మిత్రులారా.. ఈ రోజుల్లో బయట అడుగు పెట్టాలంటే జేబులో పర్సు ఉందో లేదో చూసుకోకపోయినా పర్లేదు కానీ, చేతిలో ఫోన్ ఉందో లేదో మాత్రం ఖచ్చితంగా చూసుకుంటాం. ఎందుకంటే, పొద్దున్న లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు టీ షాపులో బిల్లు దగ్గరి నుంచి, సూపర్ మార్కెట్ సామాన్ల వరకు అన్నీ గూగుల్ పే, ఫోన్‌పే వంటి యుపిఐ (UPI) యాప్స్ ద్వారానే జరిగిపోతున్నాయి.
అయితే, మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే అతి పెద్ద సమస్య ఏమిటంటే.. ఏదైనా పేమెంట్ చేయబోయినప్పుడు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోవడం. అప్పటికప్పుడు ఎవరినైనా అడగాలన్నా, వేరే అకౌంట్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా అదో పెద్ద తలనెప్పి.
కానీ, ఇకపై అటువంటి చింత అక్కర్లేదు.. గూగుల్ పే తన వినియోగదారుల కోసం ‘ఫ్లెక్స్ క్రెడిట్ కార్డ్’ (Flex Credit Card) అనే అద్భుతమైన సేవను అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీగా ఉన్నా సరే, మీరు దర్జాగా షాపింగ్ చేయవచ్చు.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.. యుపిఐ ద్వారా చెల్లింపులు చేసేందుకు ముందుగా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉండడం చాలా ముఖ్యం. అకౌంట్ ఖాళీగా ఉంటే యుపిఐ సర్వీస్ పనిచేయదు. కానీ ఇదంతా నిన్నటి వరకు ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు లేకపోయినా పేమెంట్ చేసే అవకాశం ఉంది.
ఈ సౌలభ్యం ప్రస్తుతానికి గూగుల్ పే లో మాత్రమే ఉంది. భారతీయ యూజర్ల కోసం తాజాగా గూగుల్ స్పెషల్ డిజిటల్ క్రెడిట్ కార్డ్ లాంచ్ చేసింది. బ్యాంక్ అకౌంట్లో డబ్బు లేకుండానే UPI పేమెంట్స్ చేయొచ్చు.
ఇది గూగుల్ పే యాప్ లోపల క్రెడిట్ ఫెసిలిటీలా పని చేస్తుంది. ఆక్సిస్ బ్యాంక్ సపోర్ట్ వచ్చింది. RuPay నెట్వర్క్ మీద రన్ అవుతుంది. దీని అధికారిక పేరు Flex by Google Pay. ఈ క్రెడిట్ కార్డు.. రోజువారీ UPI పేమెంట్స్ విధానాన్ని మార్చేస్తుంది.
అత్యవసర సమయంలో పేమెంట్ చేయాలంటే తక్షణం క్రెడిట్ ఉపయోగించి చెల్లింపులు చేయొచ్చు. ఫ్లెక్స్ బై గూగుల్ పే ఒక డిజిటల్ క్రెడిట్ కార్డ్. గూగుల్ పే యాప్ లో మాత్రమే పని చేస్తుంది. దీని ద్వారా ఫిజికల్ కార్డ్ లేకుండానే యూజర్లకు క్రెడిట్ బెనిఫిట్స్ లభిస్తాయి.
మర్చంట్ (ఏదైనా షాపులో) UPI QR కోడ్ స్కాన్ చేసి క్రెడిట్తో పే చేయొచ్చు. రోజువారీ చిన్న పేమెంట్స్కి చాలా సులువు. స్వైప్ లేదా ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు. గూగుల్ పే యాప్ మాత్రమే చాలు. ప్రతి పేమెంట్పై రివార్డ్ పాయింట్స్ (స్టార్స్) వస్తాయి.
ఒక స్టార్ విలువ ఒక రూపాయి. ఈ స్టార్స్ సేకరించి మళ్లీ రిడీమ్ చేయొచ్చు. పెద్ద పేమెంట్స్ని EMIకి కన్వర్ట్ చేయొచ్చు. ఇందులో సెక్యూరిటీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. సమస్య ఉంటే క్రెడిట్ కార్డ్ బ్లాక్ చేయొచ్చు, PIN నెంబర్ మార్చుకోవచ్చు. స్పెండింగ్ లిమిట్స్ సెట్ చేయొచ్చు. అన్నీ గూగుల్ పే యాప్ లోపలే సెట్టింగ్స్ ఉంటాయి.