MSVP bookings: డిజిటల్ మాఫియాపై వార్.. సినిమా రివ్యూ ఆప్షన్‌కు బ్రేక్.. MSVP బుకింగ్స్ స్టార్ట్.. ధరల వివాదం హాట్ టాపిక్! ఓటీటీలోకి మోహన్‌లాల్ సూపర్ హిట్ మలయాళం యాక్షన్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.! ఎప్పుడు? ఎక్కడ? Ticket rates: ఐబొమ్మ రవి అరెస్టు.. టికెట్ రేట్ల పెంపు.. నారాయణ సంచలన వ్యాఖ్యలు! Tollywood: సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.... టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ! ఫస్ట్ లుక్... Rajasaab: బాక్సాఫీస్ హీట్.. టికెట్ రేట్ల వివాదం.. రాజాసాబ్ చుట్టూ చర్చ! విజయ్ సినిమాకు భారీ షాక్... తీవ్ర నిరాశలో అభిమానులు! ఈ నెల 21వ తేదీకి.. Rajasaabs: రాజాసాబ్ రిలీజ్ వేళ థియేటర్లో మంటలు.. హాల్ యాజమాన్యం అలర్ట్! Sankranthi race: సంక్రాంతి రేసులో మరో సినిమా ఔట్.. పరాశక్తి కి థియేటర్ల కొరత! 'ది రాజా సాబ్' మూవీ రివ్యూ! అభిమానుల స్పందన ఎలా ఉంది? Dhurandhar: బాక్సాఫీస్ వద్ద ధురంధర్ ప్రభంజనం.. ₹1,222 కోట్లతో కొత్త చరిత్ర! MSVP bookings: డిజిటల్ మాఫియాపై వార్.. సినిమా రివ్యూ ఆప్షన్‌కు బ్రేక్.. MSVP బుకింగ్స్ స్టార్ట్.. ధరల వివాదం హాట్ టాపిక్! ఓటీటీలోకి మోహన్‌లాల్ సూపర్ హిట్ మలయాళం యాక్షన్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.! ఎప్పుడు? ఎక్కడ? Ticket rates: ఐబొమ్మ రవి అరెస్టు.. టికెట్ రేట్ల పెంపు.. నారాయణ సంచలన వ్యాఖ్యలు! Tollywood: సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.... టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ! ఫస్ట్ లుక్... Rajasaab: బాక్సాఫీస్ హీట్.. టికెట్ రేట్ల వివాదం.. రాజాసాబ్ చుట్టూ చర్చ! విజయ్ సినిమాకు భారీ షాక్... తీవ్ర నిరాశలో అభిమానులు! ఈ నెల 21వ తేదీకి.. Rajasaabs: రాజాసాబ్ రిలీజ్ వేళ థియేటర్లో మంటలు.. హాల్ యాజమాన్యం అలర్ట్! Sankranthi race: సంక్రాంతి రేసులో మరో సినిమా ఔట్.. పరాశక్తి కి థియేటర్ల కొరత! 'ది రాజా సాబ్' మూవీ రివ్యూ! అభిమానుల స్పందన ఎలా ఉంది? Dhurandhar: బాక్సాఫీస్ వద్ద ధురంధర్ ప్రభంజనం.. ₹1,222 కోట్లతో కొత్త చరిత్ర!

Anasuya : క్షమాపణలు చెప్పి.. గట్టిగా మాట్లాడిన అనసూయ... సోషల్ మీడియాలో హాట్ టాపిక్!

2026-01-07 10:01:00
AP Tourism: ఏపీ టూరిజానికి కొత్త ఊపిరి.. ఆ ప్రాంతానికి మహర్దశ! సీఎం మాస్టర్ ప్లాన్!

నటి అనసూయ (anasuya) భరద్వాజ్ మరోసారి తన సోషల్ మీడియా పోస్టులతో విస్తృత చర్చకు దారి తీస్తున్నారు. ఇటీవల హీరోయిన్ రాశీకి సంబంధించిన వివాదంలో తన తప్పును అంగీకరిస్తూ క్షమాపణలు చెప్పిన అనసూయ, ఆ వెంటనే ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ ఆసక్తికర పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. “హీరోయిన్ అనేది తెరపై కనిపించే పాత్ర మాత్రమే కాదు. సత్యం మాట్లాడే ధైర్యం, సొంత దారిలో నడిచే శక్తి, సరైనదానికి నిలబడే గుండె – ఇవే నిజమైన హీరోయిన్ లక్షణాలు. మిగతావాళ్లు కేవలం నటులే” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు నెటిజన్లలో కొత్త చర్చకు తెరలేపాయి. ఈ మాటలతో అనసూయ ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో అనే ప్రశ్న సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

Joint Pains: పెయిన్ కిల్లర్లకు గుడ్‌బై.. కీళ్ల నొప్పులకు సహజ పరిష్కారం!

ఈ వ్యవహారం మొత్తం ఇటీవల మొదలైన మహిళల వస్త్రధారణపై జరిగిన వివాదంతో ముడిపడి ఉంది. నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. వాటిపై స్పందిస్తూ హీరోయిన్ రాశీ ఓ వీడియో విడుదల చేశారు. గతంలో ఓ టీవీ కార్యక్రమంలో అనసూయ తనను కించపరిచేలా మాట్లాడారంటూ రాశీ ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలు తనను ఎంతగా బాధించాయో, అప్పట్లో తాను ఎంత ఒంటరిగా ఫీలయ్యానో రాశీ చెప్పుకొచ్చారు. ఈ వీడియో వెలువడిన తర్వాత అనసూయపై సోషల్ మీడియాలో విమర్శల వెల్లువెత్తింది.

Europe Relations: 2026లో కొత్త ఎత్తులకు భారత్.. లక్సెంబర్గ్ వేదికగా జైశంకర్ కీలక ప్రకటన!!

ఈ క్రమంలోనే అనసూయ స్పందిస్తూ ఒక నోట్ విడుదల చేశారు. అప్పటి పరిస్థితుల్లో తాను సరైన విధంగా స్పందించలేకపోయానని, రాశీని నిలదీయాల్సిన ధైర్యం తనకు అప్పుడు లేదని ఆమె అంగీకరించారు. కాలక్రమంలో తనలో మార్పు వచ్చిందని, ఇప్పుడు మహిళల భద్రత, గౌరవం వంటి అంశాలపై గట్టిగా మాట్లాడుతున్నానని అనసూయ పేర్కొన్నారు. తన గత మాటలు ఇప్పుడు తనకే బాధ కలిగిస్తున్నాయని, వాటిని ఆధారంగా చేసుకుని తనపై ద్వేషపూరిత ప్రచారం జరుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. “వెనక్కి వెళ్లి ఆ రోజు జరిగినదాన్ని సరిదిద్దలేను. కానీ నా తప్పును అంగీకరిస్తూ బాధ్యతగా క్షమాపణ చెబుతున్నాను” అంటూ అనసూయ స్పష్టంగా చెప్పడం గమనార్హం.

Polavaram: నేడు పోలవరం ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు! అధికారులతో సమీక్ష!

ఈ క్షమాపణల అనంతరం ఆమె చేసిన తాజా పోస్ట్‌కు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. నిజమైన హీరోయిన్ అంటే ఎవరు? గ్లామర్, ఫేమ్ కంటే విలువలు, ధైర్యం, నిజాయితీ ముఖ్యమా? అనే అంశాలపై ఆమె మాటలు పరోక్షంగా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో శివాజీ వ్యాఖ్యలకు గట్టిగా కౌంటర్ ఇచ్చిన అనసూయ, ఇప్పుడు ఈ పోస్ట్ ద్వారా మరోసారి తన అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేసిందని అభిమానులు అంటున్నారు.

TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో ఆ టికెట్ల జారీలో భారీ మార్పులు!

సోషల్ మీడియాలో అనసూయకు మద్దతుగా “నిజమైన హీరోయిన్ నిర్వచనం ఇదే”, “తప్పును అంగీకరించడం గొప్ప విషయం” అంటూ కామెంట్లు వస్తున్నాయి. మరోవైపు కొందరు మాత్రం ఈ పోస్ట్ కూడా ఇన్‌డైరెక్ట్‌గా వివాదాలకు దారి తీస్తోందని విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా, అనసూయ చేసిన ఈ పోస్ట్ ఆమె వ్యక్తిత్వాన్ని, ఆమె తీసుకున్న మార్పు మార్గాన్ని ప్రతిబింబిస్తోందని చెప్పొచ్చు. తెరపై పాత్రలకే కాకుండా నిజ జీవితంలో కూడా ధైర్యంగా నిలబడే మహిళలే నిజమైన హీరోయిన్లు అన్న సందేశాన్ని ఆమె ఈ సందర్భంగా బలంగా వినిపించినట్టుగా కనిపిస్తోంది.

Bus fire: ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ధగ్ధం..! పరుగులు పెట్టిన ప్రయాణికులు…!
Telugu Movies: మాజీ ప్రపంచ సుందరితో మెగాస్టార్.. ‘మెగా 158’పై ఇండస్ట్రీలో హాట్ టాక్!
Amaravati ORR: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కీలక అప్డేట్! ఆ జిల్లాలో భూసేకరణకు నోటిఫికేషన్!
Ap Farmers: ఏపీ రైతులకు శుభవార్త..ఇక నో టెన్షన్! ఉచితంగానే... సీఎం కీలక ఆదేశాలు జారీ!
Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణాలు.. 24 గంటల్లో ఇద్దరు హిందువుల హత్య!
Oman WorkVisa: ఓమన్‌లో ఉద్యోగం కావాలంటే ఈ వర్క్ వీసా ప్రాసెస్ తప్పనిసరి!
Train: ఏళ్ల ఎదురుచూపులకు ముగింపు…! జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ఇక నుంచి ఆ స్టేషన్ లోనూ ఆగుతుంది!
Pakistan: పాక్‌కు మరో భారీ షాక్…! దేశం విడిచిన టెలినార్!

Spotlight

Read More →