UPSC: సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు అలర్ట్..! యూపీఎస్సీ ఇంటర్వ్యూల రీషెడ్యూల్! Farmers: కూటమి సర్కార్ గుడ్‌న్యూస్..! అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు ఫిక్స్! Aadhaar Jobs: 10వ తరగతి అర్హతతో ఆధార్ ఉద్యోగాలు…! 282 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల! Postal: 10వ తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగం..! పరీక్ష లేకుండానే ఎంపిక! Students: గిరిజన విద్యార్థులకు ఏపీ సర్కార్ తీపికబురు..! రూ.100 కోట్ల స్కాలర్‌షిప్‌లు రిలీజ్! UPSC: సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు అలర్ట్..! యూపీఎస్సీ ఇంటర్వ్యూల రీషెడ్యూల్! Farmers: కూటమి సర్కార్ గుడ్‌న్యూస్..! అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు ఫిక్స్! Aadhaar Jobs: 10వ తరగతి అర్హతతో ఆధార్ ఉద్యోగాలు…! 282 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల! Postal: 10వ తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగం..! పరీక్ష లేకుండానే ఎంపిక! Students: గిరిజన విద్యార్థులకు ఏపీ సర్కార్ తీపికబురు..! రూ.100 కోట్ల స్కాలర్‌షిప్‌లు రిలీజ్!

Aadhaar Jobs: 10వ తరగతి అర్హతతో ఆధార్ ఉద్యోగాలు…! 282 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల!

 సీఎస్‌సీ ఈ-గవర్నెన్స్ సర్వీస్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఆధార్ సూపర్‌వైజర్, ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికే

2026-01-03 09:17:00
Land Regestration: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు!

సీఎస్‌సీ ఈ-గవర్నెన్స్ సర్వీస్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఆధార్ సూపర్‌వైజర్, ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 282 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. వివిధ రాష్ట్రాల్లోని జిల్లా కేంద్రాల్లో ఈ ఉద్యోగాలు అందుబాటులో ఉండగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉన్నట్లు సమాచారం. అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 31, 2026 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్ సేవలకు సంబంధించి అనుభవం ఉన్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు.

Praja Vedika: నేడు (3/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆధార్ సూపర్‌వైజర్ / ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నిర్దిష్ట అర్హతలను కలిగి ఉండాలి. పోస్టును అనుసరించి పదో తరగతితో పాటు మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా, లేదా ఇంటర్మీడియట్, లేదా పదో తరగతితో పాటు రెండేళ్ల ఐటీఐ కోర్సు పూర్తి చేసి ఉండాలి. అంతేకాకుండా సంబంధిత రంగంలో పని అనుభవం ఉండటం తప్పనిసరి. ముఖ్యంగా, అభ్యర్థులు యూఐడీఏఐ (UIDAI) ద్వారా జారీ చేసిన ఆధార్ ఆపరేటర్ లేదా సూపర్‌వైజర్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ ఉండటం కూడా తప్పనిసరి అర్హతగా పేర్కొన్నారు.

Fatty Liver: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా... లివర్ సమస్య ఉన్నట్లే! జర భద్రం గురూ!

అభ్యర్థుల వయోపరిమితి కనీసం 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. గరిష్ఠ వయోపరిమితిపై నోటిఫికేషన్‌లో ప్రత్యేకంగా ఎలాంటి పరిమితి పేర్కొనలేదు. ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియలో భాగంగా ఆన్‌లైన్ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారిని మాత్రమే నియామకాలకు పరిగణనలోకి తీసుకుంటారు. పరీక్ష విధానం, సిలబస్, మార్కుల వివరాలను నోటిఫికేషన్‌లో స్పష్టంగా పొందుపరిచారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే అభ్యర్థులు ముందుగానే పరీక్షకు సిద్ధం కావాలని సూచిస్తున్నారు.

West Bypass: ఏపీలో ఆ వెస్ట్ బైపాస్ శుభారంభం! ట్రాఫిక్ ఫ్రీ జర్నీ... గంట సమయం ఆదా!

అయితే, విలేజ్ లెవల్ ఎంట్రప్రెన్యూర్స్ (VLEs) ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు అని సీఎస్‌సీ స్పష్టం చేసింది. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే జరుగుతుందని, అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదివి దరఖాస్తు చేయాలని సూచించింది. పోస్టుల వివరాలు, జిల్లా వారీ ఖాళీలు, పరీక్ష విధానం, ఇతర నిబంధనలపై పూర్తి సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించాలని కోరింది. ప్రభుత్వ సేవలకు అనుబంధంగా, స్థిరమైన ఉద్యోగావకాశం కోరుకునే యువతకు ఈ నోటిఫికేషన్ ఒక మంచి అవకాశంగా నిలుస్తోంది.

ఆ గ్రామాల్లో 22 లక్షల పుస్తకాల పంపిణీ.. ఒకరోజు పంపిణీలో పాల్గొననున్న చంద్రబాబు!
Breaking News: వైసీపీకి భారీ షాక్.. టీడీపీ తీర్థం పుచ్చుకున్న కీలక నేత! మరికొందరు జంప్?
Bigg Boss 9: గత 5 సీజన్ల రికార్డు బ్రేక్ చేసిన బిగ్ బాస్-9 ఫినాలే.. ప్రేక్షకుల మద్దతే!
దట్టమైన పొగమంచు.. గజగజ వణికిస్తున్న చలి.. 10 విమానాలు రద్దు, హైవేలపై ప్రమాదాలు!
ఆ ఆలయానికి రూ.5 కోట్ల విరాళం ఇచ్చిన ముఖేశ్ అంబానీ! ప్రతి సంవత్సరం ఆరంభంలో..
Kim Jong Un: కిమ్ జోంగ్ ఉన్‌తో కుమార్తె అడుగులు… వారసత్వానికి సంకేతాలా!

Spotlight

Read More →