Hyderabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం.. పైలట్ల కళ్లు బైర్లు గమ్మేలా లేజర్ దాడులు.. పోలీసుల ముమ్మర వేట!

Hyderabad Airport: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ) పరిసరాల్లో విమానాల భద్రతకు సరికొత్త ముప్పు పొంచి ఉంది. విమానాలు టేకాఫ్ అవుతున్నప్పుడు లేదా ల్యాండింగ్ కోసం వస్తున్నప్పుడు వాటిపైకి శక్తివంతమైన లేజర్ కిరణాలను ప్రయోగించే ఘటనలు నగరంలో ఆందోళనకరంగా పెరుగుతున్నాయి.

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం..
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం..
  • దేశంలోనే అత్యధికంగా లేజర్ బీమ్ ప్రమాదాలు ఎదుర్కొంటున్న శంషాబాద్ విమానాశ్రయం..

  • Telangana: విమానాశ్రయం చుట్టుపక్కల ఉన్న ఫాంహౌస్‌లు, వెడ్డింగ్ హాళ్లే కారణమని గుర్తింపు..

Hyderabad Airport: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA - Shamshabad Airport) పరిసరాల్లో విమానాల భద్రతకు సరికొత్త ముప్పు పొంచి ఉంది. విమానాలు రన్‌వేపై ల్యాండింగ్ కోసం కిందకు దిగుతున్నప్పుడు లేదా టేకాఫ్ అవుతున్నప్పుడు.. వాటి కాక్‌పిట్‌లను (Cockpit) లక్ష్యంగా చేసుకుని శక్తివంతమైన లేజర్ కిరణాలను ప్రయోగించే ఘటనలు నగరంలో ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. గడిచిన రెండేళ్ల కాలంలోనే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పరిధిలో ఇలాంటివి ఏకంగా 100కు పైగా కేసులు నమోదు కావడం ఏవియేషన్ రంగాన్ని (Aviation Sector) తీవ్ర కలవరానికి గురిచేస్తోంది.

లూఫ్తాన్సా విమానానికి తప్పిన పెను ప్రమాదం!
దాదాపు రెండు వారాల క్రితం జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నగరం నుండి హైదరాబాద్ వచ్చిన లూఫ్తాన్సా (Lufthansa) విమానానికి ల్యాండింగ్ సమయంలో అత్యంత ప్రమాదకరమైన అనుభవం ఎదురైంది. విమానం రన్‌వేకు సమీపిస్తున్న అత్యంత కీలకమైన తరుణంలో, కాక్‌పిట్‌పైకి ఒక్కసారిగా హై-పవర్ లేజర్ కాంతి దూసుకొచ్చింది. ఆ తీవ్రమైన వెలుతురు వల్ల పైలట్ల కంటి చూపునకు తాత్కాలికంగా అంతరాయం (Temporary Blindness) కలిగింది. అయితే, పైలట్లు అత్యంత సమయస్ఫూర్తితో వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో వందలాది మంది ప్రయాణికులకు పెద్ద ప్రమాదం తప్పింది.

దేశంలోనే 4వ స్థానం.. ముంబై, బెంగళూరు కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువ!
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (Ministry of Civil Aviation) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా 43 విమానాశ్రయాలలో 1,000కు పైగా ఇలాంటి లేజర్ దాడుల ఘటనలు నమోదు కాగా.. అందులో 10 శాతం కేసులు కేవలం హైదరాబాద్‌లోనే జరగడం గమనార్హం.

దేశంలో ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా తర్వాత హైదరాబాద్ ఈ ప్రమాదకర జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. ఐటీ హబ్‌లుగా ఉన్న ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల కంటే హైదరాబాద్‌లోనే ఈ తరహా కేసులు రెండింతలు ఎక్కువగా ఉండటం భద్రతా సంస్థలను ఆలోచనలో పడేసింది.

ఈ తీవ్రమైన అంశంపై ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ (FIP) ప్రెసిడెంట్ కెప్టెన్ సి.ఎస్.రంధావా స్పందిస్తూ.. "ల్యాండింగ్ లేదా టేకాఫ్ సమయంలో కేవలం కొన్ని సెకన్ల పాటు లేజర్ కాంతి పైలట్ల కళ్లపై పడినా వారు తాత్కాలికంగా గుడ్డివారవుతారు. రన్‌వేపై విమానాన్ని అమర్చే సమయంలో ఇది జరిగితే ఊహించని విపత్తు సంభవిస్తుంది. ఇది విమాన భద్రతకు అత్యంత ప్రమాదకరమైన ఎలిమెంట్" అని ఆందోళన వ్యక్తం చేశారు.

రంగంలోకి సైబరాబాద్ పోలీస్.. ఫాంహౌస్‌లు, ఫంక్షన్ హాళ్లకు నోటీసులు..
ఈ లేజర్ దాడుల కలకలంపై శంషాబాద్ జోన్ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఎయిర్‌పోర్ట్ రన్‌వే చుట్టుపక్కల ఉన్న ఫాంహౌస్‌లు, ఫంక్షన్ హాళ్లు, ఓపెన్ గ్రౌండ్స్‌లో జరిగే పెళ్లిళ్లు, ఈవెంట్లలో వాడే డీజే (DJ) లైట్లు, హై-పవర్ లేజర్ బీమ్స్ (High-Power Laser Beams) విమానాల మార్గానికి అడ్డుగా వస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లోని 4 ఫాంహౌస్‌లు, రెండు వెడ్డింగ్ హాళ్ల యజమానులకు పోలీసులు ఇప్పటికే తీవ్ర హెచ్చరికలతో కూడిన నోటీసులు జారీ చేశారు. రాత్రి వేళల్లో ఆకాశంలోకి ప్రసరించే లేజర్ లైట్లను పూర్తిగా నిషేధించాలని, విమానాల భద్రతకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తే నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీస్ స్పష్టం చేసింది.

Tags

Be the first to react

Latest