమ్మకాల కోసం ఎక్కడా రాజీ పడని ఆయన గంభీర వ్యక్తిత్వం, సమాజం పట్ల ఆయనకున్న అంకితభావం ఎప్పటికీ గుర్తుండిపోతాయి" అని చిరంజీవి కొనియాడారు.

సమాజ హితం కోసం ముద్రగడ పద్మనాభం చేసిన సుదీర్ఘ సేవలు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతాయని చిరంజీవి పేర్కొన్నారు.

కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి..
ముద్రగడ పద్మనాభం ఆత్మకు సద్గతులు కలగాలని ఆకాంక్షిస్తూ.. "ముద్రగడ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ కష్టసమయంలో వారి కుటుంబ సభ్యులకు, అత్యంత సన్నిహితులకు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వారి మద్దతుదారులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓం శాంతి" అంటూ చిరంజీవి తన సందేశాన్ని ముగించారు.

ముద్రగడ పద్మనాభం మృతితో తూర్పుగోదావరి జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ ఒక బలమైన ప్రజా గొంతుకను కోల్పోయిందని, ముఖ్యంగా కాపు సామాజికవర్గ సంక్షేమం కోసం ఆయన చేసిన పోరాటాలు చరిత్రలో నిలిచిపోతాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags

Be the first to react

Latest