Rapido Vs Uber: చంద్రబాబు విజన్ స్ఫూర్తితో... ఉబర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ర్యాపిడో!
Rapido Vs Uber: పదిహేను లక్షల కోట్ల విలువైన గ్లోబల్ రైడ్-హెయిలింగ్ దిగ్గజం ఉబర్ పెట్టిన విలీన ప్రతిపాదనను తిరస్కరించిన ర్యాపిడో, భారత్‌లోని ఉబర్ వ్యాపారాన్ని పూర్తిగా తమకే విక్రయించాలని రివర్స్ కౌంటర్ ఇచ్చింది. తెలుగు యువకుడు పవన్ గుంటుపల్లి సారథ్యంలోని ర్యాపిడో, జీరో-కమిషన్ సబ్‌స్క్రిప్షన్ మోడల్‌తో దేశవ్యాప్తంగా 60 శాతానికి పైగా మార్కెట్ వాటాను సాధించి భారతీయ స్టార్టప్ శక్తిని ప్రపంచానికి చాటిచెప్పింది.
డ్రైవర్లకు 30% కమిషన్ భారం లేని సబ్‌స్క్రిప్షన్ మోడల్: 400 నగరాల్లో ర్యాపిడో జైత్రయాత్ర!
స్వదేశీ ఆత్మగౌరవానికి దక్కిన విజయం: గ్లోబల్ టెక్ పటంలో మెరిసిన భారతీయ సత్తా!
- క్యాబ్, ఆటో రంగాల్లో ముదురుతున్న ప్రైస్ వార్: దిగ్గజాల మధ్య హోరాహోరీ పోరు.
India: అక్షరాల పదిహేను లక్షల కోట్ల రూపాయల విలువైన అంతర్జాతీయ రవాణా దిగ్గజం ఉబర్ సీఈవో దారా ఖోస్రోషాహి భారత్‌లో పర్యటించిన సమయంలో ర్యాపిడోను విలీనం (Merger) చేసుకునేందుకు ప్రతిపాదన తెచ్చారు. భారత మార్కెట్లో ఉబర్ కార్యకలాపాలు, ర్యాపిడోను ఏకం చేసి ఆ ఉమ్మడి సంస్థను ర్యాపిడో బృందమే నడిపించేలా ఆఫర్ ఇచ్చారు. అయితే ఈ ఆఫర్‌ను తిరస్కరించిన ర్యాపిడో.. "మమ్మల్ని కొనడం కాదు, భారత్‌లోని మీ ఉబర్ వ్యాపారాన్ని పూర్తిగా మాకే అమ్మేయండి" అంటూ ఉబర్ కేవలం మైనారిటీ వాటాదారుగా మాత్రమే ఉండేలా షాకింగ్ రివర్స్ కౌంటర్ ఆఫర్ ఇచ్చింది.
మార్కెట్ ఆధిపత్యం – జీరో కమిషన్ సబ్‌స్క్రిప్షన్ మోడల్
ఉబర్, ఓలా వంటి దిగ్గజాలు డ్రైవర్ల నుంచి దాదాపు ముప్పై శాతం వరకు భారీ కమిషన్ వసూలు చేసే విధానానికి భిన్నంగా, ర్యాపిడో విప్లవాత్మకమైన డైలీ సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ను అమలు చేసింది. డ్రైవర్లకు పూర్తి సంపాదన దక్కేలా చేసిన ఈ విధానంతో దేశవ్యాప్తంగా నాలుగు వందలకు పైగా నగరాల్లో బైక్ టాక్సీ మార్కెట్‌లో అరవై శాతానికి పైగా తిరుగులేని వాటాను ర్యాపిడో సొంతం చేసుకుంది. దాదాపు ముప్పై లక్షలకు పైగా యాక్టివ్ కెప్టెన్లు (డ్రైవర్లు) మరియు ఆటో, క్యాబ్ విభాగాల్లోనూ వేగంగా విస్తరిస్తూ అగ్రగామిగా నిలిచింది.
తెలుగువాడి పట్టుదల – చంద్రబాబు స్ఫూర్తితో ప్రస్థానం
ఈ అసాధారణ విజయం వెనుక తెలుగు యువకుడు, ర్యాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి పట్టుదల ఉంది. తన తండ్రి ద్వారా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆలోచనా విధానం, తెలుగువారిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే విజన్ తనకు స్ఫూర్తినిచ్చిందని పవన్ తెలిపారు. ఆ లక్ష్యంతోనే అరవింద్ సంక, షేక్ రిషబ్‌లతో కలిసి 2015లో ప్రారంభించిన ఈ స్టార్టప్, నేడు ప్రపంచ టెక్ దిగ్గజాలకే సవాలు విసిరే స్థాయికి ఎదిగింది.
ఐపీవో లక్ష్యం – స్వదేశీ ఆత్మగౌరవం
రానున్న కాలంలో పబ్లిక్ ఇష్యూ (IPO) దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో, తమ సంస్థపై ఉన్న యాజమాన్య హక్కులను ఏ విదేశీ శక్తికి వదులుకోవడానికి ర్యాపిడో అంగీకరించలేదు. విదేశీ సంస్థలు స్వదేశీ స్టార్టప్‌లను కొనుగోలు చేసే పాత రోజులకు ముగింపు పలికి, భారతీయ సంస్థలే గ్లోబల్ మార్కెట్లను శాసించే కొత్త శకానికి నాంది పలికింది. మూడో అతిపెద్ద మార్కెట్ అయిన భారత్‌ను వదులుకోవడం ఇష్టం లేక ఉబర్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
గ్లోబల్ మార్కెట్లో భారతీయ కంపెనీల ప్రభంజనం
గతంలో టాటా గ్రూప్ బ్రిటన్‌లో జాగ్వార్ ల్యాండ్ రోవర్, టెట్లీ టీని కొనుగోలు చేయడం, ఎయిర్‌టెల్ ఆఫ్రికాలో టెలికాం దిగ్గజాలను దక్కించుకోవడం, సన్ ఫార్మా అమెరికా, ఇజ్రాయెల్ ఫార్మా సంస్థలను సొంతం చేసుకోవడం లాంటి ఘనతల సరసన నేడు ర్యాపిడో వేసిన ఈ వ్యూహం నిలిచింది. భారతీయ స్టార్టప్‌ల సత్తాను అంతర్జాతీయ వేదికపై చాటిచెప్పిన ఈ పరిణామం స్వదేశీ పారిశ్రామిక రంగానికి సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని అందించింది.
Tags
1 readers have reacted
