⚡ BREAKING

OTT Release: థియేటర్లలో మిస్ అయ్యారా.? ఓటీటీలోకి వచ్చేసిన ‘మా ఇంటి బంగారం’.. 4 దక్షిణాది భాషల్లో.. ఎక్కడ చూడాలంటే?

OTT Release: స్టార్ హీరోయిన్ సమంత సుమారు మూడేళ్ల విరామం తర్వాత 'మా ఇంటి బంగారం' చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. థియేటర్లలో బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టిన ఈ సినిమా, ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు ఓటీటీ వేదికపైకి వచ్చేసింది.

4 దక్షిణాది భాషల్లో.. ఎక్కడ చూడాలంటే?
4 దక్షిణాది భాషల్లో.. ఎక్కడ చూడాలంటే?
  • బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రం..

  • Entertainment: తెలుగుతో పాటు పలు దక్షిణాది భాషల్లోనూ అందుబాటులోకి..

OTT Release: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) సుమారు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపై ఘన విజయాన్ని అందుకున్న చిత్రం 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaram). థియేటర్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ లేడీ ఓరియెంటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు ఓటీటీ (OTT) వేదికపైకి వచ్చేసింది.

తెలుగు చిత్ర పరిశ్రమలోనే హీరోయిన్ ఓరియెంటెడ్ కథాంశంతో వచ్చి రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన తొలి తెలుగు సినిమాగా ‘మా ఇంటి బంగారం’ చారిత్రాత్మక రికార్డు సృష్టించింది. థియేటర్లలో ఫ్యామిలీ ఆడియన్స్‌ను, ముఖ్యంగా మహిళా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ప్రియుల ముందుకు వచ్చింది.

జియో హాట్‌స్టార్‌లో అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్!
ఈ బ్లాక్‌బస్టర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం 'జియో హాట్‌స్టార్' (Jio Hotstar) భారీ ధరకు సొంతం చేసుకుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే గురువారం అర్ధరాత్రి (Mid-night) నుంచే ఈ చిత్రం స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది.

పాన్-ఇండియా అప్పీల్‌తో కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఒకేసారి ఈ సినిమాను రిలీజ్ చేశారు. దీంతో దక్షిణాది సినీ ప్రియులు ఈ చిత్రాన్ని వీక్షించేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. థియేటర్లలో ఏ రేంజ్ సక్సెస్ సాధించిందో, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనూ అదే స్థాయి వ్యూవర్‌షిప్ రాబడుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

సమంత-నందిని రెడ్డి కాంబోలో ‘హ్యాట్రిక్’ హిట్..
ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ కామెడీ డ్రామాను టాలెంటెడ్ డైరెక్టర్ నందిని రెడ్డి (Nandini Reddy) తెరకెక్కించారు. గతంలో సమంతతో ‘జబర్దస్త్’, ‘ఓ బేబీ’ వంటి చిత్రాలు చేసిన నందిని రెడ్డి, మరోసారి తన మార్క్ స్క్రీన్‌ప్లేతో ఈ సినిమాను అద్భుతంగా రూపొందించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇది హ్యాట్రిక్ చిత్రంగా నిలవడం విశేషం.

సమంతే నిర్మాత: ఈ సినిమాకు మరో పెద్ద ప్లస్ పాయింట్ ఏమిటంటే.. సమంత ఈ చిత్రంతో నిర్మాతగా అవతారమెత్తారు. తన సొంత బ్యానర్ ‘ట్రాలాలా పిక్చర్స్’ (Tralala Pictures) పై ప్రముఖ బాలీవుడ్ మేకర్స్ రాజ్ అండ్ డికె (Raj & DK) కి చెందిన రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరులతో కలిసి సమంత ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు.

సమంత అదిరిపోయే కమ్‌బ్యాక్: హైలైట్స్ ఇవే
వరుస పరాజయాలు, వ్యక్తిగత కారణాలతో సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమంతకు 'మా ఇంటి బంగారం' పర్‌ఫెక్ట్ కమ్‌బ్యాక్‌గా నిలిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైనప్పటికీ, కేవలం మౌత్ టాక్‌తోనే ఈ సినిమా థియేటర్లను షేక్ చేసింది. సమంత పవర్‌ఫుల్ అండ్ బబ్లీ యాక్టింగ్, సంతోష్ నారాయణన్ (Santhosh Narayanan) అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి.

ఈ చిత్రంలో దిగంత్, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, గౌతమి, ఆనంద్, సీనియర్ నటి లక్ష్మి కీలక పాత్రల్లో నటించారు. థియేటర్లలో ఈ హ్యాపీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను మిస్ అయిన వారు, అలాగే మళ్లీ చూడాలనుకునే వారు ఇప్పుడే ‘జియో హాట్‌స్టార్’ ఓటీటీ లో వీక్షించవచ్చు.

Tags

Be the first to react

Latest