⚡ BREAKING

భగభగ మండుతూ జనాలను ఉడికిస్తున్న సూరీడు! రికార్డు స్థాయిలో కరెంటు వినియోగం!

హైదరాబాద్: నగరంలో ఎండల తీవ్రత కొనసాగుతుండటంతో విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. సాధారణంగా వేసవి నెలల్లో కనిపించే స్థాయిలో ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యుత్ డిమాండ్ నమోదవుతోంది. బుధవారం విద్యుత్ వినియోగం ఈ సీజన్‌లోనే అత్యధిక స్థాయికి చేరుకుంది.

Peak power consumption in Hyderabad
Peak power consumption in Hyderabad
  • గ్రేటర్ హైదరాబాద్‌లో సెప్టెంబరులోనే సమ్మర్ తరహా విద్యుత్ డిమాండ్ నమోదవుతోంది.
  • విద్యుత్ డిమాండ్ 4,026 మెగావాట్లకు చేరి ఈ సీజన్‌లో రికార్డు స్థాయిని నమోదు చేసింది.

హైదరాబాద్: నగరంలో ఎండల తీవ్రత కొనసాగుతుండటంతో విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. సాధారణంగా వేసవి నెలల్లో కనిపించే స్థాయిలో ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యుత్ డిమాండ్ నమోదవుతోంది. బుధవారం విద్యుత్ వినియోగం ఈ సీజన్‌లోనే అత్యధిక స్థాయికి చేరుకుంది.

బుధవారం గ్రేటర్ పరిధిలో 84.82 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదవగా, విద్యుత్ డిమాండ్ 4,026 మెగావాట్లకు చేరింది. గత ఏడాది సెప్టెంబర్ 9న 75.39 మిలియన్ యూనిట్ల వినియోగం నమోదైంది. దీంతో పోలిస్తే ఈ ఏడాది అదే రోజున దాదాపు 10 మిలియన్ యూనిట్ల మేర వినియోగం పెరిగింది.

పెరిగిన వేడి.. పెరిగిన విద్యుత్ వినియోగం
నగరంలో వర్షాల ప్రభావం తక్కువగా ఉండటంతో పాటు మధ్యాహ్న సమయాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో వాతావరణంలో తేమ తగ్గి వేడి తీవ్రత మరింత పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు 34 నుంచి 38 డిగ్రీల మధ్య నమోదవుతుండటంతో ఇళ్లలో, కార్యాలయాల్లో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వినియోగం గణనీయంగా పెరిగింది.

రాత్రి వేళల్లోనూ సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో విద్యుత్ వినియోగంపై అదనపు భారం పడుతోంది.

సెప్టెంబరులోనే 4 వేల మెగావాట్లకు పైగా
సాధారణంగా గ్రేటర్ హైదరాబాద్‌లో ఫిబ్రవరి, మార్చి నెలల్లో విద్యుత్ డిమాండ్ 4 వేల మెగావాట్లకు చేరుకుంటుంది. అయితే ఈసారి సెప్టెంబర్ రెండో వారంలోనే ఆ స్థాయి డిమాండ్ నమోదవడం గమనార్హం. పెరిగిన లోడ్ కారణంగా పలు ప్రాంతాల్లోని డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లపై అదనపు భారం పడుతోంది. ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయాలు ఏర్పడుతున్నాయి.

మేలో రికార్డు డిమాండ్
2026లో గ్రేటర్ హైదరాబాద్‌లో అత్యధిక విద్యుత్ డిమాండ్ మే 22న నమోదైంది. ఆ రోజు 4,782 మెగావాట్ల డిమాండ్‌తో పాటు 101.07 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదైంది. సాధారణంగా 42-45 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే వేసవిలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతుంది. అయితే ఈసారి సెప్టెంబరులోనూ అదే తరహా పరిస్థితి కనిపిస్తోంది.

సెప్టెంబర్‌లో విద్యుత్ వినియోగం ఇలా..
2025 సెప్టెంబర్ 7న 62.17 మిలియన్ యూనిట్ల వినియోగంతో 3,051 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. సెప్టెంబర్ 8న 72.40 మిలియన్ యూనిట్లతో 3,560 మెగావాట్ల డిమాండ్ ఉండగా, సెప్టెంబర్ 9న 75.39 మిలియన్ యూనిట్ల వినియోగంతో 3,678 మెగావాట్ల డిమాండ్ నమోదైంది.

2026లో ఇదే తేదీల్లో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. సెప్టెంబర్ 7న 81.50 మిలియన్ యూనిట్లు, 3,918 మెగావాట్ల డిమాండ్ నమోదవగా.. సెప్టెంబర్ 8న 82.95 మిలియన్ యూనిట్లు, 4,058 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. సెప్టెంబర్ 9న 84.82 మిలియన్ యూనిట్ల వినియోగంతో 4,026 మెగావాట్ల డిమాండ్ నమోదైంది.

దీంతో వర్షాకాలం ముగియకముందే గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యుత్ వినియోగం వేసవి స్థాయులకు చేరుకోవడం విద్యుత్ పంపిణీ సంస్థలకు సవాలుగా మారింది.

Tags

Be the first to react

Latest