Chandrabose: సినీ గీత రచయిత చంద్రబోస్ కుటుంబంలో తీవ్ర విషాదం.. టిఫిన్ చేస్తూ అక్కడికక్కడే కుప్పకూలి.. Sports News: క్రికెట్ ప్రపంచంలోకి మరో దిగ్గజ పారిశ్రామికవేత్త.. ఐపీఎల్ గ్లామర్‌ను పెంచనున్న మిట్టల్-పూనావాలా జోడీ.! Chandrababu: ఆసక్తికర సన్నివేశం... ఎర్రబెల్లి దయాకర్ రావు భుజం తట్టిన చంద్రబాబు! రాజకీయాలు వేరు.. అనుబంధాలు వేరు! Rama Temple: భారీ పోలీసు బందోబస్తు.. కట్టుదిట్టమైన నిఘా.. ఆకివీడు రామాలయ పునర్నిర్మాణంపై సర్వత్రా ఉత్కంఠ.! Sports: ముంబైపై చెన్నై చారిత్రక విజయం.. ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన సీఎస్‌కే.! Karimnagar Crime: కరీంనగర్‌లో పట్టపగలే కాల్పుల కలకలం.. 30 రౌండ్ల కాల్పులు.. రక్తసిక్తమైన జ్యువెల్లరీ దుకాణం.! Donald Trump: పశ్చిమాసియాలో ముదురుతున్న ఉత్కంఠ.. అమెరికా నిర్ణయంపైనే ఇరాన్ భవిష్యత్తు! TVK Party: తమిళనాడులో ఫలితాలకు ముందే టెన్షన్.. రిసార్ట్ రాజకీయాలకు నటుడు విజయ్ పార్టీ సిద్ధం.! Air India: "పశ్చిమాసియా సెగ.. విమాన ప్రయాణాలకు దెబ్బ": భారత్ నుంచి తగ్గిన అంతర్జాతీయ ప్రయాణాలు.. Bandla Ganesh: బండ్ల గణేశ్ ఇంట్లో పెళ్లి బాజాలు.. జూబ్లీహిల్స్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి! Chandrabose: సినీ గీత రచయిత చంద్రబోస్ కుటుంబంలో తీవ్ర విషాదం.. టిఫిన్ చేస్తూ అక్కడికక్కడే కుప్పకూలి.. Sports News: క్రికెట్ ప్రపంచంలోకి మరో దిగ్గజ పారిశ్రామికవేత్త.. ఐపీఎల్ గ్లామర్‌ను పెంచనున్న మిట్టల్-పూనావాలా జోడీ.! Chandrababu: ఆసక్తికర సన్నివేశం... ఎర్రబెల్లి దయాకర్ రావు భుజం తట్టిన చంద్రబాబు! రాజకీయాలు వేరు.. అనుబంధాలు వేరు! Rama Temple: భారీ పోలీసు బందోబస్తు.. కట్టుదిట్టమైన నిఘా.. ఆకివీడు రామాలయ పునర్నిర్మాణంపై సర్వత్రా ఉత్కంఠ.! Sports: ముంబైపై చెన్నై చారిత్రక విజయం.. ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన సీఎస్‌కే.! Karimnagar Crime: కరీంనగర్‌లో పట్టపగలే కాల్పుల కలకలం.. 30 రౌండ్ల కాల్పులు.. రక్తసిక్తమైన జ్యువెల్లరీ దుకాణం.! Donald Trump: పశ్చిమాసియాలో ముదురుతున్న ఉత్కంఠ.. అమెరికా నిర్ణయంపైనే ఇరాన్ భవిష్యత్తు! TVK Party: తమిళనాడులో ఫలితాలకు ముందే టెన్షన్.. రిసార్ట్ రాజకీయాలకు నటుడు విజయ్ పార్టీ సిద్ధం.! Air India: "పశ్చిమాసియా సెగ.. విమాన ప్రయాణాలకు దెబ్బ": భారత్ నుంచి తగ్గిన అంతర్జాతీయ ప్రయాణాలు.. Bandla Ganesh: బండ్ల గణేశ్ ఇంట్లో పెళ్లి బాజాలు.. జూబ్లీహిల్స్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి!

Mahanadu: నెల్లూరులో తొలిసారి మహానాడు.. త్వరలో పనుల ప్రారంభం.. -మంత్రి ఆనం రామనారాయణరెడ్డి!

Mahanadu: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక వార్షిక సభ ‘మహానాడు’ ఈసారి నెల్లూరులో నిర్వహించేందుకు సన్నాహాలు వేగంగా సాగుతున్నాయని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.

Published : 2026-05-03 17:16:00

స్థల పరిశీలనకు సంబంధించి నివేదికను జాతీయ పార్టీకి పంపాం..

ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థల్లో రెండోదైన గూగుల్ కి శంకుస్థాపన జరిగింది..

అమరావతి: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక వార్షిక సభ ‘మహానాడు’ ఈసారి నెల్లూరులో నిర్వహించేందుకు సన్నాహాలు వేగంగా సాగుతున్నాయని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. మహానాడు నిర్వహణకు సంబంధించి పలుచోట్ల స్థలాలను పరిశీలించామని, వాటిపై సమగ్ర నివేదికను పార్టీ జాతీయ నాయకత్వానికి పంపామని వెల్లడించారు. మరో ఒకట్రెండు రోజుల్లో పనులు ప్రారంభమవుతాయని చెప్పారు.

మహానాడు అనేది 44 ఏళ్ల క్రితం నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించినప్పటి నుంచి నిరంతరం జరుగుతున్న కీలక సమావేశమని ఆయన గుర్తుచేశారు. ఈసారి మహానాడును నెల్లూరులో నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ నిర్ణయించారని తెలిపారు.

మొదట ఈ మహానాడును శ్రీకాకుళంలో నిర్వహించాలనుకున్నప్పటికీ, ఉత్తరాంధ్రలో జరుగుతున్న కీలక అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా ఆ నిర్ణయాన్ని మార్చినట్లు మంత్రి వివరించారు. ముఖ్యంగా భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్రమంత్రులు హాజరుకానుండటం, అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థల్లో ఒకటైన గూగుల్ కు శంకుస్థాపన జరగడం వంటి పరిణామాల కారణంగా షెడ్యూల్ మార్పు అవసరమైందని చెప్పారు.

ఇదే కారణంగా మహానాడును నెల్లూరుకు మార్చామని, అక్కడ తొలిసారి ఈ కార్యక్రమం జరగబోతుందని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. ప్రాంతీయ పార్టీగా ప్రారంభమైన టీడీపీ, నేడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పార్టీగా ఎదిగిందని ఆయన గర్వంగా పేర్కొన్నారు. నెల్లూరులో జరిగే మహానాడు ద్వారా పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపడంతో పాటు రాష్ట్ర అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని నేతలు భావిస్తున్నారు.

Spotlight

Read More →