తేదీ 21-01-2026 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 21 జనవరి 2026 (బుధవారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1. శ్రీమతి ఎస్. సవిత గారు (గౌరవనీయ మంత్రి)
2. శ్రీ వీరంకి వెంకటగురుమూర్తి గారు (AP గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్)
తేదీ 20-01-2026 (మంగళవారం) న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన “ప్రజా వేదిక” కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ ప్రజా వేదిక కార్యక్రమంలో గౌరవనీయ మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు ముఖ్య అతిథిగా పాల్గొని, పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి మరింత చురుకుగా పనిచేయాలని ఆయన సూచించారు.అలాగే హాజ్ కమిటీ చైర్మన్ శ్రీ షేక్ షైక్ హసన్ బాషా గారు కూడా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ, మైనారిటీ సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొంటూ, పార్టీ చేపడుతున్న కార్యక్రమాలపై వివరించారు.ప్రజా వేదిక కార్యక్రమంలో కార్యకర్తలు తమ సమస్యలను నేతల దృష్టికి తీసుకువచ్చారు. నాయకులు వాటిని శ్రద్ధగా విని, పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమం మొత్తం క్రమబద్ధంగా, ఉత్సాహభరితంగా సాగింది.