దర్శి లో వైసీపీ దాస్టికం! సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న పేటీఎం బ్యాచ్!

Prakasam, darshi: ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో గణేష్ నిమజ్జనంలో పసుపు పడిందనే నెపంతో 70 ఏళ్ల టీడీపీ సీనియర్ నేత నాగేశ్వరరావును వైఎస్సార్‌సీపీ నాయకులు బెదిరించి బలవంతంగా వైఎస్సార్ విగ్రహాన్ని కడిగించారు. ఈ అవమానకర దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు రగిలిపోతున్నారు. అధికారంలో ఉన్నా తమ వారికి రక్షణ కల్పించలేకపోతున్నారని నాయకత్వంపై కేడర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది.

దర్శి లో వైసీపీ దాస్టికం
దర్శి లో వైసీపీ దాస్టికం
  • దర్శి నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత.. సీనియర్ టీడీపీ నేతను బెదిరించి వైఎస్సార్ విగ్రహాన్ని కడిగించిన వైనం!

  • గణేష్ నిమజ్జనంలో పసుపు పడిందని వృద్ధుడిపై దౌర్జన్యం.. వీడియో తీసి పైశాచిక పైత్యం!

  • అధికారంలో ఉన్నా దక్కని రక్షణ.. కార్యకర్తల గుండెల్లో రగిలిపోతున్న ఆక్రోశం!

Prakasam, Darshi: ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం, ముండ్లమూరు మండలం పరిధిలోని ఉమామహేశ్వరపురం గ్రామంలో తీవ్ర కలకలం రేపిన ఘటన వెలుగుచూసింది. స్థానిక తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత, నీటి సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్న 70 ఏళ్ల వృద్ధుడు కంచుమాటి నాగేశ్వరరావుపై స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. గ్రామంలో జరిగిన గణేష్ నిమజ్జనోత్సవ ఊరేగింపులో చల్లుకున్న పసుపు, గులాల్ రంగులు సమీపంలోని దివంగత వైఎస్సార్ విగ్రహంపై పడ్డాయన్న నెపంతో ఈ వివాదం చెలరేగింది.

అడ్డగించి.. బెదిరించి.. బలవంతంగా విగ్రహాన్ని కడిగించిన వైనం

మరుసటి రోజు ద్విచక్రవాహనంపై వెళ్తున్న నాగేశ్వరరావును స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు చింతల మంగారెడ్డి, వేముల శ్రీను సహా మరికొందరు అడ్డగించారు. తమ నాయకుడి విగ్రహంపై పసుపు చల్లడం మహా నేరమంటూ ఆ వృద్ధుడిని తీవ్రంగా దూషించి, బెదిరించారు. విధిలేని పరిస్థితుల్లో తీవ్ర భయాందోళనలకు గురైన నాగేశ్వరరావుతో బలవంతంగా వైఎస్సార్ విగ్రహాన్ని నీళ్లతో కడిగించారు. అంతటితో ఆగకుండా, ఆ దృశ్యాలను వెనుక నుంచి మొబైల్ ఫోన్లలో వీడియోలు తీసి, "రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నా మా దమ్ము ఇది" అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ప్రచారం చేసుకున్నారు. తీవ్ర అవమానభారంతో నాగేశ్వరరావు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

టీడీపీ కేడర్‌లో కట్టలు తెంచుకున్న ఆగ్రహం – ఆవేదన

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. తాము అధికారంలో ఉన్న సమయంలోనూ తమ పార్టీ సీనియర్ కార్యకర్తలకు, వృద్ధులకు రక్షణ లేకుండా పోయిందని, ప్రత్యర్థులు ఇంతలా అవమానిస్తుంటే నాయకత్వం ఏం చేస్తోందని కేడర్ ప్రశ్నిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో తీవ్ర అణచివేతకు గురైన కార్యకర్తలు, ప్రభుత్వం మారిన తర్వాత కూడా తమపైనే దాడులు, అవమానాలు జరుగుతుండటంపై తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. కేవలం అభివృద్ధి అభివృద్ధి అని చేతులు కట్టేసుకుని కూర్చుంటే క్షేత్రస్థాయిలో కార్యకర్తల ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని సోషల్ మీడియా వేదికగా తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు.

పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు

మరోవైపు అదే ప్రాంతంలో స్థానిక సీఐ, పోలీసు అధికారులతో వైఎస్సార్‌సీపీ నాయకులు అత్యంత దురుసుగా వ్యవహరిస్తూ బెదిరింపులకు దిగిన మరో వీడియో కూడా బయటకు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. క్షేత్రస్థాయిలో ఇంకా కొందరు పోలీసు అధికారులు పాత ప్రభుత్వ విధేయులుగా వ్యవహరిస్తున్నారని, అందుకే నేరస్థులకు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిందితులను అరెస్ట్ చేశారా లేదా అన్నదానిపై కూడా అధికారులు స్పష్టత ఇవ్వకపోవడం కేడర్ ఆగ్రహాన్ని మరింత పెంచింది. ప్రస్తుతం ప్రధాన నిందితుడు చింతల మంగారెడ్డితో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది.

అధినేతలు స్పందించకుంటే పెను నష్టం

దర్శి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు బాధితుడు నాగేశ్వరరావుతో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే, ప్రాజెక్టులు, పరిశ్రమలు, రోడ్లు వేయడం ఎంత ముఖ్యమో.. క్షేత్రస్థాయిలో పార్టీ జెండా మోసే కార్యకర్త ఆత్మగౌరవాన్ని కాపాడటం కూడా అంతే ముఖ్యమని పరిశీలకులు గుర్తుచేస్తున్నారు. ఇలాంటి పైశాచిక చర్యలకు పాల్పడిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించకపోతే, ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడే సాధారణ కార్యకర్త మానసికంగా కుంగిపోయి పార్టీకే తీరని నష్టం వాటిల్లే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.

Tags

Be the first to react

Latest