గోల్డ్‌తో మెరిసిన భారత్.. బద్దలైన ఆసియా రికార్డు.
Asian Games 2026: ఆసియా క్రీడల్లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో కమల్‌జీత్, సురుచి జోడీ అదరగొట్టింది. ఆరంభం నుంచే నిలకడైన ప్రదర్శన కనబరిచిన ఈ జోడీ.. ఫైనల్లో 484.6 పాయింట్లు సాధించి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో కొత్త ఆసియా రికార్డును నెలకొల్పింది.
- 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో కమల్‌జీత్-సురుచి జోడీ గోల్డ్ మెడల్ సాధించింది.
- షూటింగ్‌లో వరుస పతకాలతో ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వేటను కొనసాగిస్తోంది.
Asian Games 2026: ఆసియా క్రీడల్లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో కమల్‌జీత్, సురుచి జోడీ అదరగొట్టింది. ఆరంభం నుంచే నిలకడైన ప్రదర్శన కనబరిచిన ఈ జోడీ.. ఫైనల్లో 484.6 పాయింట్లు సాధించి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో కొత్త ఆసియా రికార్డును నెలకొల్పింది.
ఫైనల్ పోరులో భారత్‌కు కొరియా నుంచి గట్టి పోటీ ఎదురైంది. అయితే ఒత్తిడికి ఏమాత్రం తలొగ్గకుండా కమల్‌జీత్, సురుచి తమ ఆధిక్యాన్ని కొనసాగించారు. చివరికి 6.6 పాయింట్ల తేడాతో విజయం సాధించి పసిడి పతకాన్ని ముద్దాడారు. కొరియా 478 పాయింట్లతో రజతం, ఇరాన్ 415.8 పాయింట్లతో కాంస్యం సాధించాయి.
ఈ విజయంతో ఆసియా రికార్డు కూడా భారత జోడీ ఖాతాలోకి వచ్చింది. 484.6 పాయింట్లతో రికార్డు సృష్టించిన కమల్‌జీత్-సురుచి.. ప్రపంచ రికార్డుకు కేవలం 3.8 పాయింట్ల దూరంలో నిలిచారు. ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇది రెండో స్వర్ణ పతకం కావడం విశేషం.
రైఫిల్ విభాగంలోనూ మెరిసిన భారత షూటర్లు
50 మీటర్ల రైఫిల్ 3-పొజిషన్ పురుషుల టీమ్ విభాగంలో భారత్ రజత పతకాన్ని సాధించింది. ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ 589, నీరజ్ కుమార్ 588, రుద్రాంక్ష్ పాటిల్ 585 పాయింట్లు సాధించడంతో భారత జట్టు మొత్తం 1762 పాయింట్లు నమోదు చేసింది.
అయితే స్వర్ణం మాత్రం చైనా సొంతమైంది. చైనా జట్టు 1766 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. దక్షిణ కొరియా 1761 పాయింట్లతో కాంస్య పతకాన్ని దక్కించుకుంది.
రుద్రాంక్ష్‌కు వ్యక్తిగత ఫైనల్ అవకాశం చేజారింది
టీమ్ ఈవెంట్‌లో రుద్రాంక్ష్ పాటిల్ 585 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. అయితే వ్యక్తిగత ఫైనల్ విషయంలో నిబంధనలు అతడికి అడ్డంకిగా మారాయి. ఒక్కో దేశం నుంచి గరిష్ఠంగా ఇద్దరు షూటర్లకే వ్యక్తిగత ఫైనల్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది. దీంతో భారత్ తరఫున ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్, నీరజ్ కుమార్ తుదిపోరుకు అర్హత సాధించారు.
ఒకే రోజు షూటింగ్‌లో స్వర్ణం, రజతం సాధించడం ద్వారా ఆసియా క్రీడల్లో భారత బృందం తమ పతకాల వేటను మరింత బలపరిచింది.
Tags
Be the first to react