మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న పవన్ కల్యాణ్
Pawankalyan Voting: మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేయడం కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకుని మంగళగిరికి విచ్చేసిన ఆయన, శ్రీ లక్ష్మీనరసింహ కాలనీ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.
మంగళగిరిలోని శ్రీ లక్ష్మీనరసింహ కాలనీ పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్!
ఓటు వేసేందుకు ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకుని అక్కడి నుంచి మంగళగిరికి వచ్చిన పవన్ కల్యాణ్!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాకతో శ్రీ లక్ష్మీనరసింహ కాలనీ పోలింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు!
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా మంగళగిరిలోని ఎంఎస్ నగర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన 34వ డివిజన్ పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆయన ఓటు వేశారు. గురువారం ఉదయం సుమారు 11:30 గంటల సమయంలో పవన్ కల్యాణ్ పోలింగ్ కేంద్రానికి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటు వేసిన అనంతరం ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. అర్హులైన ఓటర్లంతా బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అలాగే రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
Tags
Be the first to react