NRI TTD Updates: NRI లకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్... ప్రత్యేక దర్శనాల గడువు పెంపు! TTD: నిన్న ఒక్కరోజే 75 వేల మందికి పైగా దర్శనం... శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 31 కంపార్టుమెంట్లలో వేచిఉన్న భక్తులు! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనం కోసం 15 గంటల నిరీక్షణ! Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 83 వేల మందికి పైగా స్వామివారి దర్శనం! Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలు 2027కు భారీ ఏర్పాట్లు ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం! Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. దర్శనానికి తగ్గిన నిరీక్షణ సమయం! TTD లో ఈ విధంగా విరాళమిస్తే.. ఐదుగురికి వీఐపీ బ్రేక్‌ దర్శనం!! Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి ఇంకా 12 గంటల సమయం! NRI TTD Updates: NRI లకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్... ప్రత్యేక దర్శనాల గడువు పెంపు! TTD: నిన్న ఒక్కరోజే 75 వేల మందికి పైగా దర్శనం... శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 31 కంపార్టుమెంట్లలో వేచిఉన్న భక్తులు! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనం కోసం 15 గంటల నిరీక్షణ! Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 83 వేల మందికి పైగా స్వామివారి దర్శనం! Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలు 2027కు భారీ ఏర్పాట్లు ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం! Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. దర్శనానికి తగ్గిన నిరీక్షణ సమయం! TTD లో ఈ విధంగా విరాళమిస్తే.. ఐదుగురికి వీఐపీ బ్రేక్‌ దర్శనం!! Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి ఇంకా 12 గంటల సమయం!

బాలరాముడి దర్శనంతో పులకించిన భారతావని... అంగరంగ వేడుకగా జరిగిన ప్రతిష్ట విశేషాలు మీ కోసం ...

అంబరాన్ని అంటిన అయోధ్య సంబరం... బాలరాముడి దర్శనంతో భారతావని పులకించిపోయింది...  హెలికాప్టర్లతో పూలవర్షం...  అంతులేని ఆనందంగా ఉంది అంటూ ఉద్వేగానికి

Published : 2024-01-22 14:16:00

అంబరాన్ని అంటిన అయోధ్య సంబరం...

బాలరాముడి దర్శనంతో భారతావని పులకించిపోయింది... 

హెలికాప్టర్లతో పూలవర్షం... 

అంతులేని ఆనందంగా ఉంది అంటూ ఉద్వేగానికి లోనైన మోడీ...

రామనామ స్మరణతో మార్మోగిన అయోధ్య...

అయోధ్య: అయోధ్య లో వందల ఏళ్ల నాటి కలను సాకారం చేస్తూ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. రామాలయ ప్రారంభోత్సవం అంబరాన్నంటింది. నవనిర్మిత రామ మందిరంలో నీలమేఘశ్యాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని మోదీ  చేతుల మీదుగా జరిగిన ఆ మహోన్నత ఘట్టాన్ని వీక్షించి భక్తజనం తన్మయత్వం చెందారు.

మధ్యాహ్నం 12 గంటలకు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రాణప్రతిష్ఠ క్రతువు ప్రారంభమైంది. ప్రధాని మోదీ స్వామివారికి పట్టువస్త్రాలు, వెండి ఛత్రం సమర్పించారు. రామ్లల్లా విగ్రహం వద్ద పూజలు చేశారు. 12.29 నిమిషాలకు అభిజిత్ లగ్నంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరిగింది.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

స్వామివారికి ప్రధాని మొదటి హారతి సమర్పించారు. అయోధ్య బాలరాముడి దర్శనంతో భారతావని పులకించిపోయింది. ఎడమచేతిలో విల్లు, కుడిచేతి బాణంతో స్వర్ణాభరణాలు ధరించి చిరు దరహాసం, ప్రసన్నవదనంతో బాలరాముడు దర్శనమిచ్చారు.

అయోధ్యలో బాలరాముడికి తొలిహారతి ఇచ్చి బాలరాముడికి సాష్టాంగ నమస్కారం చేసిన ప్రధాని మోదీ...

ప్రాణప్రతిష్ఠ సమయంలో గగనవీధుల నుంచి ఆలయంపై హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించారు. ఈ క్రతువుల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్, యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ప్రాణప్రతిష్ఠకు ముందు పుజాసామాగ్రి ఆలయంలోకి ప్రవేశిస్తోన్న వీడియోను మోదీ షేర్ చేశారు. 'ఈ దివ్యవేడుకలో భాగమైనందుకు నాకు అంతులేని ఆనందంగా ఉంది' అని ఉద్వేగానికి గురయ్యారు.

అయోధ్య నగరం మొత్తం రామనామ స్మరణతో మార్మోగింది. నగరమంతా రామ్ లీల, భగవద్గీత కథలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి

 స్వర్ణాభరణాలతో భక్తులకు దర్శనమిచ్చిన బాలరాముడు. టీవీల్లో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ చూసి పులకించిన భక్తకోటి

 ఎడమ చేతిలో విల్లు, కుడి చేతిలో బాణం, చిరు దరహాసం, ప్రసన్న వదనంతో బాలరాముడి దర్శన భాగ్యం

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →