రాష్ట్ర పర్యాటకానికి దశ తిరిగే భారీ శుభవార్త! వివిధ ప్రాంతాలలో పర్యాటకానికి కోట్ల రూపాయల పెట్టుబడులతో పెద్ద పీట!

స్వదేశ్ దర్శన్ 2.0, ప్రసాద్ పథకాల కింద మొత్తం రూ. 419.30 కోట్లతో ఏపీలోని ప్రధాన పర్యాటక ప్రదేశాలను ఆధునీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించింది. అరకు కల్చరల్ సెంటర్, అరసవల్లి సన్ సెంటర్, గన్నవరంలో మైస్ సెంటర్, బెలూం గుహల్లో కేవ్ లైటింగ్ వంటి మెగా ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రాన్ని అంతర్జాతీయ పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకుంది.

రాష్ట్ర పర్యాటకానికి దశ తిరిగే భారీ శుభవార్త
రాష్ట్ర పర్యాటకానికి దశ తిరిగే భారీ శుభవార్త
  • అరకు లోయలో భారీ ప్రాజెక్ట్.. శ్రీకాకుళంలో సన్ సెంటర్: తెరపైకి వచ్చిన ఆ మెగా స్కెచ్

  • గన్నవరం ఎయిర్‌పోర్ట్ పక్కనే రూ. 176 కోట్ల వింత.. పర్యాటకులకు దక్కనున్న ఆ సరికొత్త అనుభూతి

  • భూగర్భ గుహల్లో రంగురంగుల వెలుగులు.. సముద్ర తీరాల్లో కోస్ట్ మ్యాజిక్: ప్రభుత్వం వేసిన మాస్టర్ ప్లాన్

Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకృతి అందాలు, చారిత్రక సంపదను ప్రపంచ పటంలో నిలబెట్టేందుకు కూటమి ప్రభుత్వం భారీ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 'స్వదేశ్ దర్శన్ 2.0', 'ప్రసాద్' (PRASHAD) పథకాల కింద సుమారు రూ. 419.30 కోట్లతో పలు ప్రధాన పర్యాటక ప్రాంతాల రూపురేఖలు మార్చాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యాటకులను ఆకర్షించే సరికొత్త ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలను రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) కేంద్రానికి పంపింది.

అరకు, అరసవల్లిలో అనుభవ కేంద్రాలు (Experience Centres)

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలోని కొత్తవలస వద్ద ఐటీడీఏకు చెందిన 19.23 ఎకరాల స్థలంలో రూ. 101.07 కోట్లతో 'అరకు కల్చరల్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్' ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ గిరిజన జీవన విధానం, సాంప్రదాయ వంటకాలు, అరకు కాఫీ, చిరుధాన్యాల ప్రాధాన్యాన్ని పర్యాటకులకు పరిచయం చేస్తారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయ పరిసరాల్లో రూ. 107.94 కోట్లతో 'అరసవల్లి సన్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్' నిర్మించనున్నారు. నాగావళి నది ఒడ్డున ఉన్న చారిత్రక డచ్ హెరిటేజ్ భవనాన్ని పునరుద్ధరించి పర్యాటక సేవల్లోకి తీసుకురానున్నారు.

గన్నవరం మైస్ సెంటర్ – వేదగిరి ఆలయ అభివృద్ధి

విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయానికి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో సుమారు ఐదెకరాల విస్తీర్ణంలో రూ. 176 కోట్లతో అత్యాధునిక 'గన్నవరం మైస్ (MICE - Meetings, Incentives, Conferences, and Exhibitions) సెంటర్' ఏర్పాటు చేయనున్నారు. ఇది అంతర్జాతీయ సదస్సులు, వ్యాపార వేడుకలకు వేదికగా నిలవనుంది. అలాగే నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని 'ప్రసాద్' పథకం కింద రూ. 34.29 కోట్లతో తీర్చిదిద్ది భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు.

మచిలీపట్నం నుంచి బెలూం గుహల దాకా విస్తరణ

స్వదేశ్ దర్శన్ 2.0 కింద మరికొన్ని ఆకర్షణీయమైన ప్రాజెక్టులను ఏపీ సర్కార్ సిద్ధం చేస్తోంది. మచిలీపట్నంలో తీరప్రాంత పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు 'కోస్ట్ ఎక్స్‌పీరియన్స్' ప్రాజెక్ట్, గుంటూరు జిల్లా మంగళగిరి ఆలయ పరిసరాల్లో అత్యాధునిక సదుపాయాలతో పాటు ఎకో పార్క్ అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. నంద్యాల జిల్లాలోని చారిత్రక బెలూం గుహల్లో పర్యాటకులను కట్టిపడేసేలా ఆధునిక కేవ్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

Tags

Be the first to react

Latest