Samsung Updates: శాంసంగ్ కీలక నిర్ణయం.. అమెరికాలో భారీగా ఉద్యోగాల కోత, హెడ్‌క్వార్టర్స్ మార్పు! ఒకేసారి 700 మందిపై..

Samsung Updates: ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ అమెరికాలో తన కార్యకలాపాలను పునర్‌వ్యవస్థీకరించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. న్యూజెర్సీలోని తన శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ అమెరికా (ఎస్ఈఏ) ప్రధాన కార్యాలయాన్ని టెక్సాస్‌కు తరలించడంతో పాటు, పెద్ద ఎత్తున ఉద్యోగాల కోతను ప్రకటించింది.

శాంసంగ్ కీలక నిర్ణయం.. అమెరికాలో భారీగా ఉద్యోగాల కోత
శాంసంగ్ కీలక నిర్ణయం.. అమెరికాలో భారీగా ఉద్యోగాల కోత
  • న్యూజెర్సీ నుంచి టెక్సాస్‌కు మారనున్న ప్రధాన కార్యాలయం..

  • ఏఐ చిప్‌ల వ్యాపారం జోరుగా ఉన్నా మొబైల్ విభాగం నష్టాల్లోకి..

Samsung Updates: గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ (Samsung Electronics) అమెరికా మార్కెట్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని పునర్‌వ్యవస్థీకరించే (Restructuring) దిశగా సంచలన నిర్ణయం తీసుకుంది. న్యూజెర్సీ (New Jersey) లో ఉన్న తన 'శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ అమెరికా' (SEA) ప్రధాన కార్యాలయాన్ని టెక్సాస్ (Texas) కు తరలిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ బదిలీ ప్రక్రియతో పాటు సంస్థలో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోతను (Samsung Layoffs) కూడా అమలు చేస్తోంది. ఏఐ సాంకేతికత వేగంగా పుంజుకుంటున్న ప్రస్తుత తరుణంలో కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం వందలాది మంది ఐటీ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపనుంది.

హెడ్‌క్వార్టర్స్ మార్పుతో 700 మందికి పైగా సిబ్బందిపై ప్రభావం!
శాంసంగ్ అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం, ప్రధాన కార్యాలయాన్ని న్యూజెర్సీలోని ఎంగిల్‌వుడ్ క్లిఫ్స్ నుంచి టెక్సాస్‌లోని ప్లానో (Plano, Texas) నగరానికి మార్చే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.

  • ఉద్యోగాల కోత వివరాలు: ఈ తరలింపు కారణంగా తొలి విడతలోనే దాదాపు 739 మంది ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. వీరిలో మెజారిటీ సిబ్బందికి టెక్సాస్ కార్యాలయానికి మారే (Relocate) ఆప్షన్ ఇచ్చినప్పటికీ, అక్కడికి వెళ్లడానికి ఆసక్తి చూపని వందలాది మందిని విధుల నుంచి తొలగించారు.

  • మొబైల్ విభాగానికి షాక్: దీనికి అదనంగా, టెక్సాస్ ప్లానో ఆఫీసులోనే పనిచేస్తున్న మొబైల్ డివిజన్ నుంచి మరో 100 మందికి పైగా ఉద్యోగులపై శాంసంగ్ లేఆఫ్స్ వేటు వేసింది. జూన్ 30 నాటికే ఈ లేఆఫ్స్ గురించిన అంతర్గత సమాచారం ఉద్యోగులకు చేరినట్లు తెలుస్తోంది. గత కొన్ని వారాలుగా 30 మందికి పైగా సీనియర్ సేల్స్, మార్కెటింగ్ హెడ్స్ తాము కంపెనీని వీడుతున్నట్లు ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ సైట్ లింక్డ్‌ఇన్ (LinkedIn) లో పోస్టులు పెట్టడం ఐటీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఏఐ రేస్‌లో నిలబడేందుకే.. సమర్థన ఇచ్చుకున్న శాంసంగ్..
ఈ పెను మార్పులపై శాంసంగ్ యాజమాన్యం స్పందిస్తూ దౌత్యపరమైన వివరణ ఇచ్చింది. కంపెనీ వివిధ విభాగాలను (Teams) ఒకే ప్లాట్‌ఫారమ్ మీదికి తీసుకురావడం ద్వారా పనితీరులో సంస్థాగత సామర్థ్యాన్ని (Organizational Efficiency) పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

వేగంగా దూసుకుపోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI Ecosystem) మార్కెట్లో అగ్రగామిగా నిలవాలంటే టెక్సాస్ హబ్ అత్యంత కీలకమని మేకర్స్ పేర్కొన్నారు. అయితే, ఇది గ్లోబల్ లేఆఫ్స్ కాదని, కేవలం యూఎస్ఏ మార్కెట్ ప్రాధాన్యతలకు అనుగుణంగా చేస్తున్న మార్పు మాత్రమేనని శాంసంగ్ స్పష్టం చేసింది.

లాభాల్లో చిప్స్.. నష్టాల్లో మొబైల్స్: అసలు కారణం ఇదే!
శాంసంగ్ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం వెనుక ఆయా విభాగాల ఆర్థిక పనితీరులో ఉన్న భారీ వ్యత్యాసాలే ప్రధాన కారణమని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

  • సెమీకండక్టర్ బిజినెస్ సక్సెస్: ప్రపంచవ్యాప్తంగా ఏఐ (AI Boom) డిమాండ్ పెరగడంతో శాంసంగ్ సెమీకండక్టర్ (Chip Business) విభాగం భారీ లాభాలతో దూసుకుపోతోంది.

  • మొబైల్స్ పై ఒత్తిడి: మరోవైపు, ప్రీమియం సెగ్మెంట్ లో యాపిల్ (Apple ఐఫోన్స్) నుంచి, మిడ్-రేంజ్ లో చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ల నుంచి తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. దీనివల్ల శాంసంగ్ మొబైల్ డివిజన్ చరిత్రలోనే తొలిసారిగా భారీ నష్టాలను నమోదు చేసే ప్రమాదంలో పడింది.

అంతేకాకుండా, ఏఐ బూమ్ కారణంగా మైక్రోచిప్స్ ధరలు విపరీతంగా పెరగడం టీవీలు, గృహోపకరణాల వంటి కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ (Consumer Electronics) విభాగం లాభాల మార్జిన్లను దెబ్బతీస్తోంది.

టెక్సాస్ వైపు టెక్ దిగ్గజాల చూపు.. 2026 చివరికల్లా పూర్తి..
ప్రస్తుతం టెక్సాస్ రాష్ట్రంలో శాంసంగ్‌కు ఇప్పటికే అధునాతన చిప్ తయారీ ఫ్యాక్టరీలు, మొబైల్ రీసెర్చ్ హబ్‌లు ఉన్నాయి. సిలికాన్ వ్యాలీ నుంచి మైక్రోసాఫ్ట్, అమెజాన్, టెస్లా వంటి గ్లోబల్ టెక్ కంపెనీలు తమ కార్యకలాపాలను టెక్సాస్‌కు మార్చుకుంటున్న ట్రెండ్‌ను ఫాలో అవుతూనే శాంసంగ్ ఈ వ్యూహాత్మక అడుగు వేసింది. ఈ ప్రధాన కార్యాలయ సంపూర్ణ మార్పిడి ప్రక్రియ 2026 చివరి నాటికి వంద శాతం పూర్తి కానుంది.

Tags

Be the first to react

Latest