Weekly Trains: హైదరాబాద్ - జైపూర్ మధ్య కొత్త రైలు సర్వీస్ షురూ.. రూట్ మ్యాప్, టైమింగ్స్ ఇవే! Health Ministry: ప్రాణాంతక ఎబోలా వైరస్ కలకలం - ఆ మూడు దేశాలకు వెళ్లకండి.. భారత పౌరులకు కేంద్రం హెచ్చరిక Everest: ఎవరెస్టు నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు పర్వతారోహకుల మృతి Intercity Express: దశాబ్దాల కల... రెండు గంటల్లో విజయవాడ! హైదరాబాద్ జస్ట్ 2.30 గంటలే... హౌల్ట్ స్టేషన్లు ఇవే! Air India flight: ఎయిరిండియా విమానంలో 179 మంది.. త్రుటిలో తప్పిన ప్రమాదం! గాలి అలల ఉద్ధృతికి... Indian Railways: నేపాల్ సందర్శించాలనుకుంటున్నారా.... ఐఆర్‌సిటిసి సూపర్ ప్యాకేజీ ఆఫర్ మీకోసమే!! Kashi Yatra: కాశీ వెళ్లే తెలుగు భక్తులకు శుభవార్త.. తక్కువ ధరకే వసతి, ఉచిత భోజనం! Visa Free Travel: పర్యాటకులకు బంపర్ ఆఫర్... వీసా లేకుండానే 56 దేశాలకు వెళ్లే ఛాన్స్! Ladakh: హిమాలయ ఎడారిని ఆర్ట్ గ్యాలరీగా మార్చనున్న లడాఖ్ బియన్నేలే! India Tourism: ఆ రెండు మినహా.. నిజమైన ఇండియా నన్ను కట్టిపడేసింది! సింగపూర్ మహిళా పర్యాటకురాలి ప్రశంసలు! Weekly Trains: హైదరాబాద్ - జైపూర్ మధ్య కొత్త రైలు సర్వీస్ షురూ.. రూట్ మ్యాప్, టైమింగ్స్ ఇవే! Health Ministry: ప్రాణాంతక ఎబోలా వైరస్ కలకలం - ఆ మూడు దేశాలకు వెళ్లకండి.. భారత పౌరులకు కేంద్రం హెచ్చరిక Everest: ఎవరెస్టు నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు పర్వతారోహకుల మృతి Intercity Express: దశాబ్దాల కల... రెండు గంటల్లో విజయవాడ! హైదరాబాద్ జస్ట్ 2.30 గంటలే... హౌల్ట్ స్టేషన్లు ఇవే! Air India flight: ఎయిరిండియా విమానంలో 179 మంది.. త్రుటిలో తప్పిన ప్రమాదం! గాలి అలల ఉద్ధృతికి... Indian Railways: నేపాల్ సందర్శించాలనుకుంటున్నారా.... ఐఆర్‌సిటిసి సూపర్ ప్యాకేజీ ఆఫర్ మీకోసమే!! Kashi Yatra: కాశీ వెళ్లే తెలుగు భక్తులకు శుభవార్త.. తక్కువ ధరకే వసతి, ఉచిత భోజనం! Visa Free Travel: పర్యాటకులకు బంపర్ ఆఫర్... వీసా లేకుండానే 56 దేశాలకు వెళ్లే ఛాన్స్! Ladakh: హిమాలయ ఎడారిని ఆర్ట్ గ్యాలరీగా మార్చనున్న లడాఖ్ బియన్నేలే! India Tourism: ఆ రెండు మినహా.. నిజమైన ఇండియా నన్ను కట్టిపడేసింది! సింగపూర్ మహిళా పర్యాటకురాలి ప్రశంసలు!

Flights: సౌర రేడియేషన్ ప్రభావం…! దేశవ్యాప్తంగా 250 విమానాల రద్దు..!

 దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థలు ఇండిగో, ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు భారీ అంతరాయం తలెత్తనుంది. ఈ మూడు సంస్థలు విస్తృతంగా వినియోగిస్తున్న ఎయిర్‌

Published : 2025-11-29 08:56:00
Praja Vedika: నేడు (29/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థలు ఇండిగో, ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు భారీ అంతరాయం తలెత్తనుంది. ఈ మూడు సంస్థలు విస్తృతంగా వినియోగిస్తున్న ఎయిర్‌బస్ A320 ఫ్యామిలీ విమానాల్లో ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్‌కు సంబంధించిన కీలక సమస్యను ఎయిర్‌బస్ గుర్తించింది. తీవ్రమైన సౌర రేడియేషన్‌ కారణంగా ఈ విమానాల్లోని ఫ్లైట్ కంట్రోల్ డేటా దెబ్బతినే అవకాశం ఉందని వెల్లడించిన ఎయిర్‌బస్, ఈ సమస్యను తక్షణం పరిష్కరించాలని సూచించింది. ఈ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా దాదాపు 200 నుండి 250 విమానాలను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

Ditwah Cyclone: దూసుకొస్తున్న దిత్వా తుపాను! నేడు ఆ జిల్లాల్లో ఎడతెరపలేని వానలు!

ప్రస్తుతం భారత్‌లో సుమారు 560 ఎయిర్‌బస్ A320 ఫ్యామిలీ విమానాలు సేవలలో ఉన్నాయి. వీటిలో దాదాపు 250 విమానాలు ఈ సాంకేతిక లోపంతో ప్రభావితమయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్‌లో భాగమైన ఎలివేటర్–ఐలరాన్ కంప్యూటర్‌పై అధిక రేడియేషన్ ప్రభావం పడితే, విమానం నియంత్రణ డేటా డిస్టర్బ్ అయ్యే ప్రమాదం ఉంటుందని ఎయిర్‌బస్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (EASA) అత్యవసర ఆదేశాలు జారీ చేస్తూ, సమస్య ఉన్న కంప్యూటర్ మాడ్యూల్‌ను వెంటనే మార్చాలని, లేకపోతే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ తప్పనిసరని పేర్కొంది. ముఖ్యంగా, ప్రతి విమానం తదుపరి ఫ్లైట్‌కు బయల్దేరే ముందు ఈ ప్రక్రియ పూర్తిచేయాలని స్పష్టం చేసింది.

AP Government: ఆ కులం పేరు మార్చేసిన ఏపీ ప్రభుత్వం! కొత్త పేరు ఏమిటంటే!

ఈ సూచనలతో జాతీయ, ప్రైవేట్ విమానయాన సంస్థలు అత్యవసర చర్యలు ప్రారంభించాయి. ఇండిగో ఇప్పటికే తన ఫ్లీట్‌లోని ప్రతి విమానాన్ని సాంకేతికంగా పరీక్షిస్తూ, ఎయిర్‌బస్ సూచించిన సేఫ్టీ మార్పులను అమలుచేస్తోంది. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కూడా ఇండిగో తెలిపింది. ఇదే సందర్భంలో ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ కూడా తమ విమానాల్లో అవసరమైన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్లను చేపడుతున్నట్టు ధృవీకరించాయి. ముఖ్యంగా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 31 విమానాలు ఈ సమస్య వల్ల నేరుగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని సంస్థ వెల్లడించింది.

రైతుల సహకారం కోరిన ఏపీ ప్రభుత్వం.. ఉద్యోగావకాశాలు, అభివృద్ధి! కొత్తగా 20 వేల ఎకరాల సమీకరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఈ పరిణామాలన్నింటి మధ్య ప్రయాణికుల భద్రతే తమ ప్రాధాన్యమని ఎయిర్‌బస్ స్పష్టంచేసింది. ఈ సాంకేతిక లోపం తాత్కాలిక సమస్య మాత్రమేనని, కానీ దానిని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం పెరుగుతుందని సంస్థ హెచ్చరించింది. విమానాల సేవల్లో అంతరాయం తప్పదన్నప్పటికీ, అవసరమైన రిపేర్లు పూర్తయిన వెంటనే మళ్లీ విమానాలు సాధారణ షెడ్యూల్‌కి తిరిగివస్తాయని పేర్కొంది. విమాన సంస్థలు కూడా ఇదే భావన వ్యక్తం చేస్తూ, ప్రయాణికులకు ముందస్తుగా సమాచారం అందిస్తామని తెలిపాయి. మొత్తం పరిస్థితిని పరిశీలిస్తే, రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా విమాన సర్వీసుల్లో ఆలస్యం, రద్దులు పెరగటానికి అవకాశముంది.

ఆకాశాన్నంటిన భూముల ధర.. నియోపొలిస్‌ ఈ-వేలంలో రికార్డు బద్దలు – ఎకరం రూ. 150 కోట్లకు పైగా!
తీవ్ర రూపం దాల్చిన దిత్వా తుపాను.. ఏపీలో అత్యంత భారీ వర్షాలు! గంటకు 90 కిలోమీటర్ల వేగంతో..
International airport: అమరావతికి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ తప్పనిసరి.. మంత్రి నారాయణ!
RBI కొత్త రూల్స్... హోమ్ లోన్ తీసుకున్నాక ఎప్పుడైనా వడ్డీ తగ్గించుకోవచ్చు! ఎలాగనుకుంటున్నారా...
AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. రాజధాని కోసం మరో 16,675 ఎకరాల భూ సేకరణ!
Aadhaar Update: ఇంటి వద్దనే మొబైల్ నెంబర్ అప్‌డేట్ సౌకర్యం..! UIDAI సంచలన నిర్ణయం!

Spotlight

Read More →