Pumpkin Seeds: రోజుకు గుప్పెడు గింజలు తింటే చాలు... ఆ సమస్యలు దరిచేరవు! Healthy Pregnancy Tips: గర్భిణీ స్త్రీలు ఏం తినాలి? తల్లీబిడ్డల ఆరోగ్యానికి మేలైన ఆహార సూత్రాలివే! Healthy Lifestyle Tips: రాగి సంగటి నుంచి చద్దన్నం వరకు.. ఆరోగ్య ప్రయోజనాలు మీకోసం..! Dehydration: వేసవి తాపం నుండి రక్షణ... మీ డైట్‌లో ఇవి ఉంటే ఎండ దెబ్బకు సమస్యలుండవు! Kidney Stones Prevention: కిడ్నీలో రాళ్లు రాకూడదంటే..మీ డైట్‌లో ఈ డ్రింక్ ఉంటే రాళ్ల సమస్య మర్చిపోవచ్చు! Fatty Liver: చిన్నారుల్లో పెరుగుతున్న ఫ్యాటీ లివర్‌ సమస్య! అసలు కారణం ఇదేనా? Chicken Liver: మహిళలకు చికెన్‌లోని ఈ పార్ట్ ఒక వరం.. చాలా మందికి తెలియని నిజం! Better Sleep: రాత్రి పూట నిద్ర పట్టడం లేదా? మీ డైట్‌లో ఈ ఐదు మార్పులు చేసుకోండి! AIIMS NAT System: మంగళగిరి ఎయిమ్స్‌లో సరికొత్త వైద్య విప్లవం... రూ.1.73 కోట్లతో NAT సిస్టం! Health Tips: ఖాళీ కడుపుతో అరటిపండు... ఆరోగ్యానికి లాభమా? నష్టమా? Pumpkin Seeds: రోజుకు గుప్పెడు గింజలు తింటే చాలు... ఆ సమస్యలు దరిచేరవు! Healthy Pregnancy Tips: గర్భిణీ స్త్రీలు ఏం తినాలి? తల్లీబిడ్డల ఆరోగ్యానికి మేలైన ఆహార సూత్రాలివే! Healthy Lifestyle Tips: రాగి సంగటి నుంచి చద్దన్నం వరకు.. ఆరోగ్య ప్రయోజనాలు మీకోసం..! Dehydration: వేసవి తాపం నుండి రక్షణ... మీ డైట్‌లో ఇవి ఉంటే ఎండ దెబ్బకు సమస్యలుండవు! Kidney Stones Prevention: కిడ్నీలో రాళ్లు రాకూడదంటే..మీ డైట్‌లో ఈ డ్రింక్ ఉంటే రాళ్ల సమస్య మర్చిపోవచ్చు! Fatty Liver: చిన్నారుల్లో పెరుగుతున్న ఫ్యాటీ లివర్‌ సమస్య! అసలు కారణం ఇదేనా? Chicken Liver: మహిళలకు చికెన్‌లోని ఈ పార్ట్ ఒక వరం.. చాలా మందికి తెలియని నిజం! Better Sleep: రాత్రి పూట నిద్ర పట్టడం లేదా? మీ డైట్‌లో ఈ ఐదు మార్పులు చేసుకోండి! AIIMS NAT System: మంగళగిరి ఎయిమ్స్‌లో సరికొత్త వైద్య విప్లవం... రూ.1.73 కోట్లతో NAT సిస్టం! Health Tips: ఖాళీ కడుపుతో అరటిపండు... ఆరోగ్యానికి లాభమా? నష్టమా?

Okra Water Benefits: రోజూ ఉదయాన్నే బెండకాయ నీళ్లు తాగితే ఏమవుతుంది? డయాబెటిస్ నియంత్రణలో దీని పాత్ర ఇదే!

Okra Water Benefits: బెండకాయలో ఉండే పీచు పదార్థం (Fiber) యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తాయి. రాత్రంతా నీటిలో నానబెట్టిన బెండకాయ ముక్కల నుండి వచ్చే జిగురు వంటి పదార్థం, మనం తిన్న ఆహారం నుండి గ్లూకోజ్ రక్తంలోకి నెమ్మదిగా చేరేలా చేస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగదు.

Published : 2026-04-11 10:45:00

Okra Water Benefits: డయాబెటిస్  ఇప్పుడు దాదాపు ప్రతి ఇంట్లోనూ ఒక ప్రధాన సమస్యగా మారింది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి రకరకాల మందులు వాడుతుంటారు. అయితే, మన వంటింట్లో దొరికే కూరగాయలతోనే ఈ సమస్యకు కొంత ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ‘బెండకాయ నీళ్లు’  తాగడం వల్ల చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయని ఇటీవల సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. అసలు ఈ బెండకాయ నీళ్లలో ఏముంది? ఇది నిజంగానే పనిచేస్తుందా? అనే విషయాలను  చూద్దాం.

బెండకాయలో విటమిన్-సి, విటమిన్-కె తో పాటు మెగ్నీషియం, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని నీళ్లలో నానబెట్టినప్పుడు అందులో ఉండే జిగురు లాంటి పదార్థం (Mucilage) నీటిలోకి చేరుతుంది. ఈ జిగురులో కరిగే గుణం ఉన్న పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. మనం ఆహారం తీసుకున్నప్పుడు అది రక్తంలో త్వరగా కలవకుండా ఈ ఫైబర్ అడ్డుకుంటుంది. దీనివల్ల రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా క్రమంగా విడుదలవుతుంది. అందుకే ఇది ప్రీ-డయాబెటిస్ లేదా టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి మేలు చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.

ఈ ప్రత్యేక పానీయాన్ని తయారు చేసుకోవడం చాలా సులభం. రెండు లేదా మూడు తాజా బెండకాయలను తీసుకుని శుభ్రంగా కడిగి, వాటి చివరలను కట్ చేయాలి. ఆ తర్వాత వాటిని మధ్యలోకి చీల్చి ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ బెండకాయలను తీసేసి, ఆ జిగురు నీటిని ఖాళీ కడుపుతో తాగాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుందని, తద్వారా కణాలు గ్లూకోజ్‌ను మెరుగ్గా గ్రహిస్తాయని నిపుణులు వివరిస్తున్నారు. .జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు మలబద్ధకం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. 

అయితే, బెండకాయ నీళ్లు తాగుతున్నాం కదా అని మందులు ఆపేయడం అస్సలు చేయకూడదు. ఇది కేవలం ఒక సహజమైన చికిత్స మాత్రమే కానీ మందులకు ప్రత్యామ్నాయం కాదు. ముఖ్యంగా ‘మెట్‌ఫార్మిన్’ వంటి మందులు వాడేవారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బెండకాయ నీళ్లు ఈ మందుల ప్రభావంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే కిడ్నీలో రాళ్లు ఉన్నవారు కూడా బెండకాయను పరిమితంగా తీసుకోవాలి, ఎందుకంటే ఇందులో ఉండే ‘ఆక్సలేట్లు’ కిడ్నీ సమస్యలను పెంచే ప్రమాదం ఉంది.

ఏదైనా కొత్త ఆహార అలవాటును మొదలుపెట్టే ముందు మీ డాక్టరును సంప్రదించడం ఎంతో ముఖ్యం. ఆహార నియమాలు పాటిస్తూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, వీటిని ఒక అదనపు జాగ్రత్తగా తీసుకుంటేనే మంచి ఫలితాలు ఉంటాయి. అతిగా తాగితే గ్యాస్ లేదా కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు, కాబట్టి మితంగా తీసుకోవడం మంచిది. 

Spotlight

Read More →