Railway Jobs: రాత పరీక్షలేకుండానే రైల్వేలో ఉద్యోగాలు.. ఈ అర్హతలు చాలు!

2026-01-06 16:36:00
Kondagattu Anjanna: కొండగట్టు అభివృద్ధికి భారీ నిధులు.. అంజన్న ఆశీస్సులతో సేవ.. పవన్ కళ్యాణ్!

క్రీడల్లో ప్రతిభ కనబరిచిన యువతకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం దక్కించుకునే అరుదైన అవకాశం లభించింది. కేంద్ర ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన పురుష, మహిళా క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 54 గ్రూప్ సి, గ్రూప్ డి పోస్టులను భర్తీ చేయనున్నారు. రైల్వే ఉద్యోగంతో పాటు క్రీడా ప్రతిభకు గుర్తింపు కోరుకునే వారికి ఇది గోల్డెన్ ఛాన్స్‌గా చెప్పవచ్చు.

China tension : అమెరికా-చైనా టెన్షన్.. మదురో అరెస్ట్ నేపథ్యంలో ప్రపంచ ప్రభావం!

ఈ నోటిఫికేషన్ కింద గ్రూప్-సి (లెవెల్-4, లెవెల్-5) కేటగిరీలో 5 పోస్టులు, గ్రూప్-సి (లెవెల్-2/3) కేటగిరీలో 16 పోస్టులు, గ్రూప్-డి (లెవెల్-1) కేటగిరీలో 33 పోస్టులు ఉన్నాయి. పోస్టును అనుసరించి అభ్యర్థులు పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. విద్యార్హతలతో పాటు క్రీడారంగంలో గుర్తింపు పొందిన విజయాలు తప్పనిసరి. ఈ నియామక ప్రక్రియ పూర్తిగా స్పోర్ట్స్ టాలెంట్ ఆధారంగానే జరుగుతుంది.

Andhra Pradesh:రూ.8.55 లక్షల కోట్ల పెట్టుబడులు.. ఎస్ఐపీబీ సమావేశంలో ఏపీ గ్రోత్!!

అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, హాకీ, స్విమ్మింగ్, వాటర్ పోలో, టేబుల్ టెన్నిస్, గోల్ఫ్, చెస్ తదితర క్రీడాంశాల్లో ఏదైనా ఒక విభాగంలో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా రాష్ట్ర, జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి ఉండాలి. అభ్యర్థుల వయోపరిమితి జనవరి 1, 2026 నాటికి కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 25 సంవత్సరాల మధ్య ఉండాలి. వయస్సు సడలింపులు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తాయి.

Bhogapuram airport : భోగాపురం ఎయిర్‌పోర్టుపై వైసీపీ క్రెడిట్ చోరీ రాజకీయాలు.. పట్టాభిరామ్ ఫైర్!

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ జనవరి 10, 2026 నుంచి ప్రారంభమవుతుంది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 9, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకంలో ఎలాంటి రాత పరీక్ష ఉండదు. అభ్యర్థుల విద్యార్హతలు, క్రీడా విజయాలు, గేమ్ స్కిల్, ఫిజికల్ ఫిట్‌నెస్, ట్రయల్స్ సమయంలో కోచ్‌లు చేసే పరిశీలన ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు రుసుము జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.500గా నిర్ణయించగా, ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, దివ్యాంగులు, మహిళలు, మైనారిటీలు, ఈబీసీ అభ్యర్థులకు రూ.250 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. రాత పరీక్ష భయం లేకుండా రైల్వే ఉద్యోగం పొందాలనుకునే క్రీడాకారులకు ఇది ఒక అద్భుత అవకాశం.

India Startup News: ప్రపంచ స్టార్టప్ పెట్టుబడుల్లో.. భారత్ స్థానం ఎంతంటే..!!
రాష్ట్ర మత్స్యకార సహకార సంఘాల సమాఖ్య ఎన్నికలు..!!
AP Government News: ఏపీ ప్రజలకు బంపర్ గుడ్‌న్యూస్.. తగ్గిన కరెంట్ ఛార్జీలు!
Child calcium: మీ పిల్లలకు కాల్షియం లోపమా.. వెంటనే ఈ ఫుడ్స్ ఇవ్వండి!
Fat Loss Tips: కొబ్బరి తో కూడా బరువు తగ్గొచ్చట.. కానీ ఈ నియమాలు పాటించకపోతే వృథానే!
Stock markets : నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. లాభాల స్వీకరణ ప్రభావం.. సూచీలు దిగువకు!

Spotlight

Read More →