IFFI 2025: గోవా సీఎం చేతుల మీదుగా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు… ఆ లెజెండరీ స్టార్ ఎవరంటే?

IFFI 2025 ముగింపు వేడుక గోవాలో  సినీ తారల సందడి, అంతర్జాతీయ అతిథుల హాజరు, పురస్కారాలు అన్నీ కలిపి వేడుకను మరింత శోభాయమానం చేశాయి. అయితే మొత్తం కార్యక్రమాని

Published : 2025-11-29 10:40:00
Trump : ఆ మృగం మూల్యం తప్పక చెల్లించాలి.. ట్రంప్ ఆగ్రహం!

IFFI 2025 ముగింపు వేడుక గోవాలో  సినీ తారల సందడి, అంతర్జాతీయ అతిథుల హాజరు, పురస్కారాలు అన్నీ కలిపి వేడుకను మరింత శోభాయమానం చేశాయి. అయితే మొత్తం కార్యక్రమానికి హైలైట్‌గా నిలిచింది భారత సినీ దిగ్గజం రజనీకాంత్‌కు ప్రదానం చేసిన లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు. సినిమా రంగంలో అయిదు దశాబ్దాల ప్రయాణాన్ని గుర్తించి, గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఈ అవార్డును రజనీకి అందించగా, సభలో క్షణం పాటు చప్పట్ల శబ్దం ఆగలేదు. తాను నటుడిగా పుట్టడం తన అదృష్టమని, మరో జన్మ వచ్చినా ఇదే మార్గాన్ని ఎంచుకుంటానని రజనీకాంత్ చెప్పిన మాటలు అభిమానులను, సహచరులను కదిలించాయి.

New Roads: విశాఖపట్నంలో కొత్తగా నాలుగు రోడ్లు.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు దూసుకెళ్లొచ్చు! రూపు రేఖలు మారిపోతాయి...

వేడుకలో బాలీవుడ్ నటులు రణ్వీర్ సింగ్, దనుష్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, దర్శకులు రమేష్ సిప్పీ, మధుర్ బండార్కర్, శేఖర్ కపూర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏడాది పొడవునా మరణించిన కళాకారులను స్మరించేందుకు ప్రత్యేక ఆడియో–విజువల్ నివాళి సమర్పించబడింది. ధర్మేంద్ర, కమిని కౌశల్, శ్యామ్ బెనెగల్ వంటి ప్రముఖులను ఈ క్రమంలో గుర్తుచేసుకున్నారు.

Glass Bridge: దేశంలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జి గ్రాండ్ ఓపెనింగ్! పర్యాటకులకు కొత్త థ్రిల్!

ఈ ఏడాది బెస్ట్ ఫిల్మ్‌గా వియత్నాం దర్శకురాలు ఆష్ మేయ్‌ఫైర్ తెరకెక్కించిన స్కిన్ ఆఫ్ యూత్

Railway Alert: రైల్వే ప్రయాణికులకు అలర్ట్! జనవరి 27–31 మధ్య ఈ రూట్లో 16 రైళ్లు రద్దు!

( Skin of Youth) ఎంపికైంది. ట్రాన్స్‌జెండర్ వ్యక్తి, కేజ్ ఫైటర్ మధ్య ఉన్న భావోద్వేగ సంబంధాన్ని నాజూకుగా చూపించిన ఈ చిత్రానికి అంతర్జాతీయ జ్యూరీ ప్రశంసలు లభించాయి. బెస్ట్ డైరెక్టర్‌గా మరాఠీ సినిమా గోంధాల్ (Gondhal) దర్శకుడు సంతోష్ దవాఖర్ నిలిచారు. కొలంబియా నటుడు ఉబెయిమార్ రియాస్ తన ఏ పోయెట్ (A Poet) చిత్రంలోని పాత్రకు గాను బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నారు. స్లోవేనియా నటి జారా ఒస్తాన్ లిటిల్ ట్రబుల్స్ గర్ల్స్ (Little Trouble Girls) చిత్రానికి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు పొందారు. నైజీరియా చిత్రం మై ఫాదర్ షాడో (My Father’s Shadow) ప్రత్యేక జ్యూరీ అవార్డును అందుకుంది.

India US Deal: భారత్–అమెరికా భారీ డీల్! రూ.7,995 కోట్ల హెలికాప్టర్ నిర్వహణ!

ఉత్సవం ఎదుగుతున్న తీరు ఎంతో సంతోషమని యూనియన్ సమాచార, ప్రసార సహాయ మంత్రి మురుగన్ పేర్కొన్నారు. యువ దర్శకులకు అవకాశాలు పెరుగుతున్నాయనీ, ఈ ఏడాది వేవ్స్ బజార్ పరంగా వెయ్యి కోట్ల వ్యాపారం జరగడం భారత సినిమా ప్రభావం పెరుగుతున్న సంకేతమని చెప్పారు. మహిళా దర్శకుల చిత్రాలు 50 స్క్రీనింగ్స్ దక్కించుకోవడం కూడా ఈ ఏడాది ప్రత్యేకతగా నిలిచిందని తెలిపారు.

Income Tax: విదేశీ ఆస్తులు వెల్లడించని 25 వేల మందిపై ఐటీ శాఖ దృష్టి.. మీరు కూడా ఈ జాబితాలో ఉన్నారా?

కర్ణాటకకు చెందిన సంప్రదాయ కళారూపం యక్షగాన ప్రదర్శన వేడుకలో ప్రేక్షకులను అలరించింది. నటుడు రిషభ్ శెట్టి, తన నటనా ప్రయాణం యక్షగానంతోనే ప్రారంభమైందని గుర్తుచేసుకుంటూ, కాంతారాలాంటి పాతికైన కథలకు యక్షగానమే ప్రేరణ అని చెప్పడం గమనార్హం.

విశాఖ గూగుల్ డేటా సెంటర్‌కు ఆ భూములు కేటాయింపు.. ఆ ప్రాంతానికి మహర్దశ! 256 ఎకరాలు...

రణ్వీర్ సింగ్ ఈ వేదికపై తన కొత్త సినిమా ధురంధర్ (Dhurandhar) నుంచి పాటను విడుదల చేస్తూ, భారత సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపించే దశలో ఉందని పేర్కొన్నారు. కాంతారా 2లో రిషభ్ శెట్టి నటనను ప్రశంసిస్తూ, భవిష్యత్తులో ప్రయోగాత్మక కథలతో సినిమా మరింత ముందుకు వెళుతుందని అభిప్రాయపడ్డారు.

India Russia Relations: పుతిన్ భారత్ పర్యటనకు ముందు రష్యా కీలక రక్షణ ఒప్పందం ఆమోదానికి సిద్ధం!!

అంతర్జాతీయ జాతీయ సినిమాల సంగమంగా నిలిచిన ఈ ఏడాది IFFI—సాంకేతికత, సృజనాత్మకత, కథ చెబుతున్న కొత్త తరాన్ని ప్రోత్సహించే వేదికగా మరింత బలపడింది. 56వ IFFI మరపురాని వేడుకగా ముగియగా తదుపరి సంవత్సరం పట్ల సినీ ప్రపంచం మరింత ఆశతో ఎదురుచూస్తోంది.

Quantum Training: క్వాంటమ్‌ టెక్నాలజీపై శిక్షణ... రూ.500 మాత్రమే! అర్హతలు, దరఖాస్తు వివరాలు!
Flights: సౌర రేడియేషన్ ప్రభావం…! దేశవ్యాప్తంగా 250 విమానాల రద్దు..!
Praja Vedika: నేడు (29/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Ditwah Cyclone: దూసుకొస్తున్న దిత్వా తుపాను! నేడు ఆ జిల్లాల్లో ఎడతెరపలేని వానలు!
AP Government: ఆ కులం పేరు మార్చేసిన ఏపీ ప్రభుత్వం! కొత్త పేరు ఏమిటంటే!
రైతుల సహకారం కోరిన ఏపీ ప్రభుత్వం.. ఉద్యోగావకాశాలు, అభివృద్ధి! కొత్తగా 20 వేల ఎకరాల సమీకరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్!
ఆకాశాన్నంటిన భూముల ధర.. నియోపొలిస్‌ ఈ-వేలంలో రికార్డు బద్దలు – ఎకరం రూ. 150 కోట్లకు పైగా!

Spotlight

Read More →