ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించి, పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన స్విట్జర్లాండ్ పర్యటన అత్యంత ఉత్సాహంగా ప్రారంభమైంది. జనవరి 19, 2026 న ఆయన జ్యూరిచ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు ప్రవాస తెలుగు వారు అపూర్వ స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జ్యూరిచ్ ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టిన తరుణంలో అక్కడ నిజమైన పండుగ వాతావరణం కనిపించింది.
స్విట్జర్లాండ్ మరియు దాని పొరుగు దేశాల నుంచి వందలాది మంది తెలుగు ప్రవాసాంధ్రులు విమానాశ్రయానికి చేరుకున్నారు. పూలగుచ్ఛాలు, భారత జాతీయ జెండాలు పట్టుకుని తమ ప్రియతమ నాయకుడికి ఆత్మీయ స్వాగతం పలికారు. చంద్రబాబు ఎంతో ఓపిగ్గా వారందరినీ పలకరిస్తూ, వారితో ఫోటోలు దిగారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.
జ్యూరిచ్ నుంచి ముఖ్యమంత్రి నేరుగా దావోస్ చేరుకున్నారు. అక్కడ ప్రారంభమైన వరల్డ్ ఎకనమిక్ ఫోరం (WEF) వార్షిక సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సులో వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు మరియు ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సహజ వనరులు, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు మరియు 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' (EoDB) గురించి చంద్రబాబు వారికి వివరించారు.
ఐటీ, తయారీ రంగం, గ్రీన్ ఎనర్జీ మరియు స్టార్టప్ రంగాల్లో భారీ పెట్టుబడులను రాబట్టడమే లక్ష్యంగా గ్లోబల్ కంపెనీల సీఈవోలతో వరుస భేటీలు నిర్వహించారు. ఈరోజు (జనవరి 20, 2026) జరిగిన తెలుగు డియాస్పోరా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ప్రవాసాంధ్రులు రాష్ట్ర అభివృద్ధిలో ఏ విధంగా భాగస్వాములు కావాలి అనే అంశంపై ఆయన స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ నాలెడ్జ్ హబ్‌గా మార్చడానికి ఎన్నారైల సహకారం ఎంత అవసరమో ఆయన వివరించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తో ఎన్నారైలు దిగిన ఫోటోలను అధికారికంగా విడుదల చేయడం జరిగింది. ఆ ఫోటోలను కింది లింక్ ద్వారా చూడవచ్చు. ఆ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
తెలుగు డయాస్పోరా మీటింగ్ లో దిగిన ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…