ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ కామెడీ సినిమా ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం..
తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో..
చెన్నై: యువ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన తాజా చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ థియేటర్లలో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే ఈ ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ కామెడీ సినిమా ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
ఈ సినిమా మే 6 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రానికి ఓటీటీ ద్వారా మరో అవకాశం లభించనుంది.
ఈ చిత్రాన్ని దర్శకుడు విగ్నేష్ శివన్ తెరకెక్కించగా, హీరోయిన్గా కృతీ శెట్టి నటించింది. ప్రదీప్ రంగనాథన్ గత సినిమాలతో సాధించిన రూ.100 కోట్ల విజయ పరంపరను ఈ సినిమా కొనసాగించలేకపోవడం గమనార్హం.
సినిమాలో ఎస్.జే. సూర్య, యోగి బాబు, గౌరీ జి కిషన్, మైస్కిన్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై ఎస్.ఎస్.లలిత్ కుమార్ నిర్మించగా, ప్రముఖ నటి నయనతార భాగస్వామిగా వ్యవహరించారు. సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ అందించారు. థియేటర్లలో ఆశించిన స్పందన రాకపోయినా, ఓటీటీలో ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.